ముంబై : టెలికం రంగంలో సంచలనాలకు తెరతీసిన రిలయన్స్ ఇండస్ట్రీస్ రిటైల్ రంగంలో తనదైన ముద్ర వేయడానికి సిద్ధమవుతోంది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లకు ధీటుగా రిటైల్ రంగాన్ని ఏలేందుకు రెడీ అవుతోంది. గ్లోబల్ మార్కెట్ రీసెర్చ్ కంపెనీ ఫారెస్టర్ అధ్యయనం ప్రకారం భారత్‌లో వచ్చే ఐదేళ్లలో ఆన్‌లైన్ రిటైల్ సేల్స్ 25.8శాతం పెరగనుంది. 2013 నాటికి మార్కెట్ విలువ 85బిలియన్ డాలర్లకు చేరనుంది. 2016లో నోట్ల రద్దు, 2017లో జీఎస్టీ అమలు, గత డిసెంబర్‌లో ఈ కామర్స్ పాలసీలో మార్పుల రూపంలో ఒడిదొడుకులు ఎదురైనా వృద్ధి కొనసాగుతుందని అంచనా వేసింది.
6,600 నగరాలు, పట్టణాల్లో 10,415 స్టోర్లు కలిగిన రిలయన్స్ రిటైల్ ఏటా 500మిలియన్ల కస్టమర్లు ఉన్నారు. ఈ నేపథ్యంలో భారీ డిస్కౌంట్లతో ముందుకొచ్చే రిలయన్స్ స్టోర్లకు ఆదరణ పెరుగుతుందని ఫారెస్టర్ అంచనా వేస్తోంది. ఇది అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి ఈ కామర్స్ సైట్లకు పెద్ద ఎదురుదెబ్బ అవుతుందని విశ్లేషించింది.

2003లో టెలికాం రంగంలో అడుగుపెట్టిన రిలయన్స్.. ఎంట్రీతోనే భారీ డిస్కౌంట్‌తో టారిఫ్ ప్లాన్ అందుబాటులోకి తెచ్చింది. అప్పట్లో మాన్‌సూన్ హంగామా పేరుతో నిమిషానికి రూ.2గా ఉన్న కాల్ రేటును 40పైసలకు తగ్గించింది. 2016లో జియో 4జీ ప్లాన్స్‌తో డేటా చార్జీలను భారీగా తగ్గించి కస్టమర్లకు మరింత చేరువైంది. ఇలాంటి ఆఫర్లు మార్కెట్‌లో పోటీని పెంచడంతో పాటు కస్టమర్లకు లాభం చేకూర్చనుంది. రిలయన్స్ రిటైల్ మార్కెట్‌లోకి అడుగుపెట్టాక ఇలాంటి పరిస్థితులే పునరావృతం అవుతాయని ఫారెస్టర్ సీనియర్ ఫోర్‌కాస్ట్ అనలిస్ట్ సతీష్ మీనా అభిప్రాయపడ్డారు.

ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ గ్రూప్ ప్రపంచంలోనే అతిపెద్ద ఆన్‌లైన్ టూ ఆఫ్ లైన్ కామర్స్ ప్లాట్‌ఫాంను అందుబాటులోకి తెచ్చే పనిలో బిజీగా ఉంది. 2019 ఏప్రిల్‌లో రిలయన్స్ తన ఎంప్లాయిస్ కోసం ఫుడ్ అండ్ గ్రోసరీ యాప్ అందుబాటులోకి తెచ్చింది. ఉద్యోగుల నుంచి వచ్చే ఫీడ్ బ్యాక్ ఆధారంగా ఈ ఏడాదిలోనే యాప్‌ను కమర్షియల్‌గా లాంఛ్ చేయాలని నిర్ణయించింది.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications