For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

TV9 విషయంలో అసలేం జరిగింది: అనుకున్నదొక్కటి... రవిప్రకాశ్ నోట అదే మాట

|

TV9 మాజీ సీఈవో రవిప్రకాశ్ అజ్ఞాతం నుంచి బుధవారం నాడు ఓ వీడియో సందేశం విడుదల చేశాడు. అందులో టీవీ9 లావాదేవీలు, ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు తనపై పెట్టిన మూడు కేసుల అంశం గురించి ప్రస్తావించారు. TV9 లావాదేవీల విషయంలో రవిప్రకాశ్ భావించింది ఒకటి కాగా.. చివరకు జరిగింది ఒక్కటి. ఇదే విషయాన్ని రవిప్రకాశ్ తన వీడియో ప్రారంభంలో చెప్పారు. ఏం జరిగిందనే అంశానికి సంబంధించి కథనాలు కూడా ఇచ్చాం. కాగా, రవిప్రకాశ్ దాదాపు 9 నిమిషాల వీడియోను విడుదల చేశారు.

TV9 రవిప్రకాశ్‌కు అప్పుడు ఉన్నదేమిటి, ఇప్పుడు లేనిదేమిటి?TV9 రవిప్రకాశ్‌కు అప్పుడు ఉన్నదేమిటి, ఇప్పుడు లేనిదేమిటి?

అనుకున్నదొక్కటి.. అయింది ఒక్కటి

అనుకున్నదొక్కటి.. అయింది ఒక్కటి

TV9 వృద్ధికి శ్రీనిరాజ్ తన పెట్టుబడులతో ప్రయివేటు ఈక్విటీతో ఆర్థికంగా ఎంతో ప్రోత్సహించారని రవిప్రకాశ్ ఆ వీడియోలో చెప్పాడు. తాను లాభాలతో TV9 గ్రూప్ నుంచి బయటకు వెళ్తానని శ్రీనిరాజ్ చెప్పారని, దానికి తాను అంగీకరించానని, దీంతో TV9 పెట్టుబడుల కోసం పలువురిని కలిశానని, అందులో భాగంగా మెగా కృష్ణారెడ్డి అనే కాంట్రాక్టర్‌ని కలిశానని చెప్పారు. తాను, మరో నలుగురు మిత్రులతో కలిసి తలో 20 శాతం తీసుకుంటామని మెగా కృష్ణారెడ్డి చెప్పారని, అలాగే తనకు పూర్తి ఎడిటోరియల్ స్వేచ్ఛ ఇస్తామని చెప్పారని మాట ఇచ్చారని, దీంతో మెగా కృష్ణారెడ్డిని శ్రీనిరాజుతో కల్పించానని చెప్పారు. తాను తన స్నేహితులతో కలిసి మెగా కృష్ణారెడ్డి TV9లోకి వస్తారని ఆశించానని, కానీ తాను ఆశించింది ఒక్కటయితే జరిగింది ఒక్కటని చెప్పారు.

<strong>అనుకున్నదొక్కటి.. అయినది ఒక్కటి: TV9 రవిప్రకాశ్ విషయంలో జరిగిందిదే!</strong>అనుకున్నదొక్కటి.. అయినది ఒక్కటి: TV9 రవిప్రకాశ్ విషయంలో జరిగిందిదే!

