దక్షిణ కొరియాకు చెందిన కియా మోటార్స్ ఇండియా వచ్చే నెల 20న తన తొలి మిడ్ స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్ (ఎస్ యూవీ ) ను దేశీయ మార్కెట్లో ఆవిష్కరించడానికి సన్నాహాలు చేసుకుంటోంది. ప్రస్తుతం దీని పేరు ఎస్ పీ 2ఐ. దీన్ని సెప్టెంబర్ నాటికీ మార్కెట్లోకి విడుదల చేయాలనీ కంపెనీ యోచిస్తోంది. ఈ కారు ఇంటీరియర్ చిత్రాలను ఇప్పటికే కంపెనీ విడుదల చేసింది. వీటినిబట్టి అత్యాధునికి ఫీచర్లు ఈ కారులో ఉన్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా కొద్దీ కాలంలోనే తన వాహనాల సంఖ్యను భారీ స్థాయిలో పెంచుకోవాలనుకుంటోంది. ఆ వివరాలను కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, చీఫ్ సేల్స్ ఆఫీసర్ యాంగ్ ఎస్ కిమ్ వెల్లడించారు. ప్రతి ఆరు నుంచి తొమ్మిది నెలల కాలంలో ఒక కొత్త కారును తీసుకు రావాలన్నది కంపెనీ లక్ష్యం. ఇలా విడుదల చేసి 2021 నాటికీ కనీసం భారత మార్కెట్లో 5 వాహనాలను కలిగి ఉండాలని కంపెనీ భావిస్తోంది.
2020నాటికే మూడు ఎస్ యూవీలను మార్కెట్లోకి తీసుకురావాలన్నది కంపెనీ యో చన. దేశీయ మార్కెట్లో ఎస్ యూ వీ లకు ఎక్కువ డిమాండ్ ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలోనే కియా మోటార్స్ ఈ వాహనాలకు ప్రాధాన్యం ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఇక కియా మోటార్స్ విడుదల చేసే ఎస్ పీ 2ఐ ప్రస్తుతం మార్కెట్లో ఉన్న టాటా హరియర్, హ్యుండై క్రెటా, రెనో క్యాప్చర్, నిస్సాన్ కిక్స్ కు పోటీగా నిలిచే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ కంపెనీ చాలా ఆలస్యంగా భారత మార్కెట్లోకి వస్తోంది. అయినప్పటికీ దేశీయ మార్కెట్లో తన సత్తా చాటుకోవాలని అనుకుంటోంది. కియా తెచ్చే రెండో కారు సబ్ 4 మీటర్ కాంపాక్ట్ ఎస్ యు వి అని తెలుస్తోంది. ఇది ఇటీవలే హ్యుండై విడుదల చేసిన వెన్యూ, మారుతి బ్రేజ్జా, టాటా నిక్సన్, ఫోర్డ్ ఎకో స్పోర్ట్, మహీంద్రా ఎస్ యు వి 300 మోడళ్లకు పోటీగా నిలుస్తుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

అనంతపురంలో ప్లాంట్
కియా మోటార్స్ ఆంధ్ర ప్రదేశ్ లోని అనంతపురం జిల్లాలో తన కార్ల ప్లాంటును ఏర్పాటు చేసింది. దీని విస్తీర్ణం 536 ఎకరాలు. ఈ ప్లాంట్ వార్షిక స్థాపిత ఉత్పత్తి సామర్థ్యం 3 లక్షలు. ఈ ప్లాంట్ ద్వారా 10,000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుందని కంపెనీ చెబుతోంది. కియా కార్లు కొనుగోలు చేసే వారికి ఫైనాన్స్ సదుపాయం కల్పించేందుకు గాను ఎనిమిది బ్యాంకులతో కంపెనీ ఒప్పందాలు చేసుకుంది.
ఎస్ యు వీ లకు జోరుగా గిరాకీ
చిన్న కార్లకన్నా ఎస్ యు వీలు కొనుగోలు చేసేందుకు కస్టమర్లు ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నారు. గత ఏప్రిల్ నెలలో మారుతి బ్రేజ్జా 11, 785, హ్యుండై క్రెటా 10,487, మారుతి ఎర్టిగా 8,087, టొయోటా క్రిష్ట 5,621, మహీంద్రా బొలెరో 5,310 అమ్మకాలు నమోదు చేసుకున్నాయి. ఇలా ఎస్ యు వీ లకు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో కంపెనీలు వీటిపై ఎక్కువగా దృష్టిసారిస్తున్నాయి.
More From GoodReturns

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: బెంగళూరు వాహనదారులకు అలర్ట్! ఆ రూట్లో ఫ్లైఓవర్ 84 గంటలు బంద్!



Click it and Unblock the Notifications