For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హైదరాబాద్‌లో రాత్రిపూట ఫుడ్ ఎక్కడెక్కడ దొరుకుతుందో తెలుసా?

|

హైదరాబాద్: చాలామంది రాత్రుళ్లు తమకు ఫుడ్ ఎక్కడ దొరుకుతుందా అని వెతుకుతుంటారు. హైదరాబాద్ వంటి మహా నగరంలో 24X7 ప్రజలు రోడ్లపై తిరుగుతుంటారు. ఉద్యోగ బాధ్యతల్లో ఉంటారు. రాత్రిపూట ఆకలిగా అనిపిస్తే ఆయా ఉద్యోగులకు సమీపంలో కూడా చాలాచోట్ల టిఫిన్స్, ఇతర ఆహార పదార్థాలు దొరుకుతాయి. ఎల్బీనగర్ నుంచి కూకట్‌పల్లి వరకు, ఓల్ట్ సిటీ నుంచి సికింద్రాబాద్ వరకు పలుచోట్ల ఫుడ్ దొరుకుతుంది. అలా దొరికే వాట్లలో రామ్‌కీ బండి, కృప, డీఎల్ఎఫ్ స్ట్రీట్ ఫుడ్, క్రీమ్ స్టోన్ కాన్సెప్ట్స్, హోటల్ షాదాబ్, శ్యాల డ్రైవ్ ఇన్ వంటి పలు హోటల్స్ వద్ద ఫుడ్ దొరుకుతుంది.

 అబిడ్స్

అబిడ్స్

హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న నాంపల్లిలో రామ్‌కీ బండీ వద్ద టిఫిన్స్ దొరుకుతాయి. ఇక్కడ దోశ చాలా ఫేమస్. వివిధ రకాల దోశలు అందుబాటులో ఉంటాయి. ఇది అర్ధరాత్రి రెండున్నర గంటల నుంచి ఉదయం ఎనిమిది గంటల వరకు ఉంటుంది.

నాంపల్లిలో అలామ్‌దులిల్లా హోటల్ ఉదయం 9 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 4 గంటల వరకు ఓపెన్ ఉంటుంది. ఇక్కడ వివిధ రకాల బిర్యానీలు లభసిస్తాయి.

నాంపల్లి సమీపంలోని అబిడ్స్‌లో కృప హోటల్ కూడా రాత్రి తెరిచి ఉంటుంది. ఇందులో రాత్రి సమయంలో వివిధ రకాల టిఫిన్స్ లభిస్తాయి.

యూసఫ్‌గూడ చౌరస్తా, నారాయణగూడ ఫ్లైఓవర్ చౌరస్తా వద్ద బండి వద్ద టిఫిన్స్ దొరుకుతాయి.

చాదర్‌ఘాట్‌లోని నయగార హోటల్ అర్ధరాత్రి వరకు తెరిచి ఉంటుంది.

మెహిదీపట్నంలో ప్రిన్స్ బిర్యానీ పాయింట్ రాత్రిపూట తెరిచి ఉంటుంది.

ఎల్బీనగర్, చార్మినార్

ఎల్బీనగర్, చార్మినార్

ఎల్బీనగర్ రింగ్ రోడ్డు పైన కూడా ఇడ్లీ, దోశ బండి పైన టిఫిన్స్ అర్ధరాత్రి సమయంలో లభిస్తాయి. అలాగే, చార్మినార్ ప్రాంతంలోని నిమ్రా కేఫ్ అండ్ బేకరీలో ఉదయం నాలుగు గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఇరానీ చాయ్, బిస్కట్స్ అందుబాటులో ఉంటాయి.

 గచ్చిబౌలి, బంజారాహిల్స్

గచ్చిబౌలి, బంజారాహిల్స్

గచ్చిబౌలిలో డిఎల్ఎఫ్ స్ట్రీట్ 24X7 అందుబాటులో ఉంటుంది. ఇక్కడ వివిధ రకాల మ్యాగీ దొరుకుతుంది. చీజ్ మ్యాగీ, ఎగ్ మ్యాగీ, బట్టర్ మ్యాగీతో పాటు బాదామ్ మిల్క్, ఇతర స్నాక్స్ లభిస్తాయి.

బంజారాహిల్స్‌లో ఎక్స్‌ప్రెస్ మీల్ ఉదయం పది గంటల నుంచి అర్ధరాత్రి రెండున్నర గంటల వరకు ఫుడ్ అందుబాటులో ఉంటుంది. చైనీస్, నార్త్ ఇండియన్, బిర్యానీ, ఫ్రైడ్ రైస్ వంటి ఫుడ్ ఐటమ్స్ ఎక్స్‌ప్రెస్ మీల్స్‌లో లభిస్తాయి.

బంజారాహిల్స్‌లో గఫూర్ బాయి షర్వామా ఉదయం ఐదు గంటలకు తెరుస్తారు.

చార్మినార్, హైటెక్ సిటీ,

చార్మినార్, హైటెక్ సిటీ,

చార్మినార్ సమీపంలోని ఝాన్సీ బజార్‌లో హోటల్ షాదాబ్‌లో ఉదయం 5 గంటల నుంచి అర్ధరాత్రి 2 గంటల వరకు ఫుడ్ అందుబాటులో ఉంటుంది. బిర్యానీ లవర్స్‌కు ఇది ఫేమస్.

హైటెక్ సిటీలో యమ్మీ డాగ్స్ ఉదయం పది గంటల నుంచి మరుసటి రోజు వేకువజామున ఆరు గంటల వరకు తెరిచి ఉంటుంది. ఇక్కడ స్నాక్స్ లభిస్తాయి.

హైటెక్ సిటీలోనిచాక్లెట్ రూమ్ రాత్రంతా ఓపెన్ చేసి ఉంటుంది. ఉదయం 9 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 7 గంటల వరకు తెరిచి ఉంటుంది. ఫోండ్యూ, పిజ్జా, బర్గర్స్ వంటి ఐటమ్స్ లభిస్తాయి.

English summary

హైదరాబాద్‌లో రాత్రిపూట ఫుడ్ ఎక్కడెక్కడ దొరుకుతుందో తెలుసా? | Late night food and restaurants in hyderabd

Awesome places in Hyderabad to satisfy late night cravings. late night food and restaurants in hyderabd.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X