వాషింగ్టన్: అమెరికా-చైనా మధ్య వాణిజ్య యుద్ధం నడుస్తోంది. ఒకరిపై మరొకరు టారిఫ్‌లు పెంచుకోవడంతో మొదలైన ఈ ట్రేడ్ వార్ చైనా దిగ్గజ ఫోన్ కంపెనీ హువావేపై చర్యల వరకు వెళ్లింది. అయితే ఇటీవల తాత్కాలికంగా 90 రోజుల ఉపశమనం ఇచ్చింది ట్రంప్ సర్కార్. ఈ నేపథ్యంలో ఈ అంశంపై అమెరికా అధ్యక్షులు మాట్లాడారు. అమెరికా - చైనా ట్రేడ్ డీల్‌లో హువావే భాగస్వామ్యం కావొచ్చునని చెప్పారు. హువావే చాలా ప్రమాదకరమని, అయినప్పటికీ డీల్‌లో భాగం కావొచ్చునని చెప్పారు.
ఇదిలా ఉండగా, తమ స్మార్ట్‌ఫోన్లను నిరభ్యతరంగా వినియోగించవచ్చని హువావే తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్లకు ఉపయోగపడేలా అభివృద్ధి చేసిన ఆండ్రాయిడ్ సిస్టమ్‌తో ఎంతో కాలం నుంచి పని చేస్తున్నామని, అది అలా కొనసాగుతుందని పేర్కొంది. హువావే, హానర్ స్మార్ట్‌ఫోన్లకు, ట్యాబ్‌లకు ఎప్పటికప్పుడు సెక్యూరిటీ అప్‌డేట్స్ ఇస్తామని తెలిపింది. ఇప్పటికే యూజర్ల చేతుల్లో ఉన్న ఫోన్లకు, కొత్త ఫోన్లకు సేవలు యథాతథంగా కొనసాగుతాయని తెలిపింది. వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది. అలాగే యూజర్ల అభిరుచికి తగినట్లు ఓ సరికొత్త సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేసేందుకు సంస్థ నిరంతరం కృషి చేస్తోందని పేర్కొంది.

కాగా, హువావేపై నిషేధం విధించనున్నట్లు ట్రంప్ ఇటీవల స్పష్టం చేసిన విషయం తెలిసిందే. హువావేతో జాతీయ భద్రతకు ముప్పు ఉందని అందుకే నిషేధం విధిస్తున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో హువావేకు ఏ సేవలు అందించమని గూగుల్ ప్రకటించింది. దీంతో హువావే స్మార్ట్‌ఫోన్ అమ్మకాలపై ప్రభావం చూపనుందని చెబుతున్నారు. ఆండ్రాయిడ్ ఫ్లాట్‌ఫాం లేకుండా హువావే మొబైల్ ఫోన్లు తయారు చేస్తే వినియోగదారులు పెద్దగా ఆసక్తి చూపకపోవచ్చని అంటున్నారు. ఈ నేపథ్యంలో తమ ఫోన్లు కొనవచ్చునని హువావే తాజాగా ప్రకటన చేసింది.
More From GoodReturns

అమెరికాతో చర్చలేమి జరగలేదు..ట్రంప్ వ్యాఖ్యలను ఖండించిన ఇరాన్.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందనే భయంతోనే..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications