For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జెట్ బోయింగ్ 737 విమానాలపై తగ్గిన ఎయిర్ ఏసియా, కారణమిదే

|

ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన జెట్ ఎయిర్వేస్ తాత్కాలికంగా తన కార్యకలాపాలు నిలిపివేసిన విషయం తెలిసిందే. దీంతో జెట్ విమానాలు ఇతర విమానయాన సంస్థలు తీసుకుంటున్నాయి. ఇందులో భాగంగా లో-కాస్ట్ క్యారియర్ ఎయిర్ ఏసియా ఇండియా.. జెట్‌కు చెందిన బోయింగ్ 737 (B737)ను లీజుకు తీసుకోవాలని భావించింది. అయితే వన్ టైప్ ఎయిర్ క్రాఫ్ట్‌ను కంటిన్యూ చేసేందుకే టాటా గ్రూప్ వెంచర్ మొగ్గు చూపిందట.

నరేష్ గోయల్ దంపతుల్ని విమానం నుంచి దించేశారునరేష్ గోయల్ దంపతుల్ని విమానం నుంచి దించేశారు

జెట్ ఎయిర్వేస్‌కు చెందిన B737 ఎయిర్ ప్లేన్స్ లీజుకు తీసుకోనున్నట్లు ఎయిర్ ఏసియా.. ఏవియేషన్ రెగ్యులేటర్‌కు తెలియజేసింది. కానీ ఆ తర్వాత దీని గురించిన డెవలప్‌మెంట్ లేదు. అయితే చివరకు ఆ ఆలోచనను విరమించుకుంది. ఈ విషయాన్ని ఇండస్ట్రీకి చెందిన సోర్స్ వెల్లడించినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి.

Air Asia drops plan to take Jet grounded Boeing 737s

డిఫరెంట్ సీట్ కాన్ఫిగరేషన్, మెయింటెనెన్స్, స్కిల్ రిక్వర్‌మెంట్ జోడించవలసి ఉంటుందని, కాబట్టి కొత్త విమానాల ఇండక్షన్ అవసరం లేదని భావించినట్లు చెబుతున్నారు. లో-కాస్ట్ ఎయిర్ లైన్స్ బిజినెస్‌లో వన్ టైప్ విమానయాన సర్వీసులు బాగుంటాయని అంటున్నారు.

ఆర్థిక సంక్షోభం కారణంగా జెట్ ఎయిర్వేస్ తమ సర్వీసులను ఏప్రిల్ 17వ తేదీ నుంచి తాత్కాలికంగా నిలిపివేసింది. జెట్ ఎయిర్వేస్ ఆగిపోవడంతో దీనిని ప్రత్యర్థి విమానయాన సంస్థలు క్యాష్ చేసుకునే పనిలో పడ్డాయి. స్పైస్ జెట్, విస్తారా వంటి సంస్థలు జెట్ విమానాలను తీసుకోవాలని భావించాయి.

ఈ మేరకు స్పైస్ జెట్ 20కి పైగా జెట్‌కు చెందిన B737 విమానాలను తీసుకుంది. విస్తారా 4 విమానాలను తీసుకుంది. బెంగళూరు కేంద్రంగా పని చేస్తున్న ఎయిర్ ఏషియా ఇండియా కూడా తొలుత ఆసక్తి చూపింది. డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ)కు రెగ్యులేటరీ అప్రూవల్ కోసం పంపించింది. కానీ ఆ తర్వాత విరమించుకుంది.

English summary

జెట్ బోయింగ్ 737 విమానాలపై తగ్గిన ఎయిర్ ఏసియా, కారణమిదే | Air Asia drops plan to take Jet grounded Boeing 737s

Air Asia India has dropped its plan to lease B737 aircraft of grounded Jet Airways as the Tata group venture carrier wants to continue with one type of aircraft.
Story first published: Monday, May 27, 2019, 10:34 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X