ఎయిరిండియా దేశీయ, విదేశీ రూట్లలో వచ్చే నెల నుంచి కొత్త విమాన సర్వీసులను నడపనుంది. ఈ మేరకు రెండు రోజుల క్రితం ఎయిరిండియా ప్రకటించింది. ముంబై - దుబాయి - ముంబై మార్గంలో వారానికి 3500 సీట్ల సర్వీస్‌ను పెంచనున్నట్లు తెలిపింది. జూన్ 1వ తేదీ నుంచి ఈ సర్వీసులు నడపనున్నారు. జూన్ 2వ తేదీ నుంచి ఢిల్లీ-దుబాయి-ఢిల్లీ మార్గంలో నడపనున్నారు.
వేసవి సెలవుల నేపథ్యంలో జూన్ 1 నుంచి వారానికి అదనంగా 3,500 సీట్లను ముంబై-దుబాయ్-ముంబై మార్గంలో, జూన్ 2 నుంచి వారానికి అదనంగా 3,500 సీట్లను ఢిల్లీ-దుబాయ్-ఢిల్లీ మార్గంలో రెండు కొత్త బీ787 డ్రీమ్లైనర్ల ద్వారా అందుబాటులోకి తెస్తున్నామని ఎయిరిండియా ప్రకటించింది. ప్రమోషనల్ ధరల్లో భాగంగా 2019 జూలై 31 వరకు దుబాయ్‌కు ఒకవైపు ఎకానమీ క్లాస్ ధరను రూ7,777గా నిర్ణయించింది.

దేశీయంగా ఢిల్లీ-భోపాల్-ఢిల్లీ రూట్లలో వారానికి 14 విమాన సర్వీసుల నుంచి 20 విమాన సర్వీసులకు అదేవిధంగా ఢిల్లీ-రాయ్‌పూర్-ఢిల్లీ రూట్లో ఉన్న వారానికి ఏడు విమాన సర్వీసులను వారానికి 14 విమాన సర్వీసులకు పెంచనున్నట్లు తెలిపింది. ఢిల్లీ-బెంగళూరు-ఢిల్లీ, ఢిల్లీ-అమృత్సర్-ఢిల్లీ, చెన్నై-అహ్మదాబాద్-చెన్నై, చెన్నై-కోల్‌కతా-చెన్నై మార్గాల్లోను విమానాలను పెంచనున్నట్లు తెలిపింది. ఢిల్లీ-వదోదర-ఢిల్లీ, ముంబై-వైజాగ్-ముంబై మార్గంలోను పెంచనున్నట్లు ప్రకటించింది.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications