తెలంగాణ చిన్న పట్టణాలకు జొమాటో, డెలివరీ బాయ్స్ రిక్రూట్మెంట్ షురూ

ప్రముఖ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో తెలంగాణ రాష్ట్రంలో తృతీయ శ్రేణి (చిన్న) పట్టణాలకు విస్తరిస్తోంది. ఈ దిశగా కంపెనీ ఇప్పటికే కార్యాచరణ మొదలు పెట్టింది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు తెలంగాణలోని జగిత్యాల, గద్వాల, నిజామాబాద్, నల్గొండ, అదిలాబాద్, మహబూబ్ నగర్, సిద్దిపేట, మెదక్ పట్టణాల్లో తన సేవలను అందించనుంది.

ఈ మేరకు కంపెనీ భారీగా డెలివరీ బాయ్స్‌ను నియమించుకుంటోంది. వీరికి నెలకు రూ.12,000 వరకు వేతనం ఆఫర్ చేస్తోంది. అంతేకాదు, కంపెనీలో చేరగానే ప్రతి డెలివరీ బాయ్‌కు రూ.2,000 బోనస్ (జాయినింగ్ బోనస్) ఇస్తోంది.

Zomato services in Nizamabad, Nalgonda, Adilabad soon

ఇప్పటికే దేశవ్యాప్తంగా 200 నగరాలు, పట్టణాల్లో తన సేవలను అందిస్తోన్న జొమాటోకు దేశవ్యాప్తంగా సుమారు లక్ష మంది డెలివరీ బాయ్స్ ఉన్నారు. హైదరాబాద్ సహా వరంగల్ వంటి ద్వితీయ శ్రేణి నగరాల్లోను ఏడాది క్రితం సేవలు ప్రారంభించిన జొమాటో ఇప్పుడు ఏకంగా జగిత్యాల వంటి చిన్న పట్టణాల్లో విస్తరిస్తుండటం ఆ కంపెనీ వ్యూహంలో భాగమని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

భారత్‌లో 2021 నాటికి దాదాపు 3 బిలియన్ డాలర్లు (సుమారు రూ.21 వేల కోట్లు) ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీకి చేరుకోనుంది. ఇప్పటికే ఇందులో స్విగ్గీ, జొమాటో సహా ఊబర్ ఈట్స్, ఫుడ్ పాండా (ఓలా కంపెనీ) నిమగ్నమై ఉన్నాయి. అయితే పోటీలో మాత్రం స్విగ్గీ, జొమాటో మాత్రమే నువ్వా నేను అన్నట్లు పోటీ పడుతున్నాయి.

భారీగా డిస్కౌంట్ ఆఫర్ చేయడం ద్వారా ఈ రెండు కంపెనీలు వినియోగదారుల మన్ననలు పొందగలుగుతున్నాయి. స్విగ్గీ, జొమాటో సగటున నెలకు 3 కోట్లు ఆర్డర్లు దక్కించుకోవడం వాటి సత్తాకు నిదర్శనంగా నిలుస్తోంది. అయితే ఈ రంగంలో పని చేస్తోన్న ఏ కంపెనీ కూడా లాభాలను కళ్లజూడలేదు. కేవలం పెట్టుబడిదారుల నిధులపై ఆధారపడి కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. వందల కోట్లలో నష్టాలను మూటగట్టుకుంటున్నాయి. ఏది ఏమైనా చిన్న ప్టణాలకు జొమాటో, స్విగ్గీ వంటి కంపెనీల రాకతో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+