ఫేక్ ఇన్వాయిస్‌తో రూ.224 కోట్లు క్లెయిమ్: GST ఎగవేతదారుల్ని అరెస్ట్ చేయవచ్చు

గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ (జీఎస్టీ) ఎగవేతదారులను అరెస్ట్ చేయవచ్చునని సుప్రీం కోర్టు సోమవారం స్పష్టం చేసింది. జీఎస్టీ ఎగవేతదారులను సంబంధిత అదికారులు అరెస్ట్ చేయవచ్చునని ఇదివరకు ఏప్రిల్ 18వ తేదీన తెలంగాణ హైకోర్టు తీర్పు చెప్పింది. దీనిని సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తెలంగాణ హైకోర్టు తీర్పును అత్యున్నత న్యాయస్థానం సమర్థించింది.

ఈ పిటిషన్‌ను చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ అనిరుద్ధ బోస్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. ఈ కేసులోని డాక్యుమెంట్లు పరిశీలించి, పిటిషనర్ వాదనలు విన్న అనంతరం తాము జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది. పిటిషనర్ వేసిన అప్పీల్‌ను కొట్టివేసింది.

GST evanders can be arrested, Supreme Court upholds TS High Court judgment

బోగస్ ఇన్వాయిస్‌లు సృష్టించి ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ పొందిన కంపెనీలకు జీఎస్టీ చట్టం కింద అధికారులు సమన్లు పంపించారు. ఎలాంటి ఉత్పత్తులు తయారు కాకుండానే నకిలీ ఇన్వాయిస్‌లు సృష్టించడంతో ఆ సంస్థల నిర్వాహకులకు సమన్లు ఇచ్చారు. ఈ సంస్థలు అక్రమాలకు పాల్పడి రూ.224.05 కోట్ల మేర ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్‌ను క్లెయిమ్ చేశాయని చెబుతున్నారు. ఈ సమన్ల జారీపై పలు కంపెనీల నిర్వాహకులు హైకోర్టులో బ్యాచ్ పిటిషన్ దాఖలు చేశారు. తమను అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని పేర్కొన్నారు. ఇక్కడ వారికి చుక్కెదురైంది. దీంతో హైకోర్టు తీర్పును సవాల్ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా అక్కడ కూడా షాక్ తగిలింది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+