నిన్న ఆవేశం.. ఈ రోజు ఆయాసం ! నష్టాల్లో ముగింపు

స్టాక్ మార్కెట్ సూచీలు నిన్నటి అతి భారీ లాభాల తర్వాత ఈ రోజు కాస్త నీరసించాయి. ఇన్వెస్టర్లు, ట్రేడర్లు లాభాల స్వీకరణకు దిగడంతో సెన్సెక్స్, నిఫ్టీలు భారీగా పతనమయ్యాయి. ఈ ఉదయం ఫ్లాట్‌గానే మొదలైనప్పటికీ మార్కెట్లు ఆ తర్వాత ఏ దశలోనూ కోలుకున్న దాఖలాలు కనిపించలేదు. మిడ్ సెషన్ నాటికి కుప్పకూలిన మార్కెట్లు ఆ తర్వాత ఒడిదుడుకులకు లోనైనప్పటికీ చివరకు నష్టాలనే మూటగట్టుకున్నాయి. 11863 పాయింట్ల దగ్గర ప్రారంభమైన నిఫ్టీ ఆ తర్వాత 11682 పాయింట్ల కనిష్ట స్థాయికి దిగొచ్చాయి. ఎవ్వరూ ఊహించిన రీతిలో పతనమయ్యాయి. నిన్న మార్కెట్లను పైకి లేపిన బ్యాంకింగ్, ఫైనాన్స్ స్టాక్స్ ఈ రోజు దిగాలు పడ్డాయి. చివరకు సెన్సెక్స్ 383 పాయింట్లు నష్టంతో 38వేల 970 దగ్గర ముగిసింది. బ్యాంక్ నిఫ్టీ 451 పాయింట్లు కోల్పోయి 30308 దగ్గర స్థిరపడింది.

అన్ని రంగాలూ నీరసమే

అన్ని రంగాలూ నీరసమే

నిన్న రెట్టించిన ఉత్సాహంతో పెరిగిన సెక్టోరల్ సూచీలు ఈ రోజు దిగాలుపడ్డాయి. చివరకు అన్ని రంగాల్లో నష్టాల్లో ముగిశాయి. ప్రధానంగా మీడియా, ఆటో, మెటల్, ప్రైవేట్ బ్యాంక్స్, ఐటి రంగాల్లో అమ్మకాల ఒత్తిడి అధికంగా ఉంది. ఇక మిడ్ క్యాప్ ఇండెక్స్ ఒకటిన్నర శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఒక్క శాతం కోల్పోయాయి.

జెట్ ఎయిర్‌లో ఆశలు

జెట్ ఎయిర్‌లో ఆశలు

జెట్ ఎయిర్‌లో పెట్టుబడుల విషయంలో ఏతిహాద్, హిందుజా ముందుకు వస్తున్నారనే వార్తలతో ఈ స్టాక్ లాభాల్లో ముగిసింది. అటువైపు ఉద్యోగులు కూడా 700 మిలియన్ డాలర్ల పెట్టుబడికి కొంత మంది సిద్ధంగా ఉన్నారని ఎస్బీఐకి లేఖ రాయడం పాజిటివ్‌గా మారింది. దీంతో ఈ స్టాక్ 15 శాతం లాభపడి రూ.151 దగ్గర క్లోజైంది.

ఎడిల్వైజ్‌ హై జంప్

ఎడిల్వైజ్‌ హై జంప్

ఇంతటి మార్కెట్ ఒడిదుడుకుల్లోనూ ఎడిల్వైజ్ ఫైనాన్షియల్ 7 శాతం వరకూ పెరిగింది. ఇంట్రాడేలో రూ.184 వరకూ వెళ్లిన స్టాక్ చివర్లోకాస్త తడబడినప్పటికీ రూ.181 దగ్గర క్లోజైంది. మెరుగైన త్రైమాసిక ఫలితాలకు తోడు ఎన్ బి ఎఫ్ సిల్లో బయింగ్ కలిసొచ్చింది.

టాటా మోటార్స్.. మళ్లీ అంతే

టాటా మోటార్స్.. మళ్లీ అంతే

ఆర్థిక ఫలితాల వెల్లడైన తర్వాత స్టాక్ మళ్లీ దిగాలుపడింది. నిన్న అనూహ్యంగా ఆటోమొబైల్ ప్యాక్ అంతా లాభపడడంతో ఈ స్టాక్ కూడా జోరందుకుంది. అయితే నికర లాభాల్లో 49 శాతం క్షీణత టాటా మోటార్స్‌ను కిందికి తెచ్చింది. దీంతో ఈ స్టాక్ 7 శాతం నష్టాలతో రూ.177 దగ్గర స్థిరపడింది.

లూజర్స్...

లూజర్స్...

ఐడీబీఐ 6 శాతం, వొడాఫోన్ ఐడియా 6 శాతం, మదర్సన్‌సుని 5 శాతం, బిపిసిఎల్ 4.5 శాతం, జీ ఎంటర్‌టైన్మెంట్ 4.5 శాతం నష్టపోయింది. అస్ట్రాల్ పాలీ టెక్నిక్ 8 శాతం, డిష్ టీవీ 6 శాతం, జూబిలెంట్ లైఫ్ 5 శాతం, ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ 5 శాతం, హెచ్ ఈ జీ 5 శాతం నష్టాల్లో ముగిశాయి.

బాలాజీ అమైన్స్ 7 శాతం, ఫిలిప్స్ కార్బన్ బ్లాక్ 7 శాతం, త్రివేణి టర్బైన్స్ 6 శాతం, హెల్త్ కేర్ గ్లోబల్ 6 శాతం కోల్పోయాయి.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+