టిక్ టాక్.. ఈ పేరు వినని యూత్ ఉండరేమో. యువతను అంతగా ఆకట్టుకున్న టిక్ టాక్ యాప్‌కు రోజురోజుకీ ఆదరణ పెరుగుతోంది. చిన్నాపెద్ద తేడా లేకుండా అందరూ ఇందులో వీడియోలు చేస్తున్నారు. చూస్తున్నారు. అయితే ఈ యాప్‌ను రూపొందించిన కంపెనీ త్వరలోనే స్మార్ట్ ఫోన్ రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇది టిక్ టాక్ యూజర్ల సంతోషాన్ని మరింత పెంచింది.
టిక్ టాక్ మాతృ సంస్థ బైట్ డ్యాన్స్ సొంతంగా స్మార్ట్ ఫోన్ తయారీలో నిమగ్నమైనట్లు తెలుస్తోంది. ఈ డివైజ్‌కు టిక్ టాక్ ఫోన్ అని పేరు పెట్టాలని నిర్ణయించారు. ఇందులో టిక్ టాక్‌తో పాటు న్యూస్ ఫీడ్స్, గేమ్స్ తదితర బైట్ డ్యాన్స్ యాప్స్ ఉండనున్నట్లు తెలుస్తోంది. స్మార్ట్ ఫోన్ రంగంలోకి అడుగుపెట్టాలని భావిస్తున్న ఈ సంస్థ.. ఇప్పటికే ఓ ఫోన్ తయారీ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొన్ని పేటెంట్ హక్కులు కూడా సంపాదించినట్లు సమాచారం. అయితే ఈ వార్తల్లో నిజం ఎంతన్నది అసలు ఫోన్ మార్కెట్‌లోకి వస్తుందా రాదా అన్న దానిపై ఎలాంటి స్పష్టత లేదు. ఒకవేళ మార్కెట్‌లోకి వచ్చినా టిక్‌టాక్ ఫేమస్ అయిన భారత్, చైనాలోనే వాటిని రిలీజ్ చేస్తారా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.