For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆస్తిలో సగం చారిటీకి ప్రకటించిన అమెజాన్ బాస్ మాజీ భార్య

|

అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ మాజీ భార్య మెకంజీ బెజోస్ తన ఆస్తిలో సగాన్ని చారిటీకి ఇస్తానని ప్రకటించారు. ప్రపంచ బిలియనీర్లు వారెన్ బఫెట్, మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్ గేట్స్ ఇప్పటికే చారిటీ కోసం నిధులు వెచ్చిస్తున్నారు. ఇప్పుడు మెకంజీ కూడా అదే దారిలో నడిచారు. తనకు ఉన్న 37 బిలియన్ డాలర్ల ఆస్తిలో సగం మొత్తాన్ని చారిటీ కోసం ఇస్తానని ప్రకటించారు.

జెఫ్ బెజోస్, మెకంజీ బెజోస్ కొద్ది నెలల క్రితం విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. ఆమెకు సంస్థలో 4 శాతం వాటా లభించింది. తన వద్ద పెద్ద ఎత్తున సంపద ఉందని, కాబట్టి దీనిని చారిటీకి ఉపయోగిస్తానని ప్రకటించారు. బఫెట్, గేట్స్‌లా మెకంజీ గివింగ్ ప్లెడ్జ్ (Giving Pledge)లో జాయిన్ అయ్యారు.

Amazon boss ex wife says she will donate half her roughly $37 billion to charity

గివింగ్ ప్లెజ్ట్ కోసం 23 దేశాలకు చెందిన 204 మంది ఇండివిడ్యువల్స్, కపుల్స్, ఫ్యామిలీస్ ముందుకు వచ్చాయి. తమకు ఉన్న ఆస్తుల్లోని పెద్ద మొత్తం వాటాని చారిటీ కోసం వినియోగించడాన్ని ఎంకరేజ్ చేయడమే గివింగ్ ప్లెడ్జ్. 2019 నాటికి 204 మంది బిలియనీర్లు ముందుకు వచ్చారు. ఇందులో బిల్ గేట్స్, వారెన్ బఫెట్ ఉన్నారు.

మొబైల్ ఇంటర్నెట్ లో పాకిస్తాన్ కంటే మనమే దారుణంమొబైల్ ఇంటర్నెట్ లో పాకిస్తాన్ కంటే మనమే దారుణం

ఫార్మర్ న్యూయార్క్ మేయర్ మైఖేల్ బ్లూమ్‌బర్గ్, సీఎన్ఎన్ ఫౌండర్ టెడ్ టర్నర్, ఎంటర్‌టైన్‌మెంట్ ఎగ్జిక్యూటివ్ బారీ డిల్లర్‌లు 2010లోనే ముందుకు వచ్చారు. ఈ సంవత్సరం మెకంజీతో పాటు పలువురు ముందుకు వచ్చారు. వారిలో పాల్ టుడర్ జోన్స్, ఎమిరతి బిజినెస్‍‌మెన్ షేక్ మొహమ్మద్ బిన్ ముసాల్లామ్ బిన్ హమ్ ఆల్ అమేథీ తదితరులు ముందుకు వచ్చారు.

కాగా, తన మాజీ భార్య తన ఆస్తిలో సగం వాటాను దాతృత్వానికి వినియోగిస్తానని చెప్పడంపై అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ స్పందించారు. అద్భుతమని, మంచి ఆలోచన అని, చారిటీ కోసం తన ఆస్తిని ఇవ్వాలనుకున్న ఆమె ఆలోచన పట్ల తాను గర్వపడుతున్నానని జెఫ్ బెజోస్ అన్నారు. ఆమె మిగతా జీవితం కూడా సంతోషమయంగా, అందంగా ఉండాలని పేర్కొన్నారు.

English summary

ఆస్తిలో సగం చారిటీకి ప్రకటించిన అమెజాన్ బాస్ మాజీ భార్య | Amazon boss ex wife says she will donate half her roughly $37 billion to charity

MacKenzie is going to be amazing and thoughtful and effective at philanthropy, and I’m proud of her. Her letter is so beautiful.
Story first published: Wednesday, May 29, 2019, 17:05 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X