లోక్ సభ ఎన్నికలు ముగిశాయి. మరోవైపు సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ఘన విజయం సాధించింది. దీని ప్రభావం వల్ల వడ్డీ రేట్లలో పావు శాతం కోత పడే అవకాశం వుంది. మార్చి త్రైమాసికంలో ఆర్థిక వృద్ధి నెమ్మదించే అవకాశాలు ఉండటంతో జూన్ సమీక్షలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక వడ్డీరేట్లను తగ్గించ వచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరానికి గానూ ఆర్‌బీఐ రెండో ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష జూన్‌లో జరగనుంది. జూన్ 6న సమీక్ష నిర్ణయాలను కేంద్రబ్యాంకు వెల్లడిస్తుంది.
లోక్‌సభ ఫలితాల తర్వాత జరిగే తొలి సమీక్ష కావడంతో దీనిపై ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉండగా.. ఈ ఏడాది ఫిబ్రవరి, ఏప్రిల్‌లో జరిగిన ద్వైమాసిక సమీక్షల్లో 25 బేసిస్ పాయింట్ల చొప్పున ఆర్‌బీఐ కీలక వడ్డీరేట్లను తగ్గించింది. దీని ప్రకారం.. ప్రస్తుతం రెపో రేటు 6శాతంగా ఉంది. 2018-19 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికానికి సంబంధించి ఆర్థిక వృద్ధి గణాంకాలు వెలువడనున్నాయి. ఈ త్రైమాసికంలో ఆర్థిక వృద్ధి ఏడు త్రైమాసికాల కనిష్ఠానికి 6.1శాతంగా నమోదయ్యే అవకాశాలున్నాయని డీబీఎస్ గ్రూప్ రీసెర్చ్ తమ అధ్యయనంలో పేర్కొంది.

ఈ నేపథ్యంలో కీలక వడ్డీరేట్లు తగ్గొచ్చని అంచనా వేస్తోంది. ఇక జూన్‌లోనూ వడ్డీరేట్ల తగ్గింపు చేపడితే.. ఈ ఏడాదిలో వరుసగా మూడు సార్లు వడ్డీరేట్లను తగ్గించినట్లవుతుంది. అదే జరిగితే రెపో రేటు 5.75శాతానికి తగ్గుతుందని భావిస్తున్నారు. మరోవైపు సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే ఘన విజయం కూడా వడ్డీరేట్ల కోతకు ఓ కారణమయ్యే అవకాశముందని కొటక్ మహీంద్రా బ్యాంక్ అధ్యక్షుడు శాంతి ఏకాంబరం పేర్కొన్నారు. ఏది ఏమైనా ఈ త్రైమాసికంలో కూడా వడ్డీ రేట్లు తగ్గనున్నాయి.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications