For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆయన పదవి వీడితేనే మంచిది!: ఫేస్‌బుక్ సీఈవో జుకర్‌బర్గ్‌కు షేర్ హోల్డర్ షాక్

|

ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ ఓటింగ్‌ను ఎదుర్కోనున్నారు. ఆయన ఇప్పుడు ఫేస్‌బుక్ చైర్మన్ పదవి నుంచి వైదొలిగే పరిస్థితులు ఏర్పడ్డాయి. గురువారం వార్షిక సమావేశంలో లీడర్‌షిప్ ఓటు ద్వారా అతనికి ఛాలెంజ్ ఎదురుకానుంది. జుకర్‌బర్గ్ నేతృత్వంలో గోప్యత నిబంధనలను ఫేస్‌బుక్ సరైనవిధంగా ఎదుర్కోలేకపోతోందని వాటాదారుల్లో అసంతృప్తి ఉంది. దీంతో ఏం జరుగుతుందోననే ఉత్కంఠ నెలకొంది.

ఫ్రెషర్స్‌కు కాగ్నిజెంట్ బంపరాఫర్, 18% శాలరీ హైక్ఫ్రెషర్స్‌కు కాగ్నిజెంట్ బంపరాఫర్, 18% శాలరీ హైక్

ఫేస్‌బుక్‌లో జుకర్ బర్గ్ వాటా 60 శాతం

ఫేస్‌బుక్‌లో జుకర్ బర్గ్ వాటా 60 శాతం

అయితే ఫేస్‌బుక్‌లో జుకర్ బర్గ్ వాటా 60 శాతం వరకు ఉండటంతో వచ్చిన ఇబ్బందేమీ లేదని కూడా అంటున్నారు. అయితే గురువారం జరగనున్న ఓటింగులో జుకర్ బర్గ్‌కు వచ్చే ఓట్లను బట్టి షేర్ హోల్డర్స్‌కు ఆయనపై ఉన్న విశ్వాసం వెల్లడవుతుందని చెబుతున్నారు. జుకర్ బర్గ్ చైర్మన్‌గా వైదొలగాలని 7 మిలియన్ డాలర్ల విలువైన షేర్లు కలిగిన ట్రిలియమ్ అసెట్ మేనేజ్‌మెంట్ ప్రతిపాదించింది. FB సెక్యూరిటీ మాజీ చీఫ్ కూడా ఇదే కోరుకుంటున్నారు.

మార్క్ జుకర్‌బర్గ్ ఫేస్‌బుక్ సీఈవో. అలాగే బోర్డ్ ఆప్ డైరెక్టర్స్ చైర్మన్. ఆయన చైర్మన్ పదవి నుంచి తప్పుకుంటేనే కంపెనీపై మరింత దృష్టి సారిస్తారనేది ఆయనను తప్పుకోమని చెబుతున్నవారి మాట.

జుకర్ బర్గ్ దిగిపోతేనే లాభం

జుకర్ బర్గ్ దిగిపోతేనే లాభం

మార్క్ జుకర్‌బర్గ్ రెండు కీలక పదవుల్లో ఉన్నారని, కంపెనీ సీఈవోగా ఆయన ఫేస్‌బుక్ పైన ఎక్కువ దృష్టి సారించాలని, అందుకు చైర్మన్ పదవిని మరొకరికి ఇస్తేనే బాగుంటుందని, ఇది కంపెనీ వృద్ధికి ఎంతో ఉపయోగపడుతుందని ట్రిలియమ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జోనాస్ క్రోన్ అన్నారు. ఇందుకు ఉదాహరణలు ఉన్నాయని, అల్పాబెట్ - లారీ పేజ్, మైక్రోసాఫ్ట్ - బిల్‌గేట్స్ ఉదాహరణ అన్నారు. ఇక్కడ ఫౌండర్స్ చైర్మన్‌గా లేరని గుర్తు చేశారు. ఇది అంత సులభమైన విషయం కాదని తనకు తెలుసునని (60 శాతం షేర్లతో చైర్మన్‌గా మార్క్ జుకర్‌బర్గ్‌ను తప్పించడం), కానీ ఆయన తప్పుకుంటే ఆయనతోపాటు షేర్ హోల్డర్లకు, తద్వారా సంస్థకు లాభమని చెప్పారు.

గతంలోను...

గతంలోను...

మాజీ సెక్యూరిటీచీఫ్ అలెక్స్ స్టామోస్ ఇదివరకే.. జుకర్ బర్గ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ పదవి నుంచి తప్పుకోవాలని చెప్పారు. అతను చాలా ఎక్కువ అధికారాలు కలిగి ఉన్నారని చెప్పారు. అయితే తన నాయకత్వాన్ని జుకర్ బర్గ్ సమర్థించుకున్నారు. ఫేస్‌బుక్ వంటి ప్రపంచ దిగ్గజ సంస్థను నిర్మించినప్పుడు ఇలాంటి గందరగోళపరిచే అంశాలు ఉంటాయని జుకర్ బర్గ్ అన్నారు.

English summary

ఆయన పదవి వీడితేనే మంచిది!: ఫేస్‌బుక్ సీఈవో జుకర్‌బర్గ్‌కు షేర్ హోల్డర్ షాక్ | Facebook CEO Mark Zuckerberg to Face Shareholders Vote

A vote calling for Mark Zuckerberg to stand down as Facebook's chairman is expected to take place at the company's annual general meeting on Thursday.
Story first published: Thursday, May 30, 2019, 16:16 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X