హైదరాబాద్‌లో హలీం దొరికే హోటల్స్, ధరలు ఇలా....: ఇక్కడ వెజ్ హలీం కూడా...
రంజాన్ మాసంలో హైదరాబాదీలు విరివిగా ఆరగించేది హలీం. ఈ మాసంలో ఇది ఎంతోమందికి పేవరేట్ డిష్. ఈ మాసంలో పని నిమిత్తం హైదరాబాద్‌కు వచ్చేవారు చాలామంది ఆయా ప్రాంతాల్లోని ప్రముఖ హోటల్స్‌లో హలీం తిని వెళ్తారు. హలీం ఎక్కడైనా దొరుకుతోంది. కానీ చాలామందికి కొన్నిచోట్ల తినడాన్ని మాత్రమే ఇష్టపడతారు. ఇలా హైదరాబాదులో పలు ఫేమస్ హలీం స్పాట్స్ ఉన్నాయి.

హైదరాబాద్‌లో ఫేమస్ స్పాట్స్
హైదరాబాదులోని పిస్తా హౌస్, సర్వీ (బంజారాహిల్స్), షాదాబ్ (మదీనా), చిచ్చాస్ (మాసాబ్ ట్యాంక్), షాగౌస్, అల్మాస్ (ఎస్సార్ నగర్), కేఫ్ బహర్, జెవెల్ ఆప్ నిజామ్ (గండిపేట్), గ్రాండ్ హోటల్ (అబిడ్స్), ఆల్ సబా (గచ్చిబౌలి), బావార్చి (ఆర్టీసీ క్రాస్ రోడ్స్), అల్ఫా (సికింద్రాబాద్), ఆస్టోరియా (ఆర్టీసీ క్రాస్ రోడ్స్), గ్రిల్ 9 (కార్ఖాన), చెఫ్ ఇనామ్స్ (బంజారాహిల్స్), సోహెయిల్ (మలక్‌పేట), పారడైజ్, షెహజాద్ (టోలీచౌకి), అంగారా (కొండాపూర్), బాంబే హోటల్ (ఎంజీ రోడ్), గ్రీన్ పార్క్ (అంబర్‌పేట), సర్వి (బంజారాహిల్స్)లు ఫేమస్.

ధరలు ఇలా...
హలీం ధరలు రూ.70 నుంచి రూ.250 వరకు ఉంటాయి. చికెన్ హలీమ్ రూ.70 నుంచి ఉంటే, మటన్ హలీం ధర రూ.150 నుంచి ఉంటాయి. ఆయా హోటల్స్‌ను బట్టి ధరల్లో మార్పు ఉంటుంది. పది రూపాయల నుంచి వంద రూపాయలు, ఆ పైన తేడా కనిపిస్తుంది. ఫ్యామిలీ ప్యాక్ తీసుకుంటే కాస్త తక్కువగా లభిస్తుంది. ముస్లీంలు ఉపవాస దినాలలో వండే ప్రత్యేక వంటకమే హలీం. ఇది ఎంతోమందికి ఫేవరేట్ డిష్. హలీం ఒక్కో ఏరియాలో ఒక్కో రేటు ఉన్నట్లే.. ఒక్కో హోటల్లో ఒక్కో టేస్ట్ ఉంటుంది.

హలీం
చార్మినార్‌కు సమీపంలో షాగౌస్‌లో హలీం ఫేమస్. టోలీచౌకీలోను ఓ బ్రాంచీ ఉంది. బషీర్‌బాగ్‌లోని కేఫ్ బహర్‌లో హలీం ఫేమస్. చార్మినార్ వద్ద ఉన్న పిస్తా హౌస్‌లో ఎంతోమంది హలీంను రుచి చూడాలనుకుంటారు. హైదరాబాదులో పిస్తా హౌస్‌కు పలు బ్రాంచీలు ఉన్నాయి. పిస్తా మెయిన్ బ్రాంచీలో మాత్రం ఏడాదంతా లభిస్తుంది. యాకుత్‌పురాలోని హోటల్ ఇక్బాల్‌లో ఇరానీ స్టయిల్ హలీం రుచి దొరుకుతుంది.

వెజిటేరియన్ హలీం
హలీం అంటే కేవలం మాంసాహారంతోనే చేస్తారని భావించవద్దు. గోదుమలతో మాంసానికి ఏమాత్రం తీసిపోని రుచితోను వెజిటేరియన్స్ హలీంను ఆస్వాదించవచ్చు. సర్వీ హోటల్లో మటన్‌తో అలాగే గోధుమలతో చేసిన హలీం దొరుకుతుంది. చికెన్ వెరైటీ లభించదు. కొన్నిచోట్ల ఫిష్ హలీం కూడా లభిస్తుంది.


Click it and Unblock the Notifications