ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే వైపు మొగ్గు చూపాయి. బీజేపీకి ఒంటరిగా 260 సీట్ల నుంచి 300 పై చిలుకు సీట్లు వస్తాయని, ఎన్డీయేకు 300 నుంచి 370 సీట్లు వస్తాయని ఎగ్జిట్ పోల్ సర్వేలు అంచనా వేశాయి. ఈ నేపథ్యంలో మార్కెట్లు దూసుకెళ్తున్నాయి. ఎన్డీయే స్పష్టమైన మెజార్టీ గెలుస్తుందనే అంచనాల నేపథ్యంలో సోమవారం అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు భారీగా లాభపడ్డాయి.
అదానీ ఎంటర్ప్రైజెస్ మధ్యాహ్నం 29 శాతం వద్ద ట్రేడ్ అయింది. గత రెండేళ్లలో ఇదే అత్యధికం. అదానీ పవర్, అదానీ గ్యాస్, అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ వంటి కంపెనీలు మధ్యాహ్నం 15 శాతం వద్ద ట్రేడ్ అయ్యాయి. అదానీ ట్రాన్స్మిషన్స్, అదానీ పోర్ట్స్ షేర్లు కూడా భారీగా లాభపడ్డాయి.

అదానీ గ్రీన్ ఎనర్జీ ఇంట్రాడేలో 17 శాతం పెరిగి రూ.144.30ల వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని నమోదు చేసింది. అదానీ ట్రాన్స్మిషన్స్: ఇంట్రాడేలో 10 శాతం పెరిగి రూ.226.50ల వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని నమోదు చేసింది. అదానీ పవర్ ఇంట్రాడేలో 16శాతం పెరిగి రూ.47.25ల వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని నమోదు చేసింది. అలాగే అదానీ గ్యాస్ 12 శాతం ఎగిసింది. అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ సాయంత్రానికి 28.96 శాతం లాభాలతో 153.85 వద్ద ముగిసింది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications