చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం హువావేపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన నిషేధం తీవ్ర ప్రభావం చూపుతుందా? దానికి తోడు హార్డ్‌వేర్, సాఫ్టువేర్ సహా ఇతర సేవలు అనుమతించమని గూగుల్ ప్రకటించింది. ఈ ప్రభావం హువావేపై ఉంటుందా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. హువావే ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్మార్ట్ ఫోన్ సంస్థ. హువావే ఆండ్రాయిడ్ ప్లాట్ ఫాం లేకుండా మొబైల్ ఫోన్లు తయారు చేస్తే వినియోగదారులు ఆసక్తి చూపకపోవచ్చునని హాంగ్‌కాంగ్‌కు చెందిన సౌత్ మార్నింగ్ పోస్ట్ పేర్కొంది. గూగుల్ లేని హువావే ఫోన్లు కస్టమర్లను ఆకట్టుకోలేవని, ఇది ప్రత్యర్థి కంపెనీలకు లాభమని చెబుతున్నారు.

ప్రత్యర్థులకు లాభం
ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది హువావే ఫోన్ వినియోగదారులు ఉన్నారు. చైనా - అమెరికా వాణిజ్య యుద్ధం నేపథ్యంలో అమెరికా, గూగుల్... హువావేపై తీసుకున్న నిర్ణయం హువావే ఫోన్ యూజర్లను ఆందోళనకు గురి చేస్తోందని అంటున్నారు. గూగుల్ సేవలు లేని హువావే ఫోన్ కొనుగోలు చేసేందుకు ఎవరూ ఆసక్తి చూపరని చెబుతున్నారు. హువావేకు ఇప్పటికే శాంస్‌సంగ్, షియోమి, ఒప్పోల నుంచి గట్టి పోటి ఉంది. హువావేపై అమెరికా నిషేధం ప్రత్యర్థి కంపెనీలకు లాభించనుంది. కొనుగోలుదారులను ఆకట్టుకునేందుకు ఏ మొబైల్ కంపెనీ అయినా వినూత్న ఫీచర్లతో స్మార్ట్ ఫోన్ తయారు చేస్తోంది. ఎన్ని ఫీచర్లు జోడించినా గూగుల్ అందించే ఆండ్రాయిడ్ వర్షన్ పైనే పని చేస్తాయి.

గూగుల్ సేవలు లేని హువావే
భారత్ సహా దాదాపు అన్ని దేశాల్లో జీ-మెయిల్, యూట్యూబ్, మ్యాప్స్, డ్రైవ్‌లు ఇలా గూగుల్ అందించే సేవలను విస్తృతంగా వినియోగిస్తారు. ఇవి లేని ఫోన్లు చాలా చాలా అరుదు. కాబట్టి గూగుల్ సేవలు లేని హువావే ఫోన్లను కొనుగోలు చేసేందుకు కొనుగోలుదారులు ఆసక్తి చూపించరనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇది హువావేకు చాలా పెద్ద సమస్య. ఇదే పరిస్థితి కొనసాగితే హువావే ఫోన్ల తయారీ భారీగా పడిపోవచ్చునని భావిస్తున్నారు. కేవలం చైనాలో మాత్రమే హువావే మనుగడ సాగించగలదు. హువావే పరిస్థితి ఇలాగే ఉంటే భవిష్యత్తులో ఈ ఫోన్ పేపర్ వెయిట్‌లా మాత్రమే ఉపయోగపడుతుందని అంటున్నారు. గూగుల్ సేవలు లేని ఫోన్ల వినియోగానికి ఎక్కువ మంది ఆసక్తి చూపరని అంటున్నారు. హువావే ఫోన్లపై చైనాలో అంతగా ప్రభావం పడదని, కానీ మిగతా దేశాల్లో మాత్రం అమెరికా బ్లాక్ లిస్ట్ ప్రభావం ఉంటుందని కౌంటర్ పాయింట్ రీసెర్చ్ వెల్లడించింది.

వినియోగదారుల ఆందోళన
హువావే ఫోన్లపై గూగుల్ సేవలు నిలిపివేయడంతో ఓ వినియోగదారుడు ట్విట్టర్ వేదికగా తన ఆందోళన వ్యక్తం చేశాడు. తాను పీ30ప్రో ఫోన్ ఉపయోగిస్తున్నానని, నెల రోజుల క్రితమే కొనుగోలు చేశానని ఆందోళన వ్యక్తం చేయగా, గూగుల్ అధికార ప్రతినిధి స్పందిస్తూ... రానున్న 90 రోజులు కూడా హువావేకు తాము అన్ని సేవలు కొనసాగిస్తామని వెల్లడించారు. మే 16వ తేదీకి ముందు గూగుల్ సర్టిఫైడ్ అన్ని హువావే ఫోన్లకు గూగుల్ ప్లే స్టోర్ యాక్సెస్ ఉంటుందని, ఇతర ప్రీలోడెడ్ యాప్స్, సేవల యాక్సెస్ కూడా ఉంటుందట. ఇది గూగుల్, యూజర్లకు మధ్య ట్రాన్సాక్షన్ అని, కానీ గూగుల్, హువావేకు కాదని వెల్లడించింది. అయితే, సాఫ్టువేర్ బగ్స్, గూగుల్ వర్షన్ ఇతర టెక్నికల్ ఫిక్సెస్‌పై కలిసి పని చేసేందుకు సిద్ధంగా లేదు. దీంతో హువావే సొంతగా డెవలప్ చేయవలసి ఉంటుంది. మే 16వ తేదీన కొనుగోలు చేసిన హువావే ఫోన్ వినియోగదారులకు గూగుల్ సపోర్ట్ ఉండదు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications