For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇన్ఫోసిస్‌లో పెరుగుతున్న కోటీశ్వరులు!: 30 నుంచి 64కు పెరిగిన రూ.1కోటి ఉద్యోగులు

|

బెంగళూరు: టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ పరేఖ్ గత ఆర్థిక సంవత్సరం (2018-19)లో రూ.24.67 కోట్ల వేతనం అందుకున్నారు. 2018-19 కంపెనీ వార్షిక నివేదిక ప్రకారం ఆయన వేతనం కింద రూ.6.07 కోట్లు, బోనస్‌, ప్రోత్సాహాకాలు, వేరియబుల్‌ పే రూపంలో రూ.10.96 కోట్లు, బత్తా కింద రూ.7.64 కోట్లు తీసుకున్నారు. ఇన్ఫోసిస్‌ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ (సీఓఓ) యూబీ ప్రవీణ్‌ రావు 2017-18లో రూ.8.22 కోట్లు అందుకోగా 2018-19లో రూ.9.05 కోట్లు అందుకున్నారు.

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) సీఈవో రాజేష్ గోపినాథన్ ప్యాకేజీ కింద రూ.16 కోట్లు తీసుకున్నారు. గోపినాథన్ కంపెన్షేషన్ 28 శాతం పెరిగింది. ఆయన శాలరీ రూ.1.26 కోట్లు, బత్తా కింద రూ.1.26 కోట్లు, కమిషన్ కింద రూ.13 కోట్లు, ఇతర అలవెన్సుల కింద రూ.60 లక్షలు తీసుకున్నారు.

ఇదిలా ఉండగా, ఇన్ఫోసిస్ కంపెనీలో రూ.1 కోటి అంతకు పైగా వేతనం తీసుకుంటున్న వారు ఈ ఆర్థిక సంవత్సరం (2019)లో రెండింతలు అయ్యారు. రూ.కోటి అంతకంటే ఎక్కువ వేతనం తీసుకుంటున్న ఇన్పోసిస్ ఉద్యోగులు ఈ ఏడాది 64 మంది ఉన్నారు. స్టాక్ ఆప్షన్ నేపథ్యంలో భారీ వేతనాలు పొందుతున్నవారిలో సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు కూడా ఉన్నారు.

కొత్త రేషన్ కార్డుకు ఎలా దరఖాస్తు చేసుకోవాలి?కొత్త రేషన్ కార్డుకు ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

Infosys employees drawing over Rs 1 crore salary more than doubled in FY19

2018లో 30 మంది ఇన్ఫోసిస్ ఉద్యోగులు రూ.1 కోటికి పైగా వేతనం తీసుకున్నారు. ఇప్పుడు రెండింతల కంటే ఎక్కువ పెరిగి ఆ సంఖ్య 64కు చేరుకుంది. కంపెనీ కార్పోరేట్ స్ట్రాటజీ అండ్ రిస్క్ హెడ్స్ దీపక్ పడాకి గత ఏడాది కంటే దాదాపు 75 శాతం కంపెన్షేషన్ తీసుకున్నారు.

2018లో ఆయన రూ.1.81 కోట్లు తీసుకుంటే, ఇప్పుడు రూ.3.16 కోట్లు తీసుకున్నారు. ఈవీపీ అండ్ గ్రూప్ హెడ్ ఆఫ్ గ్లోబల్ ఇమ్మిగ్రేషన్ కౌషిక్ ఆర్ఎన్ 41 శాతం ఎక్కువగా తీసుకున్నారు. గ్లోబల్ టాలెంట్ అండ్ టెక్నాలజీ హెడ్ బినోద్ హంపాపూర్ 30 శాతం తీసుకున్నారు.

English summary

ఇన్ఫోసిస్‌లో పెరుగుతున్న కోటీశ్వరులు!: 30 నుంచి 64కు పెరిగిన రూ.1కోటి ఉద్యోగులు | Infosys employees drawing over Rs 1 crore salary more than doubled in FY19

The number of Infosys employees earning an annual salary of Rs 1 crore and above more than doubled to 64 in FY19, with several senior executives getting massive jumps in compensation after they exercised stock option for the previous fiscal, the company said in its annual report.
Story first published: Tuesday, May 21, 2019, 13:58 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X