For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సెన్సెక్స్, నిఫ్టీ మరో రికార్డ్ ! లాభాల్లో ముగింపు

By Chanakya
|

సెన్సెక్స్, నిఫ్టీలు మరో రికార్డ్ నమోదు చేశాయి. క్లోజింగ్ పద్ధతిన రికార్డ్ హై దగ్గర క్లోజయ్యాయి. వారం ప్రారంభంలో పటిష్టమైన కొనుగోళ్ల మద్దతు నేపధ్యంలో నిఫ్టీ 11900 పాయింట్లపైన చాలా స్థిరంగా ముగిసింది. బ్యాంక్ నిఫ్టీ కూడా ఏకంగా 450 పాయింట్లు లాభపడి మరింత బలం పుంజుకుంది. ఎఫ్ఐఐల కొనుగోళ్ల మద్దతు కూడా లభించడంతో సెన్సెక్స్ 248 పాయింట్లు పెరిగి 39,683 పాయింట్ల దగ్గర ముగిసింది. నిఫ్టీ 81 పాయింట్లు పెరిగి 11924 దగ్గర, బ్యాంక్ నిఫ్టీ 435 పాయింట్లు పెరిగి 31647 పాయింట్ల దగ్గర స్థిరపడింది. మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్సులు రెండూ ఒకటిన్నర శాతానికి పైగానే ముగిశాయి.

సెక్టోరల్ ఇండెక్సుల పరంగా ఫార్మా, మీడియా, ఐటీ మినహా మిగిలిన అన్ని రంగాలకూ కొనుగోళ్ల మద్దతు లభించింది. ఫైనాన్షియల్ సర్వీసెస్, బ్యాంకింగ్, మెటల్, పీఎస్‌యూ బ్యాంక్స్, ప్రైవేట్ బ్యాంక్స్, రియాల్టీ రంగాలు భారీగా పుంజుకున్నాయి.

 Rally continues on Modis return: Sensex jumps 248 points, Nifty by 80 points

టాటా స్టీల్, యెస్ బ్యాంక్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, ఎల్ అండ్ టి, ఎన్టీపీసీ స్టాక్స్ టాప్ 5 గెయినర్స్‌గా నిలిచాయి. జీ ఎంటర్‌టైన్మెంట్, ఇండస్ ఇండ్ బ్యాంక్, రిలయన్స్, టెక్ మహీంద్రా, ఏషియన్ పెయింట్ స్టాక్స్ లూజెస్ జాబితాలో చేరాయి.

ఎల్ అండ్ టి రికార్డ్ రన్
దేశ అతిపెద్ద నిర్మాణ దిగ్గజం, క్యాపిటల్ గూడ్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే ఎల్ అండ్ టి సంస్థ రికార్డుల మీద రికార్డ్ సృష్టిస్తోంది. ఈ రోజు ఇంట్రాడేలో రూ.1600 గరిష్ట మార్కును దాటి ఇన్వెస్టర్లలో జోష్ నింపుతోంది. గత కొద్దికాలం నుంచి బాగా యాక్టివ్ అయిన స్టాక్ రూ.1300 నుంచి పెరిగి మంచి లాభాలను ఇచ్చింది. చివరకు ఈ స్టాక్ రూ.1593.50 దగ్గర క్లోజైంది.

పేజ్ ఇండస్ట్రీస్‌పై రిజల్ట్స్ ఎఫెక్ట్
జాకీ బ్రాండ్ కలిగిన, సదరు ప్రోడక్టులను దేశంలో విక్రయిస్తున్న పేజ్ ఇండస్ట్రీస్ స్టాక్ ఈ రోజు అనూహ్యంగా పన్నెండు శాతం పతనమైంది. ఇంట్రాడేలో రూ.19011 స్థాయికి పడిపోయింది. త్రైమాసిక ఫలితాలను వెల్లడించిన ఈ సంస్థ.. తన లాభాల్లో 20 శాతం క్షీణతను నమోదు చేసింది. అమ్మకాల్లోనూ ఏ మాత్రం వృద్ది సాధించలేదు. దీంతో ఈ స్టాక్ భారీగా పడింది.

