వరుసగా మూడో రోజు కూడా స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల బాటలో పయనించాయి. ఒక్కో అడుగు ముందుకు వేసుకుంటూ పన్నెండు వేల పాయింట్ల దిశగా నిఫ్టీ సాగుతోంది. 11950 పాయింట్లపైకి వెళ్తున్న ప్రతీసారీ అమ్మకాల ఒత్తిడి నేపధ్యంలో నిఫ్టీ కిందికి దిగివస్తోంది. అయితే వివిధ రంగాల్లో ఇప్పటికీ కొనుగోళ్ల మద్దతు స్పష్టంగా నమోదవుతోంది. విదేశీ మదుపర్లు కూడా వరుసగా మూడో రోజూ కొనుగోళ్లకే ఎక్కువగా మొగ్గుచూపారు. వివిధ కారణాలతో నిఫ్టీ, సెన్సెక్స్‌లు ఒడిదుడుకులు లోనైనప్పటికీ చివరకు లాభాల్లోనే ముగిశాయి. ఇంట్రాడేలో 11958 పాయింట్ల దగ్గర ప్రారంభమైన నిఫ్టీకి అదే గరిష్ట స్థాయి. ఒక దశలో 11880 పాయింట్ల కనిష్టం వరకూ దిగొచ్చింది. ఆఖర్లో కొద్దిగా కోలుకుని కేవలం 4 పాయింట్ల లాభంతో సరిపెట్టుకుని 11929 దగ్గర ముగిసింది నిఫ్టీ. సెన్సెక్స్ 66 పాయింట్లు పెరిగి 39750 దగ్గర క్లోజైంది. బ్యాంక్ నిఫ్టీ మాత్రం 31598 పాయింట్ల దగ్గర ముగిసింది.
మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్సులు అర శాతం వరకూ కోల్పోయాయి. ఐటీ, మీడియా, మెటల్, రియాల్టీ మినహా అన్ని రంగాల షేర్లలోనూ సెల్లింగ్ ప్రెషర్ నమోదైంది. ప్రధానంగా ఆటో, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎఫ్ఎంసిజి రంగ సూచీలు నష్టాల్లో ముగిశాయి.

జీ ఎంటర్‍టైన్మెంట్, యెస్ బ్యాంక్, ఇన్ఫోసిస్, కోల్ ఇండియా, వేదాంతా స్టాక్స్ టాప్ 5 గెయినర్స్‌గా నిలిచాయి. భారతి ఇన్ఫ్రాటెల్, హీరో మోటో, గ్రాసిం, బజాజ్ ఆటో, అల్ట్రాటెక్ సిమెంట్ స్టాక్స్ లూజర్స్ జాబితాలో నిలిచాయి.
పంజాబ్ నేషనల్ బ్యాంక్ నష్టం రూ.4750 కోట్లు
పీఎన్‌బి మరోసారి భారీ నష్టాలను మూటగట్టుకుంది. ఏకంగా రూ.7000 కోట్ల మేర మొండిబకాయిలకు ప్రొవిజన్స్ చేయడంతో నష్టం మరింతగా పెరిగింది. దీంతో స్టాక్ 4 శాతం వరకూ కోల్పోయింది. చివరకు. 86.20 దగ్గర క్లోజైంది.
మన్‌పసంద్ అదే దారి
జీఎస్టీ ఎగవేతలు, అవకతవకల నేపధ్యంలో మన్‌పసంద్ స్టాక్ వరుసగా రెండో రోజు కూడా 20 శాతం లోయిర్ సీలింగ్ దగ్గర లాక్ అయింది. స్టాక్ రూ.70.40 దగ్గర క్లోజైంది.
హైదరాబాద్ ఇండస్రీస్‌కు రిజల్ట్స్ షాక్
నిరుత్సాహక క్యూ4 ఫలితాలను వెల్లడించిన హెచ్ ఐ ఎల్ స్టాక్‌ను ఇన్వెస్టర్లు, ట్రేడర్లు వదిలించుకున్నారు. దీంతో స్టాక్ ఒక్క రోజులోనే ఏకంగా 9 శాతం వరకూ పతనమైంది. చివరకు రూ.1840 దగ్గర స్థిరపడింది. ఇదే బాటలో ఇదే రంగానికి చెందిన శంకర బిల్డ్‌కాన్ కూడా 8 శాతానికి పైగా నష్టపోయింది. స్టాక్ రూ.521 దగ్గర క్లోజైంది.
ప్రాఫిట్ బుకింగ్
ఈ మధ్యబాగా పెరిగిన ఎన్.సిఎల్ ఇండస్ట్రీస్ స్టాక్‌లో లాభాల స్వీకరణ జరిగింది. స్టాక్ 6 శాతానికి పైగా నష్టంతో రూ.149 దగ్గర క్లోజైంది. ఇదే బాటలో నిరుత్సాహక ఫలితాల వెల్లడితో మరో హైదరాబాదీ సంస్థ డెక్కన్ సిమెంట్స్ కూడా 6 శాతం నీరసించి రూ.443 దగ్గర స్థిరపడింది.
జీ - సోనీ డీల్ ఎప్పుడు
జీ ఎంటర్‌టైన్మెంట్స్ - సోనీ మధ్య డీల్ ఓ కొలిక్కివస్తోందనే వార్తల నేపధ్యంలో స్టాక్ ఈ రోజు భారీగా లాభపడింది. నిఫ్టీలోనే బెస్ట్ పర్ఫార్మింగ్ స్టాక్‌గా నిలిచింది. 6 శాతానికి పైగా లాభపడింది. చివరకు రూ.382 దగ్గర క్లోజైంది.
డిహెచ్ఎఫ్ఎల్ ప్రమోటర్ల వేట
దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీకి చెందిన ప్రమోటర్లపై లుక్ ఔట్ నోటీసులు ఇచ్చారంటూ వచ్చిన వార్తలు స్టాక్‌ను కూలదోశాయి. అలాంటిది ఏమీ లేదని యాజమాన్యం వివరణ ఇచ్చినప్పటికీ ఇంట్రాడేలో స్టాక్ ఏడు శాతం వరకూ పతనమైంది. చివరకు రూ.115 దగ్గర క్లోజైందిస్టాక్.
స్మాల్ క్యాప్ ర్యాలీ
ఈ మధ్యకాలం ర్యాలీలో పెద్దగా పాల్గొనని వివిధ రంగాల స్టాక్స్ ఈ రోజు ఎగిరి గంతేశాయి. కిర్లోస్కర్ ఆయిల్ 10 శాతం, టైమ్ టెక్నో 9 శాతం, విమార్ట్ 8 శాతం, గేట్ వే డిస్ట్రీపార్క్స్ 8 శాతం, ఎన్ఐఐటి 7 శాతం పెరిగాయి. కెమికల్స్ రంగానికి చెందిన అక్షర్ కెమ్ ఈ రోజు ఏకంగా 20 శాతం లాభపడింది. ఇదే బాటలో మంగళూరు కెమికల్స్ 10 శాతం, తిరుమలై కెమికల్స్ 7 శాతం పెరిగాయి.
More From GoodReturns

Stock market: ఇన్వెస్టర్లకు అగ్నిపరీక్ష..! వచ్చే వారం RBI నిర్ణయంపైనే అందరి కళ్లు!

Stock market: యుద్ధ భయాల్లోనూ దూసుకుపోతున్న షేర్లు.. ఇన్వెస్టర్లకు బంపర్ రిటర్న్స్ ఇచ్చిన పెన్నీ స్టాక్స్!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..



Click it and Unblock the Notifications