వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి మరో రెండు రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఏడాదిన్నరకు పైగా 3,678 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్రలో ఆయన సామాన్యులను దగ్గర నుంచి చూశారు. వాటి ఆధారంగా ఎన్నో హామీలు గుప్పించారు. ముఖ్యంగా నవరత్నాలు అందర్నీ ఆకట్టుకున్నాయి. అయితే, 2014లో విభజన అనంతరం ఏపీ అప్పులు రూ.97వేల కోట్లు అయితే ఇప్పుడు ఏకంగా రూ.2.50 లక్షల కోట్లకు పైగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో జగన్ ముందు అనేక ఆర్థిక సవాళ్లు ఉన్నాయని చెబుతున్నారు. వాటిని ఆయన ఎలా అధిగమిస్తారనేది మనముందు ఉన్న ప్రశ్న అంటున్నారు.

ఏపీ జీఎస్డీపీ 30 శాతం.. పెండింగ్ బిల్స్
ఆంధ్రప్రదేశ్ స్థూల వార్షిక ఉత్పత్తి- జీఎస్డీపీ (గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రాడక్ట్) 30 శాతంగా ఉంది. ఎఫ్ఆర్‌బీఎం (ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్‌మెంట్) సూచించిన 25 శాతం కంటే చాలా ఎక్కువగా ఉంది. అంటే బడ్జెట్ మొత్తంలో పదిహేడు నుంచి పద్దెనిమిది శాతం వడ్డీ చెల్లింపులకు పోనున్నాయి. 2014లో ఇది 5 శాతంగా మాత్రమే ఉంది. ఇప్పుడు ఇది ఐదింతలు పెరిగిందని, ఇది జగన్‌కు పెద్ద సవాలే అంటున్నారు. అలాగే, పెండింగ్ ఫైనాన్షియల్ బిల్స్ కూడా ఉన్నాయని, వాటిని క్లియర్ చేయాల్సి ఉందని చెబుతున్నారు.

రెవెన్యూకు పరిమిత మార్గాలు
అలాగే, ఆదాయం పెంచడానికి కూడా పరిమిత మార్గాలు మాత్రమే ఉన్నాయని గుర్తు చేస్తున్నారు. మరోవైపు, ప్రభుత్వానికి భారీ ఆదాయాన్ని సమకూర్చే మద్యంను ఈ అయిదేళ్లలో క్రమంగా బ్యాన్ చేస్తామని ప్రకటించారు. దీంతో రాష్ట్రానికి కావాల్సిన ఆర్థిక వనరులను సమకూర్చడం క్లిష్టమైన అంశమేనని అంటున్నారు. ఇప్పటికే సాధారణ రుణాలు రూ.2.5 లక్షల కోట్లు దాటాయి. నాన్ ట్రెజరీ రుణాలు రూ.1 లక్ష కోట్ల వరకు ఉన్నాయని అంటున్నారు.

టర్మ్ ముగిసే సమయానికి రుణాలు చెల్లించాలి
అలాగే, ఆంధ్రప్రదేశ్ తెచ్చిన రుణాల్లో మూడింట దాదాపు రెండింతల రుణం రానున్న ఏడేళ్లలో చెల్లించాల్సి ఉంది. అంటే కొలువుదీరనున్న జగన్ ప్రభుత్వం తన పాలన పూర్తయ్యే కాలానికి కాస్త అటు ఇటుగా ఈ మొత్తాన్ని, దాని వడ్డీని చెల్లించాలి. ఇది ఖజానాకు భారమేనని అంటున్నారు. దీంతో బడ్జెట్‌లో సంక్షేమానికి నిధులు తగ్గిపోయే అవకాశాలు కొట్టి పారేయలేమని అంటున్నారు. రెవెన్యూ లోటు ఆందోళన కలిగించే అంశం.

కేంద్రం సహకారం అవసరం
ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ లోటు ఉన్న రాష్ట్రాల్లో ముందు ఉంది. అయితే, కేంద్రం నుంచి సహకారం ఉంటే జగన్ ఏపీని గట్టెక్కించగలరని భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి, ఆదాయ మార్గాలు పెద్దగా లేకపోవడం.. కేంద్రం నుంచి సహకారం ఉంటే తప్ప గట్టెక్కని పరిస్థితులను జగన్ గుర్తించారని, అందుకే బీజేపీ ప్రభుత్వం విషయంలో సానుకూల ధోరణితో ముందుకు వెళ్తున్నారని అంటున్నారు.

ఇవి పూర్తి చేయాలంటే...
కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలోనే లోటు బడ్జెట్‌తో ఉంది. ఆ తర్వాత గత అయిదేళ్లలో అప్పులు భారీగా పెరిగాయి. రాజధాని అమరావతిని నిర్మించాల్సి ఉంది. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలి. పారిశ్రామిక, సేవా రంగాలకు పెద్ద పీట వేయాల్సి ఉంది. ఇవి కావాలంటే కేంద్రం సహకారం అవసరమనే అభిప్రాయం ఇప్పటికే జగన్ వచ్చారని చెబుతున్నారు. ఓ వైపు ప్రత్యేక హోదా కోసం అడుగుతూనే, మరోవైపు బీజేపీ ప్రభుత్వంతో సానుకూల దృక్పథంతో ఉంటూనే ఏపీని అభివృద్ధిలో ముందుకు తీసుకువెళ్లే యోచనలో జగన్ ఉన్నారని అంటున్నారు.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!



Click it and Unblock the Notifications