దివాన్ హౌసింగ్... మరో పిడుగు

దేశంలోని ప్రముఖ హౌసింగ్ ఫైనాన్స్ సంస్థల్లో ఒకటైన దివాన్ హౌసింగ్.. మరో పిడుగులాంటి వార్త చెప్పింది. తక్షణం డిపాజిట్లు, డిపాజిట్ల పునురద్ధరణ, మధ్యంతర చెల్లింపులు నిలిపేయబోతున్నట్టు డిహెచ్ఎఫ్ఎల్ ప్రకటించింది. దీంతో మార్కెట్ వర్గాలు, ఇన్వెస్టర్లు, ఫండ్ హౌస్‌లో మళ్లీ ఆందోళన మొదలైంది. ఈ మధ్యే వచ్చిన క్రెడిట్ రేటింగ్ నేపధ్యంలో ఫిక్సెడ్ డిపాజిట్లు సేకరించేందుకు డిహెచ్ఎఫ్ఎల్‌కు అడ్డంకిగా మారింది. దీంతో తప్పక ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది.

వరుస దెబ్బలు
ఈ మధ్య డిహెచ్ఎఫ్ఎల్ వరుస దెబ్బలు పడ్తూనే ఉన్నాయి. దీర్ఘకాలిక రుణాలు, ఫిక్సెడ్ డిపాజిట్లు, నాన్ కన్వర్టబుల్ డిబెంచర్లను కేర్ సంస్థ తాజాగా డౌన్ గ్రేడ్ వేసింది. వీటి విలువ సుమారు రూ.1.3 లక్షల కోట్లు. ఇందులో కూడా రూ.20 వేల కోట్ల విలువైన బాండ్లను కేర్ ఏ రేటింగ్ నుంచి కేర్ బిబిబి మైనస్ రేటింగ్‌కు తగ్గించింది. దీంతో ఈ బాండ్లు రిస్క్‌తో కూడుకున్నవనే సంకేతాన్ని ఇచ్చింది కేర్.

DHFL puts fresh deposits and renewals on hold, halts pre-mature withdrawals

ఇక డిపాజిట్లు తీసుకోలేం
తాజాగా డిహెచ్ఎఫ్ఎల్ యాజమాన్యం తమ డిస్ట్రిబ్యూటర్లకు రాసిన లేఖలో డిపాజిట్ల స్వీకరించవద్దని అంశాన్ని సవివరంగా రాసింది. అంతేకాదు సమయం పూర్తికాని (ప్రీ మెచ్యూర్డ్) ఉపసంహరణలకు కూడా అవకాశం లేదని స్పష్టం చేసింది. అయితే ఏదైనా ఆర్థిక, అనారోగ్య ఎమర్జెన్సీ వస్తే బాండ్లను మధ్యలో రద్దు చేసిన నగదు తీసుకోవచ్చని స్పష్టం చేసింది డిహెచ్ఎఫ్ఎల్.

ఈ హౌసింగ్ ఫైనాన్స్ సంస్థ ఈ మధ్య కాలంలో ఏడాది నుంచి పదేళ్ల కాలపరిమితికి 8.2 - 9.25 శాతం వడ్డీ ఇచ్చి రుణాలను సమీకరించింది. అయితే ఈ మధ్యకాలంలో డిహెచ్ఎఫ్ఎల్ తన పేమెంట్ల విషయంలో ఎప్పుడూ డిఫాల్ట్ కాలేదు. అయినా ఐఎల్ఎఫ్ఎస్ సంక్షోభం నేపధ్యంలో డిహెచ్ఎఫ్ఎల్‌కు ఆ వేడి తాకింది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+