For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బంగ్లాలకు బకాయిలు చెల్లించని కేంద్రమంత్రులు

|

న్యూఢిల్లీ: విజయ్ గోయల్, ప్రకాశ్ జవదేకర్, నిర్మలా సీతారామన్, సుష్మా స్వరాజ్ తదితర కేంద్రమంత్రులు తమ అధికారిక బంగ్లాలకు సంబంధించి ఫిబ్రవరి వరకు బకాయిలు చెల్లించలేదట. ఈ మేరకు హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ మినిస్ట్రీ వెల్లడించింది. ఆర్టీఐ చట్టం (సమాచార హక్కు) ద్వారా ఇది తెలిసింది.

యూనియన్ మైనార్టీ అఫైర్స్ మినిస్టర్ ముక్తార్ అబ్బాస్ నక్వీ, యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ నార్త్ ఈస్టర్న్ రీజియన్ జితేంద్ర సింగ్‌లు కూడా చెల్లించవలసి ఉంది. ముక్తార్ అబ్బాస్ నక్వీ రూ.1.46 లక్షలు, జితేంద్ర సింగ్ రూ.3.18 లక్షలు చెల్లించవలసి ఉంది.

several union ministers yet to clear dues on official bungalows

అజిత్ కుమార్ సింగ్ అనే వ్యక్తి ఆర్టీఐ చట్టం ద్వారా ఏప్రిల్ 26న ఈ వివరాలను అడిగాడు. దీనికి సంబంధిత శాఖ సమాధానం ఇచ్చింది. డిఫెన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ రూ.53,276, ప్రకాశ్ జవదేకర్ రూ.86,923, గోయెల్ రూ.3. లక్షలు, గజేంద్ర సింగ్ రూ.2,88,269, సుష్మా స్వరాజ్ రూ.98,890 బకాయిలు చెల్లించవలసి ఉంది.

మరో కేంద్రమంత్రి తవర్ చంద్ గెహ్లాట్ రూ.14,627 బకాయిలు చెల్లించవలసి ఉంది. ఆగస్ట్ 2014 నుంచి ఫిబ్రవరి 2019 వరకు తవర్ చంద్ గెహ్లాట్ రూ.1,37,842 గాను రూ.1,23,215 చెల్లించవలసి ఉంది. పలువురు ఇతర మంత్రులు చెల్లించారు.

రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, గిరిరాజ్ సింగ్, బబుల్ సుప్రియో, హర్షవర్ధన్, మనోజ్ సిన్హ, నరేంద్ర సింగ్ తోమర్, మహేష్ శర్మ, జయంత్ సిన్హా, రవి శంకర్ ప్రసాద్, ఉమా భారతి, స్మృతి ఇరాని తదితరులు చెల్లించారు.

Read more about: union minister
English summary

బంగ్లాలకు బకాయిలు చెల్లించని కేంద్రమంత్రులు | several union ministers yet to clear dues on official bungalows

Several Union ministers, including Vijay Goel, Prakash Javadekar, Nirmala Sitaraman and Sushma Swaraj, have not cleared dues on their official bungalows till February, the Housing and Urban Affairs Ministry said.
Story first published: Monday, May 20, 2019, 17:50 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X