టెలికం ఆపరేటర్లు తమ కస్టమర్లకు పోటాపోటీగా డేటా ప్లాన్స్ ఆఫర్ చేస్తున్నాయి. ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో, వొడాఫోన్ ఐడియా నిత్యం కొత్త కొత్త ప్లాన్స్‌తో వస్తున్నాయి. వొడాఫోన్ ఐడియా, భారతీ ఎయిర్‌టెల్ తమ కస్టమర్లకు రెగ్యులర్ బెనిఫిట్స్‌తో పాటు అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్ ఆఫర్లు ఇస్తున్నాయి. 2019లో ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో ఎంట్రీ తర్వాత డేటా ప్లాన్స్ విషయంలో టెలికం ఆపరేటర్ల మధ్య పోటీ బాగా ఏర్పడింది. ఈ నేపథ్యంలో రూ.500 లోపు పోస్ట్ పెయిడ్ ప్లాన్స్ గురించి తెలుసుకుందాం.

వొడాఫోన్ రూ.399 పోస్ట్‌పెయిడ్ ప్లాన్
వొడాఫోన్ రూ.399 పోస్ట్‌పెయిడ్ ప్లాన్ ఆఫర్ చేస్తోంది. ఈ ఆఫర్‌లో అన్ లిమిటెడ్ కాల్స్, 40GB డాటా, రోలోవర్ డేటా 200GB. దీంతో పాటు వొడాఫోన్ ప్లే ఉచిత సబ్‌స్క్రిప్షన్‌తో పాటు అమెజాన్ ప్రైమ్‌ను ఏడాది పాటు ఉచితంగా పొందుతారు. లోయెస్ట్ బిల్లు హామీ.
రూ.499 పోస్ట్ పెయిడ్ ప్లాన్‌లో... అన్ లిమిటెడ్ కాల్స్, 75GB డేటా, రోలోవర్ డేటా 200GB. వొడాఫోన్ ప్లే ఉచిత సబ్‌స్క్రిప్షన్‌తో పాటు అమెజాన్ ప్రైమ్‌ను ఏడాది పాటు ఉచితంగా పొందుతారు. ఈ ప్యాక్‌తో రెడ్ మొబైల్ షీల్డ్ బెనిఫిట్స్ ఉంటాయి.

రిలయన్స్ జియో రూ.199 ప్లాన్
రిలయన్స్ జియో రూ.199 ప్లాన్‌తో అపరిమిత కాల్స్. నెలకు 25GB డేటా. 25GB డేటా ఉపయోగించిన తర్వాత ప్రతి ఒక GB డేటాకు జియో రూ.20 చార్జ్ చేస్తుంది. కస్టమర్లు జియో యాప్స్ కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్ పొందవచ్చు. అలాగే రోజుకు వంద ఎస్సెమ్మెస్‌లు ఉచితం.

ఎయిర్‌టెల్ రూ.499 ప్లాన్
ఎయిర్‌టెల్ రూ.499 ప్లాన్‌తో అపరిమిత ఫోన్ కాల్స్. నెలకు 75 GB (3G/4G) డేటా. రోలోవర్ ఫెసిలిటీ కూడా ఉంది. రోలోవర్ డేటా అంటే.. ఆ నెలలో ఉపయోగించని డేటా మరుసటి నెలకు ఫార్వార్డ్ చేస్తారు. వీటితో పాటు యూజర్లకు మూడు నెలలపాటు ఎయిర్‌టెల్ టీవీ, నెట్‌ఫ్లిక్స్, సంవత్సరం పాటు అమెజాన్ ప్రైమ్ వీడియో ప్రయోజనం. హ్యాండ్‌సెట్ ప్రొటక్షన్ ఉంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications