గుడ్‌న్యూస్!: త్వరలో టీవీ ఛానల్స్ ధరలు తగ్గే అవకాశం

ఫిబ్రవరి నుంచి అమలవుతున్న టీవీ ఛానల్ ప్యాకేజీ పద్ధతి చాలామందిని గందరగోళానికి గురి చేస్తోంది. ఏ ఛానల్‌కు ఎంత అని ఉన్నప్పటికీ.. ప్యాకేజీ తీసుకునే సమయానికి అంతా కన్ఫ్యూజన్‌గా ఉందని చెబుతున్నారు. టీవీ యూజర్లకు ఇది ప్రయోజనం చేకూర్చుతుందనుకుంటే అది కాస్తా ఇబ్బందిగా మారింది. అయితే టెలికం అండ్ బ్రాడ్‌కాస్టింగ్ రెగ్యులేటర్.. ట్రాయ్ గుడ్ న్యూస్ అందించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అది జరిగితే మీ కేబుల్ టీవీ బిల్స్ తగ్గనున్నాయి. కన్స్యూమర్ల కేబుల్, డీటీహెచ్ బిల్స్‌ను తగ్గించే అంశంపై కసరత్తు చేస్తోందట.

గుడ్ న్యూస్ అందించనున్నారా?

గుడ్ న్యూస్ అందించనున్నారా?

ఫిబ్రవరిలో వచ్చిన మంత్లీ టీవీ బిల్స్ ప్యాకేజీ పద్ధతి అంతగా వర్కవుట్ కాలేదని ఓ అధికారి వెల్లడించారట. బ్రాడ్‌కాస్టింగ్ టారిఫ్స్ తగ్గించేందుకు కన్సల్టేషన్ పేపర్ పైన వర్క్ చేస్తున్నామని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఓ అధికారి చెప్పాడని ఇంగ్లీష్ మీడియాలో వార్తలు వచ్చాయి. కన్స్యూమర్ల డీటీహెచ్ బిల్లులు తగ్గించేందుకు ఏం చేయాలో చూడాలని చెప్పారట. అయితే టారిఫ్‌లు తగ్గించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారనే అంశంపై ప్రత్యేకంగా ఏమీ చెప్పలేదట.

టారిఫ్ నిర్ణయించే అధికారం ఉందా?

టారిఫ్ నిర్ణయించే అధికారం ఉందా?

అయితే టారిఫ్‌లు నిర్ణయించే అధికారం ట్రాయ్‌కు లేదని కొన్ని బ్రాడ్ కాస్టర్స్ చెబుతుండగా, సదరు అధికారి మాత్రం రెగ్యులేటర్‌కు ఎప్పుడూ నియంత్రణ అధికారాలు ఉన్నాయని, కానీ మార్కెట్ దృష్ట్యా తాము ఏమీ చెప్పడం లేదని వెల్లడించాడని తెలుస్తోంది.

కొత్త ప్లాన్ సక్సెస్ కాలేదు

కొత్త ప్లాన్ సక్సెస్ కాలేదు

టీవీ చూసే కన్స్యూమర్లకు ధరలు త్గగించే ఉద్దేశ్యంతో ఇటీవల కొత్త టారిఫ్‌లు తెచ్చారు. అయితే ఈ కొత్త పాలసీ వల్ల ధరలు ఎక్కువ అయ్యాయనే ఫిర్యాదులు వచ్చాయని, అలాగే అంతా కన్ఫ్యూజన్‍‌గా మారిందని చెబుతున్నారు. ఈ ప్లాన్ అంచనాలకు అనుగుణంగా సక్సెస్ కాలేదని ఆ అధికారి వెల్లడించారట. టీవీ ఛానల్స్ ధరలను మరింత పారదర్శకం చేయాలని, టీవీ ఛానల్స్ ఎంపిక కన్స్యూమర్ చేతిలో ఉండాలనే ఉద్దేశ్యంతో ఈ స్కీం తీసుకు వచ్చామని, తద్వారా వినియోగదారుడికి మరింత లబ్ధి చేకూర్చే విధంగా ఈ కొత్త ప్లాన్ ఉంటుందని భావించామని, కానీ ఆ విధంగా జరగలేదని సదరు అధికారి చెప్పారు.

అంతా కన్ఫ్యూజన్

అంతా కన్ఫ్యూజన్

వినియోగదారులు తాము చూడాలనుకున్న టీవీ ఛానల్‌కు మాత్రమే డబ్బులు చెల్లించే పద్ధతిని ట్రాయ్ గత డిసెంబర్‌లో తప్పనిసరి చేసింది. దీంతో ఒక్కో ఛానల్‌కు ఒక్కో ధర ఇచ్చారు. ఈ నిబంధనలు ఫిబ్రవరి 1వ తేదీ నుంచి అమలులోకి వచ్చాయి. బంకెట్ ఆప్ ఛానల్స్‌కు రూ.19 కంటే ఎక్కువ కాదు. బంకెట్‌లో లేని మరియు డిజైన్డ్ ప్రీమియం ఛానల్స్ పరిధిలో లేకుంటే ఆ ఛానల్‌కు ఎలాంటి ధర లేదు. కానీ ఇది అంతా కన్ఫ్యూజన్‌కు దారి తీసింది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+