మణిపాల్ హాస్పిటల్ చేతికి ఉత్తరాది చైన్ హాస్పిటల్
హైదరాబాద్: బెంగళూరు కేంద్రంగా పని చేసే మణిపాల్ హాస్పిటల్ ఉత్తరాదిలో చైనా ఆసుపత్రులు, క్లినిక్స్‌ను నిర్వహించే మేదాంత హాస్పిటల్‌ను కొనుగోలు చేయనుంది. ప్రముఖ కార్డియాక్ సర్జన్ నరేష్ ట్రెహాన్, అతని కుటుంబ సభ్యులు, సహ వ్యవస్థాపకులు సునీల్ సచ్‌దేవ్‌లకు కంపెనీలో మెజార్టీ వాటా (55 శాతం) ఉంది. గుర్గామ్, లక్నో, ఇండోర్, రాంచీ, శ్రీ గంగానగర్ వంటి నగరాల్లో మేదాంత హాస్పిటల్స్ కార్యకలాపాలు నిర్వహిస్తోంది.
మేదాంత కొనుగోలు కోసం (100 శాతం) మణిపాల్ హాస్పిటల్స్ ఏకంగా రూ.రూ.5.800 కోట్లను ఆఫర్ చేస్తోందని ది ఎకనమిక్ టైమ్స్ పేర్కొంది. మేదాంతలో ప్రమోటర్లతో పాటు అమెరికా ప్రయివేట్ ఈక్విటీ సంస్థ కార్లైల్, సింగపూర్ కంపెనీ తెమసేక్ కూడా మణిపాల్ హాస్పిటల్స్ ఇచ్చే ధరను అంగీకరించినట్లు తెలిసింది. కాబట్టి ఈ మేరకు కొనుగోలు ప్రక్రియ మొదలైందని సమాచారం.
అన్ని అనుకున్నట్లుగా జరిగితే మరో రెండు మూడు నెలల్లో మేదాంత హాస్పిటర్స్... మణిపాల్ హాస్పిటల్స్ చేతికి వెళ్లనుంది. సింగపూర్ ప్రయివేటు ఈక్విటీ కంపెనీ తెమసేక్.. మణిపూర్ హాస్పిటల్స్‌లో కూడా పెట్టుబడులు పెట్టి ఉండటం గమార్హం.

కార్లైల్‌కు 27 శాతం వాటా, తెమసేక్‌కు 18 శాతం వాటాలు ఉన్నాయి. మేదాంతలో కార్లైల్ వాటా కొనుగోలు సమయంలో ఆ కంపెనీ విలువ రూ.3,540 కోట్లు కాగా (2018లో) ఇప్పుడు దాని విలువ ఏకంగా రూ.5,800 కోట్లకు చేరుకోవడంతో పెట్టుబడిదారులకు మెరుగైన లాభాలు ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
మణిపాల్‌కు 10 మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు, 5 శిక్షణ ఆసుపత్రులు, అనేక సంతాన సాఫల్య కేంద్రాలు ఉన్నాయి. కాగా ఇంత భారీ పెట్టుబడులతో మేదాంతను కొనుగోలు చేసేందుకు మణిపాల్ హాస్పిటల్స్‌కు సుమారు రూ.3,000 కోట్ల పెట్టుబడులు సమకూర్చేందుకు ఇప్పటికే ఒక ప్రముఖ అమెరికా సంస్ధ ముందుకు వచ్చిందట. ఈ కొనుగోలులో మణిపాల్ హాస్పిటల్స్ కార్యకలాపాలు దేశవ్యాప్తంగా విస్తరించినట్లు అవుతాయి. ఇటీవల కాలంలో ఆరోగ్య సేవలరంగంలో జరుగుతున్న కొనుగోలు ఇదే కానుందని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.


Click it and Unblock the Notifications