ముంబై/హైదరాబాద్ : ఈ ఆర్థిక సంవత్సరం తమ బ్యాంక్‌కు అత్యంత కీలక సంవత్సరమని ఎస్‌బీఐ చైర్మన్ రజనీశ్ కుమార్ అన్నారు. దేశీయంగా, అంతర్జాతీయంగా సుస్థిర వృద్ధికి అవకాశం ఉన్న మరిన్ని వ్యాపారాల కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటామని బ్యాంక్ తాజా వార్షిక నివేదికలో పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం రుణాల పంపిణీలోనూ 10 నుంచి 12 శాతం వృద్ధి రేటు సాధించాలని ఎస్‌బీఐ లక్ష్యంగా పెట్టుకుంది.

ఎస్‌బీఐ వార్షిక నివేదిక..! సుస్థిర వృద్దికి అస్కారముందన్న ఉన్నతాదికారులు..!!
వృద్ధి రేటు గాడిలో పడుతున్నందున ఈ లక్ష్య సాధన పెద్ద కష్టంకాకపోవచ్చని రజనీశ్ విశ్వాసం వ్యక్తం చేశారు. గత ఆర్థిక సంవత్సరం నష్ట భయం ఎక్కువగా ఉండే రుణాలను తగ్గించుకోవడం, అంతర్గత కార్పొరేట్ బ్యాంకింగ్ పునర్ వ్యవస్థీకరణ ద్వారా ఎస్‌బీఐ రుణాల వృద్ధి రేటు పెంచుకుంది. 'ఈ సంవత్సరం మాత్రం పరపతి వృద్ధి రేటు 'పునరుద్ధరణ వ్యూహం' పురోగతిపై ఆధారిపడి ఉంటుంది' అని రజనీశ్ పేర్కొన్నారు. బ్యాంక్ ఆర్థిక పరిస్థితి కోలుకోవడం అంటే ఏదో యాంత్రికంగా లెక్కల గణాంకాలు మారడం కాదని రజనీశ్ కుమార్ స్పష్టం చేశారు. సంస్థాగత మార్పులు, పెట్టుబడుల్లో వ్యూహాత్మక మార్పుల ద్వారానే ఏ బ్యాంక్ అయినా కోలుకోవడం సాధ్యమవుతుందన్నారు.

నిర్మాణాత్మక మార్పు..! ఐదింటిపై ప్రత్యేక దృష్టి..!!
ఇలాంటి రికవరీ వలన రుణాలపై రాబడులు పెరగడంతో పాటు, ఆస్తులు-అప్పుల మధ్య ఉన్న వ్యత్యాసమూ కుదురుకుంటాయన్నారు. పెట్టుబడులపై చెల్లింపుల కాలమూ తగ్గుతుందన్నారు. సమూల మార్పుల్లో భాగంగా ఖాతాదారుల సంతృప్తి, కార్పొరేట్ రుణాల పునర్ వ్యవస్థీకరణ, బ్యాంకింగ్ కార్యకలాపాల డిజిటైజేషన్, ఎస్‌బీఐ అనుబంధ సంస్థలు - ఎస్‌బీఐ సిబ్బంది మధ్య సరైన సమన్వయం అనే ఐదు కీలక అంశాలపై ఈ ఆర్థిక సంవత్సరం ప్రత్యేక దృష్టి పెట్టాలని ఎస్‌బీఐ నిర్ణయించినట్టు చైర్మన్ తెలిపారు. ప్రస్తుతం టెక్నాలజీ ద్వారా బ్యాంకింగ్ సేవలు అందించడం మరింత విస్తృతమైందన్నారు.

రెట్టింపు చేయాలనే లక్ష్యం..!!
ఖాతాదారులపైనే దృష్టి..! రెట్టింపు చేయాలనే లక్ష్యం..!!
డిజిటల్ చానళ్లు, ఏటీఎంలు, మొబైల్ బ్యాంకింగ్ రంగంలో ఎస్‌బీఐ ఇప్పటికే దేశ బ్యాంకింగ్ రంగంలో నాయకత్వ స్థానంలో ఉందన్నారు. యోనో యాప్ ద్వారా అందించే బ్యాంకింగ్ సేవలను మరింత విస్తృతం చేయబోతున్నట్టు తెలిపారు. నయి దిశ ఫేజ్ (ఈ-డీఎఫ్ఎస్) ఆధారంగా కార్పొరేట్ ఖాతాదారులకు మరిన్ని టెక్నాలజీ ఆధారిత ఉత్పత్తులను అందుబాటులోకి తేవాలని ఎస్‌బీఐ భావిస్తోంది. ఈ సంవత్సరం ఖాతాదారుల సేవలపైనా ప్రత్యేక దృష్టి పెట్టాలని ఎస్‌బీఐ భావిస్తోంది. ఇందుకోసం తమ సేవలపై ఖాతాదారులు సంతృప్తిగా ఉన్నారా? లేదా? అనే విషయం తెలుసుకునేందుకు 'నయి దిశ ఫేజ్ 2' పేరుతో ప్రత్యేక కార్యక్రమం చేపడుతుంది. ఇందుకోసం ఉద్యోగులకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు చేపట్టనున్నట్టు రజనీశ్ పేర్కొన్నారు.

కొత్త విభాగాలపై దృష్టి..! ప్రత్యేక నిపుణులనూ నియమించుకునే యోచన..!!
అవసరమైతే ఇందుకోసం ప్రత్యేక నిపుణులనూ నియమించుకుంటామని తెలిపారు. కొత్త ఖాతాదారులను సంపాదించడం కంటే వివిధ వ్యాపారాలకు సంబంధించి ప్రస్తుతం ఎస్‌బీఐకి భారీ సంఖ్యలో ఉన్న ఖాతాదారులకు మరింత మెరుగైన సేవలు అందించడం మంచిదని బ్యాంక్ భావిస్తోంది. దీని వల్ల బ్యాంక్ వ్యాపారం మరింత విస్తృతమవుతుందని అంచనా. గత రెండేళ్లలో ఎస్‌బీఐ కార్పొరేట్ రుణాలు బాగా పెంచుకుంది. ఇప్పుడు మరిన్ని పారిశ్రామిక రంగాలకు పరపతి అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. ఇందుకోసం బ్యాంక్‌లోని కార్పొరేట్ రుణ విభాగాన్ని పూర్తిగా పునర్ వ్యవస్థీకరిస్తోంది. దీని వల్ల కొత్త పారిశ్రామిక విభాగాలకూ మరింత విస్తృతంగా రుణాలు అందించవచ్చని భావిస్తోంది. మున్ముందు ఇందుకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వబోతున్నట్టు ఎస్‌బీఐ చైర్మన్ బ్యాంక్ వార్షిక నివేదికలో పేర్కొన్నారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications