మునిసిపల్ బాండ్స్, కార్పొరేట్ బాండ్స్, మసాలా బాండ్స్ పేరు వివిధ రకాల బాండ్స్ మనకు అందుబాటులో ఉన్నాయి. ఎవరెవరి అవసరాలకు తగ్గట్టు వాళ్లు బాండ్స్‌ను తీసుకుంటూ ఉంటారు. కానీ చిత్రంగా 'ఎలిఫెంట్ బాండ్స్' అనేవి ఇప్పుడు మార్కెట్లోకి కొత్తగా రాబోయేట్టు కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎడ్వైజరీ గ్రూప్ (ఓ సహాయ బృందం) మసాలా బాండ్స్‌ను ప్రవేశపెట్టాలని కేంద్రానికి సూచించింది. పన్ను కట్టకుండా ఎగ్గొట్టిన డబ్బును కేంద్రానికి లెక్కచూపేటప్పుడు (ఆమ్నెస్టీ అన్ డిస్‌క్లోజ్డ్ స్కీం) సదరు డబ్బుతో ఎలిఫెంట్ బాండ్స్‌ను కొనుగోలు చేయాలనేది ఈ బృందం సూచన.
భారీలక్ష్యం
కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సూచనలతో ఏర్పాటైన 12 మంది సభ్యుల బృందం ఇప్పటికే కేంద్రానికి ఈ నివేదికను సమర్పించింది. వీళ్ల సూచనల ప్రకారం కేంద్రం మళ్లీ ఆమ్నెస్టీ స్కీం లాంటిది ప్రకటించాల్సి ఉంటుంది. అంటే స్వచ్ఛందంగా తమ దగ్గరున్న లెక్కచూపని ఆదాయాన్ని కేంద్రానికి చూపించడం. అప్పుడు సదరు బ్లాక్ మనీ వైట్ మనీగా మారుతుంది. ఈ క్రమంలో అలా లెక్కచూపని డబ్బులో 50 శాతం మొత్తాన్ని ఎలిఫెంట్ బాండ్స్‌లో పెట్టుబడి పెట్టాలి. వీటికి 25 ఏళ్ల కాలపరిమితి ఉన్న సావరిన్ బాండ్స్. అయితే వీటికి ఏదైనా కనీస మొత్తంలో వడ్డీ ఇస్తారా, లేక అవసరమైనప్పుడు విత్ డ్రా చేసుకోవచ్చా, లేక పాతికేళ్లపాటు ప్రభుత్వం దగ్గరే డబ్బు ఉంచాలా అనే అంశాలపై స్పష్టత లేకున్నా స్థూలంగా ఇదీ కేంద్రం ఆలోచన. ఇలా సమీకరించిన మొత్తాన్ని కేవలం మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల కోసం వినియోగించాల్సి ఉంటుంది.

ఇంకేం సలహా ఇచ్చారు ?
మౌలిక సదుపాయాలను పెంచడంతో పాటు వస్తు, సేవల ఎగుమతులను మరింతగా ప్రోత్సహించి 2025 నాటికి 1000 బిలియన్ డాలర్లకు (రూ.70 లక్షల కోట్లు) తీసుకెళ్లడమే కేంద్రం టార్గెట్‌గా ఉంది. వీటికి తోడు కార్పొరేట్ పన్నును తగ్గించడం, తక్కువ ఖర్చులో రుణాలు, విదేశీ పెట్టుబడులు సరళమైన పన్ను విధానం వంటి చర్యలు తీసుకోవాలని సదరు బృందం కేంద్రానికి నివేదించింది. ఇప్పుడు రూ.35 లక్షల కోట్లుగా ఉన్న ఎగుమతులను 2025 నాటికి రూ.70 లక్షల కోట్లు పెంచడమే లక్ష్యంగా కేంద్రం ఈ చర్యలు తీసుకోవాలని చూస్తోంది. ఈ ఎలిఫెంట్ బాండ్స్ పై కేంద్రం త్వరలో నిర్ణయం తీసుకోనుంది. అధికార పగ్గాలు చేపట్టిన కొంత కాలంలో వీటిపై ఓ క్లారిటీ రావొచ్చు.


Click it and Unblock the Notifications