హైదరాబాద్: డిగ్రీలు, వృత్తి విద్యా కోర్సులు పూర్తి చేసుకున్న విద్యార్థులకు వేతనాల స్టైపెండ్ చెల్లింపుల్లో హైదరాబాద్ మెరుగైన స్థానంలో ఉంది. సాధారణం కన్నా 132 శాతం అధికంగా ఇక్కడి కంపెనీలు, సంస్థలు అభ్యర్థులకు వేతనాలు చెల్లిస్తున్నాయట. ఈ విషయంలో మహారాష్ట్రలో అత్యధికంగా 159 శాతం వేతనం లభిస్తోందట.
ఒకవైపు కంపెనీలకు అవసరమైన ఉద్యోగులు లభించడం లేదు. మరోవైపు చదువు పూర్తి చేసుకున్న విద్యార్థులకు ఉద్యోగం లభించడం లేదు. ఈ అగాధాన్ని పూడ్చేందుకు అటు ప్రభుత్వాలు, ఇటు కంపెనీలు అనేక రకాలుగా ప్రయత్నిస్తున్నా ఫలితాలు మాత్రం అంతంత మాత్రమే. అయితే ఇటీవల ఈ పరిస్థితిలో కాస్త మార్పు కనిపిస్తోంది. కంపెనీలు అప్రెంటిస్‌షిప్ విధానంలో తాజాగా డిగ్రీలు, డిప్లమాలు పూర్తి చేసుకున్న వారికి లేదా చివరి సంవత్సరంలో ఉన్నవారికి తమ సంస్థలో పూర్తిస్థాయిలో లేదా పార్ట్ టైమ్ జాబ్స్ ఇస్తున్నాయి.
మూడు నెలల నుంచే ఏడాది కాలానికి ఈ తరహా జాబ్స్ ఉంటాయి. ఇలా చేయడం వల్ల అటు అభ్యర్థికి వృత్తిపై పూర్తి అవగాహన ఏర్పడుతుంది. పని విధానం కంపెనీ నిబంధనలు తెలుస్తాయి. ఇటు కంపెనీలకు స్వల్ప కాలానికి ఉద్యోగుల లోటు తీరుతుంది.

ఒకవేళ అప్రెంటిస్‌షిప్ పూర్తి చేసుకున్న అభ్యర్థి పని విధానం నచ్చితే అదే కంపెనీ అతనికి పూర్తిస్థాయి ఉద్యోగం సైతం ఆఫర్ చేస్తాయి. ఇది ఉభయులకూ ఆమోదయోగ్యమైన, ప్రయోజనకరమైన పద్దతిగా ప్రాచుర్యం పొందింది.
సాధారణంగా స్టైఫెండ్ రూపంలో రూ.5,000 నుంచి రూ.10,000 మించి ఇవ్వరు. కానీ ఇటీవల డిమాండ్ పెరగడంతో హైదరాబాదులో 132 శాతం అధిక స్టైఫండ్ ఇచ్చి మరీ అభ్యర్థులను ఎంపిక చేసుకుంటున్నారని టీమ్ లీజ్ అనే సంస్థ చేసిన సర్వేలో తేలింది.
ఒక నగరంలో ఇలా స్టైఫండ్ చెల్లింపుల్లో మెరుగైన పెరుగుదల ఉందంటే ఆ నగరం వృద్దిబాటలో పయనిస్తోందని, ఉద్యోగులకు డిమాండ్ అధికంగా ఉందని అర్థమట. అంటే మన హైదరాబాదులో కావాల్సినన్ని జాబ్స్ ఉన్నాయని ఈ సర్వే తేలుస్తోంది. సో.. ఇంకెందుకు ఆలస్యం. వెంటనే ఏదో ఒక జాబ్‌లో చేరిపోండి. జీవితంలో స్థిరపడండి.


Click it and Unblock the Notifications