అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రెండో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గురువారం మధ్యాహ్నం ఆయనతో గవర్నర్ నరసింహన్ ఏపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయించారు. జగన్ ప్రమాణ స్వీకారానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, డీఎంకే చీఫ్ స్టాలిన్ తదితరులు హాజరయ్యారు. ప్రమాణ స్వీకారం అనంతరం జగన్ తన హామీలు, నవరత్నాల గురించి మాట్లాడారు. సీఎంగా ఆయన తొలిసారి అదే వేదిక మీద మాట్లాడారు.

పింఛన్ విషయంలో ఏపీవాసులకు శుభవార్త
వైయస్ జగన్ అను నేను మీ అందరికీ ఒకే మాట చెబుతున్నా.. నేను ఉన్నానని గట్టిగా చెబుతున్నా... ఆకాశమంతటి విజయాన్ని అందించిన మీ అందరికీ కృతజ్ఞతలు.... పదేళ్లుగా నా రాజకీయ జీవితంలో 3,648 కి.మీ పాదయాత్ర చేశా... పాదయాత్రలో పేదలు పడిన కష్టాలు చూశానని.. జగన్ పేర్కొన్నారు. అనంతరం వైయస్సార్ పింఛన్ ఫైల్ పైన తొలి సంతకం చేస్తున్నట్లు ప్రకటించారు. పింఛన్ విషయంలో ఏపీ వాసులకు శుభవార్త చెప్పారు. పింఛన్ క్రమంగా పెంచుతామన్నారు.

ప్రతి ఏటా పింఛన్ పెంపు
వృద్ధాప్య పింఛన్‌ను రూ.3వేలు చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో జగన్ ప్రకటించారు. అందుకు అనుగుణంగా ఏడాదికి రూ.250 పెంచుతానని ప్రకటించారు. ఇప్పటి వరకు రూ.2,000గా ఉన్న పింఛన్‌ను ఇక నుంచి రూ.2,250గా చేస్తామని, ఇది జూన్ 1వ తేదీ నుంచి అమలులోకి వస్తుందని చెప్పారు. ప్రతి ఏటా రూ.250 పెంచుతామని, రెండో ఏడాది రూ.2,750, మూడో ఏడాది రూ.2,750, నాలుగో ఏడాది రూ.3,000 అందిస్తామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన నవరత్నాల హామీలను తప్పకుండా అమలు చేస్తామన్నారు.

ఏపీలో ఉద్యోగాల కల్పన
ఏపీలో ఆగస్ట్ 15వ తేదీ నాటికి గ్రామాల్లో 4 లక్షల మంది వాలంటీర్లను నియమిస్తామని జగన్ చెప్పారు. ప్రతి యాభై ఇళ్లకు ఒక గ్రామవలంటీర్ ఉంటారని, గ్రామాలలో చదువుకున్న పిల్లలు, సేవ చేయాలనే ఆలోచన ఉన్న వారికి అవకాశం కల్పిస్తామని, నెలకు రూ.5వేల వేతనం ఇస్తామని చెప్పారు. ప్రభుత్వ స్కీముల్లో అవినీతి లేకుండా వీరు చూస్తారన్నారు. వారికి మంచి ఉద్యోగం వచ్చే వరకు పని చేయవచ్చునన్నారు.

లక్షలాది ఉద్యోగాలు
అలాగే, గ్రామ సచివాలయం ద్వారా ఈ అక్టోబర్ 2వతేదీ నాటికి మరో లక్షా 60వేల ఉద్యోగాలు కల్పిస్తామని జగన్ ప్రకటించారు. తాను ప్రకటించిన నవరత్నాల్లో ఏ పథకం కావాలన్నా నేరుగా గ్రామ సచివాలయానికి వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చునని, అప్పుడు 72 గంటల్లో పరిష్కరిస్తామన్నారు. అవినీతికి ఆస్కారం లేకుండా ప్రభుత్వ పథకాలను అందిస్తామని, నవరత్నాల్లో ప్రతి ఒక్కటి తప్పకుండా అమలు చేస్తామన్నారు.

గ్రామ వాలంటీర్లపై నెలకు రూ.200 కోట్లు
జగన్ గ్రామాల్లో రూ.5వేల చొప్పున ఒక్కొక్కరికి నాలుగు లక్షల వాలంటీర్లను నియమిస్తామని ప్రకటించారు. వాలంటీర్ల నియామకంతో ప్రభుత్వంపై నెలకు రూ.200 కోట్ల అదనపు భారం పడనుంది. ప్రస్తుత ఏడాదికి వృద్ధాప్య పింఛన్ రూ.250 పెంచారు. రూ.2వేలుగా ఉన్నదానిని రూ.2,250 చేశారు. ఇది కూడా అదనపు భారమే.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..



Click it and Unblock the Notifications