ఇదే బాటలో ఫార్మా రంగానికి దివీస్‌ ల్యాబ్స్‌ కూడా ఒకే రోజు పది శాతం పతనమైంది. ఆదాయంలో 15 శాతం వృద్ధి నమోదైనా.. లాభాల్లో మాత్రం 10 శాతం క్షీణతను నమోదు చేసింది దివీస్ ల్యాబ్స్. ఎబిటా మార్జిన్లు కూడా 35.2 నుంచి 32.7 శాతానికి తగ్గాయి. దీంతో ఈ స్టాక్ 10 శాతం పతనమై రూ.1594 దగ్గర క్లోజైంది.

మన్‌పసంద్ ఓనర్లు అరెస్ట్
రూ. 40 కోట్ల పన్ను ఎగవేత, రూ.300 కోట్ల టర్నోవర్‌ను పెంచి చూపించడం వంటి ఆరోపణల నేపధ్యంలో ప్రముఖ ఫ్రూట్ జ్యూస్ కంపెనీ మన్‌పసంద్ బెవరేజెస్‌ ప్రమోటర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలోనే వివిధ కారణాలు, అవకతవకలు జరిగాయనే అనుమానాలతో ఆడిటర్లు ఈ సంస్థ నుంచి తప్పుకున్నారు. అప్పటి నుంచి మన్‌పసంద్ స్టాక్ నష్టాల్లోనే కొట్టుమిట్టాడుతూ వస్తోంది. ఈ రోజు ఈ స్టాక్ ఏకంగా 20 శాతం నష్టంతో డౌన్ ఫ్రీజ్ అయింది. రూ.88 దగ్గర క్లోజైంది. మన్‌పసంద్ స్టాక్‌లో మరింత నష్టాలు ఉండొచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రమోటర్లు.. షేర్ హోల్డర్ల నమ్మకాన్ని పొందడంలో పూర్తిగా విఫలం కావడమే ఇందుకు కారణం.

ఇదే బాటలో పీసీ జ్యువెలర్స్ సంస్థ కూడా మరో 5 శాతం ఈ రోజు నష్టపోయింది. ఇందులో కూడా ప్రమోటర్లపై ఆరోపణలు, అనుమానాలు తలెత్తినప్పటి నుంచి స్టాక్ నీరసిస్తోంది. ఈ రోజు స్టాక్ 6 శాతం నష్టాలతో రూ.98.35 దగ్గర క్లోజైంది.

రాంకీలో లాభాలు
ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సీఎంగా అధికార పగ్గాలు చేపట్టబోతున్న నేపధ్యంలో రాంకీ ఇన్ఫ్రా స్టాక్ గత వారమంతా లాభపడింది. ఎందుకంటే రాంకీ ప్రమోటర్‌కు జగన్‌తో సన్నిహిత సంబంధాలున్న నేపధ్యంలో స్టాక్ రూ.95 నుంచి రూ.135 వరకూ రోజుల వ్యవధిలోనే పెరిగింది. అయితే ఈ రోజు ఈ స్టాక్‌లో లాభాల స్వీకరణ వచ్చింది. స్టాక్ 10 శాతం పతనమై రూ.120 దగ్గర క్లోజైంది.

English summary

సెన్సెక్స్, నిఫ్టీ మరో రికార్డ్ ! లాభాల్లో ముగింపు | Rally continues on Modi's return: Sensex jumps 248 points, Nifty by 80 points

Indian equity benchmarks extended gains for the second consecutive trading session and registered their best two-day rally in a week to close at record highs. The S&P BSE Sensex closed 248 points or 0.63 percent higher at 39,683.29 and the NSE Nifty 50 closed at 11,924.75, up 0.68 percent. The broader market index represented by the NSE Nifty 500 Index closed 0.85 percent higher.
Story first published: Monday, May 27, 2019, 16:43 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X