వాటాదారుగా రామేశ్వర రావు

వాటాదారుగా రామేశ్వర రావు

మెగా కృష్ణారెడ్డి స్థానంలో రామేశ్వర రావు మెగా వాటాదారుగా వచ్చారని రవిప్రకాశ్ చెప్పాడు. అప్పుడే తాను మెగా కృష్ణారెడ్డిని అడిగానని, మనం అనుకున్నదేమిటి, జరిగిందేమిటి అని ప్రశ్నించానని చెప్పాడు. ఎవరికీ మెజార్టీ వాటా ఉండదని చెప్పి, ఇప్పుడు మాట తప్పారని అడిగానని అన్నారు. ఆ తర్వాత తాను రామేశ్వర రావు గారితో మాట్లాడానని, తాను TV9 మైనార్టీ వాటాదారుగా ఉన్నానని, కాబట్టి మనిద్దరి మధ్య షేర్ హోల్డర్ అగ్రిమెంట్ ఉండాలని చెప్పానని, ఇది చట్టరీత్యా అవసరమని చెప్పానని, కానీ రామేశ్వర రావు రాతపూర్వక ఒడంబికకు ఒప్పుకోనని చెప్పారని రవిప్రకాశ్ అన్నాడు. తన వద్ద జీతగాడిగా, పాలేరుగా పని చేయాలని చెప్పారన్నాడు. దీనిని తాను ప్రతిఘటించానని, దీంతో రామేశ్వర రావు తనను TV9 నుంచి బయటకు వెళ్లిపోయేలా ఇబ్బందులకు గురి చేస్తానని చెప్పాడన్నారు. తన పరిమితులకు లోబడి పని చేయాలని చెప్పాడన్నారు. ఆ పరిస్థితులు ఇప్పుడు చూస్తున్నానని అన్నారు.

TV9 రవిప్రకాశ్ కోరుకున్న ఇన్వెస్టర్ ఎవరు?TV9 రవిప్రకాశ్ కోరుకున్న ఇన్వెస్టర్ ఎవరు?

 తనపై మూడు దొంగ కేసులు పెట్టారని, తీవ్రవాది

తనపై మూడు దొంగ కేసులు పెట్టారని, తీవ్రవాది

పారిపోతున్నట్లుగా ఎయిర్ పోర్ట్, షిప్ యార్డుల్లో అలర్ట్ పెట్టారని రవిప్రకాశ్ అన్నాడు. రామేశ్వర రావు తనపై మూడు తప్పుడు కేసులు పెట్టించారన్నాడు. మొదటి తప్పు కేసు.. రవిప్రకాశ్-శివాజీ తప్పుడు ఒప్పందం కుదుర్చుకున్నారని రామేశ్వర రావు బంధువు ఫిర్యాదు చేస్తే, పోలీసులు కేసు నమోదు చేశారని తెలిపాడు. కానీ ఈ కేసు కోర్టులో ఉందని, న్యాయస్థానంలో ఉన్న పత్రాలపై ఆ కోర్టు అనుమతి లేకుండా ఎలా కేసు ఫైల్ చేస్తారని ప్రశ్నించారు. రెండో కేసు.. ఫోర్జరీ చేసినట్లు కేసు పెట్టారని, కానీ ఇది కూడా అవాస్తవం అన్నాడు. అసలు వాళ్లే తమ ఉద్యోగిని (దేవేందర్ అగర్వాల్) కిడ్నాప్ చేసి దొంగపత్రాలను అప్ లోడ్ చేసే ప్రయత్నాలు చేశారని చెప్పాడు. ఓ పార్ట్ టైమ్ ఉద్యోగి కేసును తాను ఫోర్జరీ చేశానని కేసు పెట్టడం విడ్డూరమన్నాడు. మూడో కేసు.. TV9 లోగోను తాను దొంగిలించినట్లుగా పెట్టారని చెప్పాడు. TV9 లోగోను సృష్టించిందే రవిప్రకాశ్ అని, ఈ లోకో అథారిటీ ఉంది రవిప్రకాశ్, ఈ లోగో యజమాని రవిప్రకాశ్ అన్నాడు. అసలు వాళ్లు రాయల్టీ చెల్లించాలన్నాడు. సృష్టికర్తనే లోగోను మాయం చేశాడని చెప్పడం విడ్డూరంగా ఉందన్నాడు.

TV9 మాజీ సీఈవో రవిప్రకాశ్ ఇబ్బంది పడింది ఆయన వల్లేనా?TV9 మాజీ సీఈవో రవిప్రకాశ్ ఇబ్బంది పడింది ఆయన వల్లేనా?

Read more about: ravi prakash
English summary

TV9 విషయంలో అసలేం జరిగింది: అనుకున్నదొక్కటి... రవిప్రకాశ్ నోట అదే మాట | TV9 former CEO Ravi Prakash released video

TV9 former CEO Ravi Prakash released video on Wednesday afternoon over TV9 sale issue and Rameswara Rao's entry into frame.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X