దేశ తర్వాతి ప్రధాని ఎవరు ? ఇప్పుడిదే దేశంలో హాట్ టాపిక్. ఎగ్జిట్ పోల్ అంచనాలు వచ్చినప్పటికీ ఎగ్జాక్ట్ పోల్స్ వచ్చేంత వరకూ జనాల్లో ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. 23వ తేదీ మధ్యాహ్నానికి ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది కాబట్టి ఈ రెండు రోజుల పాటు ఎవరి లెక్కలు, ఎవరి అంచనాలు, ఎవరి విశ్లేషణలు వారివి. అయితో ఈ లోపు అవకాశాలని కొల్లగొట్టడానికి, జనాన్ని కన్‌ఫ్యూజ్ చేయడానికి అటు టీవీ ఛానల్స్, మీడియా, సోషల్ మీడియాతో పోటు కొన్ని కంపెనీలు కూడా పోటీ పడ్తున్నాయి. ఆ కోవకే చెందింది జొమాటో. తర్వాతి పీఎం ఎవరు అనే థీమ్‌తో ఈ కంపెనీ పెట్టిన గేమ్‌లో తర్వాతి దేశ ప్రధాని ఎవరో చెబితే.. 30 శాతం డిస్కౌంట్‌ను ఆఫర్ చేస్తామంటోంది జొమాటో.

ఫన్ గేమ్
జెఈఎల్(ZEL) పేరుతో జొమాటో ఎలక్షన్ లీగ్ అని దీనికి నామకరణం చేశారు. ఇందులో మన దేశ తర్వాతి ప్రధాని ఎవరో కరెక్ట్‌గా ఊహించిన వారికి 30 శాతం క్యాష్ బ్యాక్‌ను ఆఫర్ చేస్తోంది. అంటే మీ అంచనా నిజమైతే.. ఆ తర్వాత మీరు ఆర్డర్ చేసే ఫుడ్‌లో 30 శాతాన్ని క్యాష్ బ్యాక్ రూపంలో మీరు పొందొచ్చు. ఈ నెల 22వ తేదీలోపు మీరు ఆర్డర్ చేసిన ఫుడ్‌తో పాటు ఈ గేమ్ ఆడొచ్చు. గెలిస్తే.. 23వ తేదీ తర్వాత ఎప్పుడైనా ఈ క్యాష్ బ్యాక్ ఆఫర్స్ వాడుకోవచ్చు. ఇది ఇప్పటికే కొన్ని రెస్టారెంట్లలో ఇస్తున్న 40 శాతం డిస్కౌంట్‌కు అదనంగా ఇస్తామని జొమాటో ప్రకటించింది.

జెపిఎల్ సక్సెస్
ఈ మధ్యకాలంలో ఐపీఎల్ జరిగినప్పుడు ప్రతీ రోజూ ఈ ప్రెడిక్షన్ గేమ్‌ను నిర్వహించింది జొమాటో. అప్పుడు తమ కస్టమర్ల నుంచి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చిందని కంపెనీ చెబ్తోంది. మొత్తం 224 నగరాల నుంచి 1.4 కోట్ల మంది ఈ ఆటలో పాల్గొన్నారు. డిస్కౌంట్ల రూపంలో సుమారు రూ.15 కోట్ల వరకూ ప్రయోజనం పొందారని బిజినెస్ ఇన్‌సైడర్ అనే సంస్థ వెల్లడించింది.

జొమాటో
ఇప్పుడు కూడా అలాంటి తరహా స్పందనే వస్తుందని జొమాటో కాన్ఫిడెంట్‌గా ఉంది. దీని వల్ల తమ బిజినెస్ పెరగడంతోపాటు కస్టమర్లకు కూడా మంచి క్యాష్ బ్యాక్స్ వస్తాయని చెబ్తోంది. ఈ యాప్‌లో నరేంద్ర మోడీ, రాహుల్ గాంధీతో పాటు మరొకరు అని ఆప్షన్ ఉన్నాయి. ఆర్డర్ ప్లేస్ చేసిన తర్వాత ఈ గేమ్‌లో పాల్గొని ఈ ముగ్గురిలో ఎవరు ప్రధాని అవుతారో ఊహించాలి. మీ సమాధానం కరెక్ట్ అయితే మీకు క్యాష్ బ్యాక్ వస్తుంది. దాన్ని తర్వాతి ఆర్డర్లకు వినియోగించుకోవచ్చు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications