స్టాక్ మార్కెట్ సూచీలు మళ్లీ జోరందుకున్నాయి. ఎన్నికల ఫలితాల తర్వాత నిన్న నీరసించిన సెన్సెక్స్, నిఫ్టీలు ఈ రోజు మళ్లీ ఉత్సాహంగా కదిలాయి. ఉదయం నుంచి స్థిరంగానే ఉన్నప్పటికీ మధ్యాహ్నం తర్వాత కొనుగోళ్ల మద్దతు మరింతగా పెరిగింది. 11,748 పాయింట్ల దగ్గర ప్రారంభమైన నిఫ్టీ మిడ్ సెషన్‌లో 11,859 పాయింట్ల గరిష్ట స్థాయి వరకూ చేరింది. అన్ని రంగాల నుంచి కొనుగోళ్ల మద్దతు స్పష్టంగా కనిపించింది. దీన్నో బ్రాడ్ బేస్డ్ ర్యాలీగా చెప్పొచ్చు. మిడ్, స్మాల్ క్యాప్ స్టాక్స్ కూడా ర్యాలీలో పాల్గొన్నాయి. చివరకు సెన్సెక్స్ 625 పాయింట్ల లాభంతో 39వేల 435 దగ్గర క్లోజైంది. నిఫ్టీ 188 పాయింట్లు పెరిగి 11844 దగ్గర స్థిరపడింది. క్లోజింగ్‌లో రికార్డులను నమోదు చేయడం ప్రధానంగా చెప్పుకోవాల్సిన అంశం. చివరకు బ్యాంక్ నిఫ్టీ 803 పాయింట్లు పెరిగి 31212 దగ్గర క్లోజైంది.
ప్రధానంగా ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్, ఎల్ అండ్ టి మార్కెట్లను ముందుకు నడిపిస్తే... ఐటి స్టాక్స్ అయిన టీసీఎస్, టెక్ మహీంద్రా వెనక్కి నడిపించాయి.

ఐసిఐసిఐ బ్యాంక్, ఎల్ అండ్ టి, జీ ఎంటర్‌టైన్మెంట్, జెఎస్‌డబ్ల్యు స్టీల్, భారతి ఎయిర్‌టెల్ టాప్ ఫైవ్ గెయినర్స్‌గా నిలిచాయి. టెక్ మహీంద్రా, ఎన్టీపీసీ, టీసీఎస్, హిందుస్తాన్ యునిలివర్, హెచ్ సి ఎల్ టెక్ షేర్లు లూజర్ల జాబితాలో చేరాయి.
బ్యాంక్స్ భళా
ఈ రోజు ట్రేడ్‌లో ప్రధానంగా బ్యాంకింగ్, ఫైనాన్షియల్ స్టాక్స్ భారీగా లాభపడ్డాయి. ఐసిఐసిఐ బ్యాంక్ మార్కెట్లను లీడ్ చేస్తే బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ బరోడా ఏకంగా 8 శాతం వరకూ పెరిగాయి. పంజాబ్ నేషనల్ బ్యంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనెరా బ్యాంక్, ఓరియంటల్ బ్యాంక్ వంటి స్టాక్స్ ఐదు శాతానికి పైగానే పెరిగాయి.
ఇన్ఫ్రా కిక్
కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మౌలిక రంగానికి పెద్ద పీట వేస్తుందనే అంచనాతో క్యాపిటల్ గూడ్స్, ఇన్ఫ్రా, సిమెంట్ రంగ కంపెనీల స్టాక్స్ ఎగిరి గంతేశాయి. ముందుగా ఎల్ అండ్ టి.. క్యాపిటల్ గూడ్స్ సెగ్మెంట్‌ని ముందుకు నడిపించింది. సిమెంట్ స్పేస్‌లో అంబుజా సిమెంట్స్, ఏసిసి 4 శాతానికి పైగా పెరిగాయి. ఇండియా సిమెంట్స్ 12 శాతం, సంఘీ ఇండస్ట్రీస్ 8 శాతం లాభపడ్డాయి. ఇక కేశోరాం, ఉదయ్‌పూర్, ఎన్ సి సి, డెక్కన్ వంటి కంపెనీల షేర్లలోనూ మంచి లాభాలు నమోదయ్యాయి.
స్టీల్ రంగంలో జెఎస్‌డబ్ల్యు స్టీల్, వేదాంతా, టాటా స్టీల్ నాలుగు శాతం వరకూ పెరిగాయి.
ఇక ఇన్ఫ్రా స్పేస్‌లో జెఎంసి ప్రాజెక్ట్స్ 15 శాతం, జె కుమార్ ఇన్ఫ్రా 10 శాతం, దిలీప్ బిల్డ్ కాన్ 5 శాతం పెరిగాయి. ఇన్ఫ్రా ఎక్విప్మెంట్ విభాగంలో ఉన్న యాక్షన్ కన్‌స్ట్రక్షన్ 10 శాతానికి పైగా పెరిగాయి.
టీడీపీ ఓటమి.. హెరిటేజ్ పతనం
సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో చిత్తుగా ఓడిన టీడీపీ ఎఫెక్ట్.. హెరిటేజ్ ఇండస్ట్రీస్ స్టాక్ పై పడింది. ఏపీ మాజీ సీఎం చంద్రబాబు భార్య భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి సారధ్యంలో నడుస్తున్న హెరిటేజ్ సంస్థ స్టాక్‌ను అమ్మేసేందుకే ఇన్వెస్టర్లు ఎక్కువగా మొగ్గుచూపారు. దీంతో ఈ స్టాక్ 5 శాతం వరకూ పతనమైంది. చివరకు రూ.463 దగ్గర క్లోజైంది.
గృహ్ ఫైనాన్స్‌కు హెచ్ డి ఎఫ్ సి దెబ్బ
ఆర్బీఐ నిబంధనలకు అనుగుణంగా తమ దగ్గరున్న గృహ్ ఫైనాన్స్ వాటాలను (4.47 కోట్ల షేర్లు) హెచ్ డి ఎఫ్ సి సంస్థ అమ్మింది. దీంతో ఈ స్టాక్ ఏకంగా 8 శాతం వరకూ పతనమైంది. గృహ్ - బంధన్ బ్యాంక్ విలీనం నేపధ్యంలో కేర్ ఎక్స్ఛేంజ్ రేషియో నిబంధనలను హెచ్ డి ఎఫ్ సి పాటించాల్సి వచ్చింది. ఈ సెల్లింగ్ నేపధ్యంలో గృహ్ ఫైనాన్స్ ఏకంగా 9 శాతం వరకూ పతనమైంది. చివరకు స్టాక్ కోలుకుని 5 శాతం నష్టాలతో రూ.314 దగ్గర క్లోజైంది.
లాభాల స్వీకరణ
ఈ మధ్య బాగా పెరిగిన ఆర్బీఎల్ బ్యాంక్, నెస్లే, టీసీఎస్ వంటి వాటిల్లో ప్రాఫిట్ బుకింగ్ స్పష్టంగా కనిపించింది. వీటితో పాటు పివిఆర్, అదానీ గ్రూప్ స్టాక్స్ కూడా నష్టాల్లో ముగిశాయి. గత రెండు సెషన్లలో అనూహ్యంగా పెరిగిన జస్ట్ డయల్‌లో కూడా ఇన్వెస్టర్లు లాభాలు తీసుకోవడానికే మొగ్గుచూపారు. జెట్ ఎయిర్‌వేస్‌లో కూడా అదే పరిస్థితి. ఈ స్టాక్ 5 శాతానికి పైగా నష్టపోయింది.
More From GoodReturns

Stock market: యుద్ధ భయాల్లోనూ దూసుకుపోతున్న షేర్లు.. ఇన్వెస్టర్లకు బంపర్ రిటర్న్స్ ఇచ్చిన పెన్నీ స్టాక్స్!

Stock market: ఇన్వెస్టర్లకు అగ్నిపరీక్ష..! వచ్చే వారం RBI నిర్ణయంపైనే అందరి కళ్లు!

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..



Click it and Unblock the Notifications