ఆహార ఉత్పత్తుల స్టోర్లను ప్రారంభించనున్న ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్
ముంబై: వాల్‌మార్ట్ నేతృత్వంలోని ప్రముఖ ఆన్‌లైన్ ఈకామర్స్ స్టోర్ ఫ్లిప్ కార్ట్ త్వరలో ఆహార ఉత్పత్తులను ఆఫ్‌లైన్ స్టోర్ల ద్వారా విక్రయించే యోచనలో ఉన్నట్లు సమాచారం. అయితే ఈ రీటెయిల్ సంస్థలో విదేశీ పెట్టుబడిదారులు ఇన్వెస్ట్ చేసేందుకు అవకాశం లేదు.ఇక ఫ్లిప్ కార్ట్ గ్రాసరీ స్టోర్‌లో 100శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెట్టేలా ఒప్పించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే ఫ్లిప్ కార్ట్ తన ఐదవ ఆన్‌లైన్ గ్రాసరీ స్టోర్‌ను ముంబైలో ప్రారంభించింది.
ప్రపంచవ్యాప్తంగా 50 నుంచి 60శాతం వాల్‌మార్ట్ సేల్స్ ఒక్క ఆహార ఉత్పత్తుల నుంచి వస్తున్నవే. అయితే ఫ్లిప్ కార్టు ఆఫ్‌లైన్ స్టోర్‌లను ప్రారంభిస్తే నిబంధనల ప్రకారం అది వాల్‌మార్ట్ కిందకు వస్తుంది. భారత్‌లో ఎఫ్‌డీఐ నిబంధనల కారణంగా వాల్‌మార్ట్ బిజినెస్ టూ బిజినెస్ పద్ధతి ప్రకారమే తన కార్యకలాపాలను నిర్వహించాల్సి ఉంటుంది. ఫ్లిప్‌కార్ట్ ఆహార ఉత్త్పత్తుల రంగంలోకి దిగితే వాల్‌మార్ట్‌కు కూడా కలిసొచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం వాల్‌మార్ట్ రెవిన్యూ మందగిస్తోంది.

ఇదిలా ఉంటే అమెజాన్ వాల్‌మార్ట్‌లోని ప్రపంచవ్యాప్తంగా ఆహార ఉత్పత్తులపై 500 మిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసింది.అమెజాన్ రీటెయిల్ ఇండియా ద్వారా ఈ పెట్టుబడులు పెట్టింది.ఆదిత్య బిర్లా గ్రూప్‌కు చెందిన ఫుడ్ అండ్ గ్రాసరీ రీటెయిల్ చెయిన్ మోర్‌లో మెజార్టీ వాటాలను దక్కించుకున్న అమెజాన్... కిషోర్ బియానీకి చెందిన ఫ్యూచర్ రిటెయిల్ అంటే ఈజీడే, బిగ్ బజార్‌లో కూడా వాటాలు దక్కించుకునే ప్రయత్నంలో ఉంది. అంతేకాదు నష్టాల్లో ఉన్న ముఖేష్ అంబానీ రిలయన్స్ రీటెయిల్‌ను కూడా కొనే ప్రయత్నాల్లో అమెజాన్ ఉన్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications