కారు రెంటల్ కంపెనీ జూమ్‌కార్ తన కంపెనీ ఆరవ యానివర్సరీ సెలబ్రేషన్స్ సందర్భంగా అద్భుతమైన ఆఫర్ ప్రకటించింది. LoveYouBack (లవ్యూబ్యాక్) సేల్ పేరుతో 100 శాతం డిస్కౌంట్ ప్రకటించింది. మే 29వ తేదీ నుంచి మే 31వ తేదీ వరకు ఈ ఆఫర్ ప్రకటించింది. నేటితో ముగియనుంది. అన్ని సెల్ఫ్ డ్రైవింగ్ బుకింగ్స్ పైన ఇది వర్తింప చేసింది. మినిమం బుకింగ్ డ్యురేషన్ 12 గంటలు. బుక్ చేసుకున్న కారుతో జూన్ 8వ తేదీ నుంచి నవంబర్ 25వ తేదీ మధ్య ఎప్పుడైనా ప్రయాణం చేయవచ్చు.

వంద శాతం ఫ్రీ!
ఒకవేళ మీరు ట్రిప్‌ను రద్దు చేసుకున్నా కూడా ఎలాంటి క్యాన్సిలేషన్ ఛార్జీలు ఉండవు. వంద శాతం తగ్గింపు ఆఫర్‌లో యాభై శాతం క్యాష్ బ్యాక్ రూపంలో, మరో 50 శాతం డిస్కౌంట్ రూపంలోను ఉంటుంది. ఈ ఆఫర్‌ను పొందాలంటే ఎల్‌యూవీ100 (LUV100) ప్రోమో కోడ్ అవసరం. అంతేకాదు, ఈ మూడు రోజుల పాటుఓ లక్కీ కస్టమర్‌ను ఎంపిక చేస్తుంది. ప్రతి రోజు ఎంపిక చేయబడిన లక్కీ కస్టమర్‌కు ఉచిత ప్లైట్ వోచర్, ఎక్స్‌పీరియన్స్ హాలీడే వోచర్ అందిస్తుంది. ఫ్లైట్ ఓటర్, ఎక్స్‌పీరియన్స్ హాలీడే వోచర్‌లలో రెండింటినీ క్లెయిమ్ చేసుకోలేరు. ఫ్లైట్ ఓచర్‌తో ఫ్లైట్ బుక్ చేసుకొని 100 శాతం క్యాష్ బ్యాక్ పొందవచ్చు. 2 nights/3 days రెండు వోచర్లు కలిగిందే ఎక్స్‌పీరియన్స్ హాలీడే వోచర్.

టర్మ్స్ అండ్ కండిషన్స్
- మే 29వ తేదీన ఉదయం 12 గంటలకు (అర్ధరాత్రి) ప్రారంభమైన ఈ ఆఫర్ మే 31 రాత్రి 11.59 నిమిషాలకు (అర్ధరాత్రి) ముగుస్తుంది. అంటే మరికొద్ది గంటల్లో ముగుస్తోంది.
- 50 శాతం క్రెడిట్ జూమ్‌కార్ క్రెడిట్స్‌లోకి వస్తుంది. మీ ట్రిప్ కంప్లీట్ అయిన తర్వాత 30 రోజుల్లో అది మీ అకౌంట్లోకి వస్తుంది.
- అందరు యూజర్లు రీఫండబుల్ పూర్తి పేమెంట్ డిపాజిట్ చేయాలి. సేల్ పీరిడయడ్‌లో జూమ్ క్రెడిట్స్ యూసేజ్ అలో చేయరు.
- పేటీఎం ద్వారా పే చేస్తే పేటీఎం క్యాష్ బ్యాక్ రూ.1,000 వరకు పొందవచ్చు. (ఫస్ట్ టైమ్ జూమ్‌కార్ యూజర్లు దీనికి ఎలిజిబుల్ కాదు. బుకింగ్ కంప్లీట్ అయిన తర్వాత 30 రోజుల్లో క్యాష్ బ్యాక్ మీ పేటీఎం వాలెట్‌లోకి వస్తుంది.)
- సేల్ పీరియడ్ ముగిసిన తర్వాత విన్నర్‌ను జూమ్‌కార్ అఫీషియల్ ఫేస్‌బుక్ పేజీపై అనౌన్స్ చేస్తారు.
- ఒరిజినల్ రిజర్వేషన్స్ ఛార్జీల పైనే డిస్కౌంట్ అప్లై అవుతుంది.
- ట్రిప్‌కు 24 గంటల తర్వాత క్యాన్సిలేషన్ పైన ఎలాంటి క్యాన్సిలేషన్ ఛార్జ్ లేదు.
- ట్రిప్‌కు 24 గంటల ముందు (అంటే మరో 24 గంటలు అంతకంటే తక్కువ సమయం) క్యాన్సిలేషన్ అయితే 50 శాతం చార్జ్.

ఇండియాలో జూమ్‌కార్ జర్నీ ఆరేళ్లు
ఇండియాలో జూమ్‌కార్ జర్నీ ఆరేళ్లు. 2013 తొలి నగరం నుంచి ప్రారంభమైన జూమ్‌కార్ సేవలు 2019 నాటికి 47 నగరాలకు చేరుకుంది. ఇప్పటి వరకు 7 మిలియన్ల ట్రాన్సాక్షన్లు జరిపారు. జూమ్‌కార్‌ను ఇప్పటి వరకు 5 మిలియన్ల మంది ఉపయోగించారు. జూమ్‌కార్‌కు ఇండియాలో 7000 కార్లు ఉన్నాయి. గంటకు, రోజుకు, వారానికి, నెలకు చొప్పున.. జూమ్‌కార్ కారును రెంట్‌కు ఇస్తుంది. బెంగళూరులో హెడ్ క్వార్టర్ ఉంది. ZAP కింద జూమ్‌కార్ 2018లో తొలి కారు సబ్‌స్క్రిప్షన్ ప్రోగ్రాంను ప్రారంభించింది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..



Click it and Unblock the Notifications