స్వల్పంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు: హైదరాబాద్-విజయవాడలో ఎంత అంటే..
పెట్రోల్, డీజిల్ ధరలు మంగళవారం నాడు (మే 28) స్వల్పంగా పెరిగాయి. లీటర్ పెట్రోల్ స్వల్పంగా 9 పైసలు, లీటర్ డీజిల్ ధర స్వల్పంగా 5 పైసలు పెరిగింది. ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు రూ.71.86, డీజిల్ ధర లీటర్‌కు రూ.66.69గా ఉంది. సోమవారం పెట్రోల్ రూ.71.77, డీజిల్ రూ.66.64గా ఉంది.
కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ ధర 9 పైసలు పెరిగి రూ. 73.92, డీజిల్ 5 పైసలు పెరిగి రూ.68.40, చెన్నైలో పెట్రోల్ రూ.74.59, డీజిల్ రూ.70.50, ముంబైలో పెట్రోల్ రూ.77.47, డీజిల్ రూ.69.88గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో ధఝరలు స్వల్పంగా పెరిగాయి. హైదరాబాదులో లీటర్ పెట్రోల్ ధర రూ.76.22, లీటర్ డీజిల్ ధర రూ.72.53గా ఉంది. అమరావతిలో పెట్రోల్ రూ.75.96, డీజిల్ రూ.71.87, విజయవాడలో పెట్రోల్ 75.60, డీజిల్ రూ.71.55గా ఉంది.


Click it and Unblock the Notifications