అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం.. భారత్‌కు లాభమా, నష్టమా?
అమెరికా-చైనా ప్రస్తుతం కొత్త తరహా యుద్ధం చేస్తున్నాయి. అదే వాణిజ్య యుద్ధం. చవక ధరలతో చైనా తమ దేశంలో ఉత్పత్తులను డంప్ చేసి దేశఈ కంపెనీలను దెబ్బతీస్తోందని, తద్వారా అమెరికాలో నిరుద్యోగం పెరిగిపోతోందని అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భావిస్తున్నారు. అందుకే డ్రాగన్ దేశానికి కళ్లెం వేసేందుకు దాదాపు 200 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులపై పన్ను రేటును 10 శాతం నుంచి 25 శాతానికి పెంచేశారు. దీంతో చైనా నుంచి అమెరికాకు దిగుమతి అయ్యే వస్తువులు.. బొమ్మలు, షూస్ (బూట్లు), ఎలక్ట్రానిక్ వస్తువులు ప్రియం కానున్నాయి.
ఇందుకు చైనా కూడా అమెరికా దిగుమతులపై సుంకాలను పెంచేసింది. వీటి విలువ 60 బిలియన్ డాలర్ల మేరకు ఉంది. రెండు ప్రపంచ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల వాణిజ్య పోరు మొత్తం ప్రపంచాన్ని వణికిస్తోంది. అయితే ఇందులో భారత్‌కు ఉన్న అవకాశాలు, ఇబ్బందులు విశ్లేషించాల్సిన తరుణమిదే.
సహజంగానే భారత్ ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటి. 130 కోట్ల భారతీయులే అతిపెద్ద మార్కెట్. అమెరికాలో ఎదురయ్యే ఇబ్బందుల నుంచి ఉపశమనం కోసం చైనా తమ ఉత్పత్తులతో భారత్‌ను ముంచెత్తనుంది.

ఈ పరిణామంతో భారత్‌కు ఎలక్ట్రానిక్స్, బొమ్మలు, ఫుట్‌వేర్ తదితర ఉత్పత్తులు భారీగా దిగుమతి అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ పరిణామం దేశీయంగా మన కంపెనీలు, ఉద్యోగాలపై ప్రభావం చూపనుందని ఆర్థికవేత్తలు విశ్లేషిస్తున్నారు. అదే సమయంలో భారత్ నుంచి చైనాకు పెట్రోలియం ఉత్పత్తులు, సోయాబిన్, పత్తి, అల్కాహాల్ ఉత్పత్తులు, ముడి ఇనుము తదితర ఉత్పత్తుల ఎగుమతులు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి.
అయితే ఇప్పటికే చైనా నుంచి దుగుమతులు 70-80 బిలియన్ డాలర్లుగా ఉంటే, భారత్ నుంచి చైనాకు కేవలం 30 బిలియన్ డాలర్ల ఎగుమతులే ఉన్నాయి. తద్వారా సుమార్ 50 బిలియన్ డాలర్ల మేరకు వాణిజ్య లోటు ఉంటోంది. ఇది మన ఆర్థికవ్యవస్థకు అంత మంచి పరిణామం కాదు. కాబట్టి అమెరికా - చైనా వాణిజ్య యుద్ధం భారత్‌పై అనుకూలం కన్నా ప్రతికూలమే అధికమని ఆర్థికవేత్తల అంచనా.


Click it and Unblock the Notifications