అమెరికా - చైనా ట్రేడ్ వార్ నేపథ్యంలో డ్రాగన్ కంట్రీ దిగ్గజ సంస్థ హువావేకు డొనాల్డ్ ట్రంప్ షాకిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హువావే టెక్నాలజీస్ ఫౌండర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ రెన్ జెంగ్‌ఫెయ్ శనివారం మీడియాతో మాట్లాడారు. అమెరికా తమపై ఆంక్షలు విధించినంత మాత్రాన వచ్చే నష్టమేమీ లేదని, తమ కంపెనీ ఎదుగుదలను అవి అడ్డుకోలేవని, కానీ కంపెనీ వృద్ధి రేటు మాత్రం కొంత తగ్గవచ్చునన్నారు.
మే 15వ తేదీన హువావేపై అమెరికా ఆంక్షలు విధించిన అనంతరం ఆయన తొలిసారి మాట్లాడారు. తమ వృద్ధి రేటులో ఇరవై శాతం తగ్గుదల ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. తాము అమెరికా చట్టాలను ఎక్కడా అతిక్రమించలేదని చెప్పారు. అమెరికా చెప్పిన విధంగా మేనేజ్‌మెంట్‌లో మార్పులు చేసే అవకాశం కానీ, అక్కడి ప్రభుత్వ పర్యవేక్షణకు అనుమతించే అవకాశం కానీ లేదని స్పష్టం చేశారు. తాము అమెరికా నుంచి చిప్స్ కొనుగోలు చేయకపోయినా వచ్చే నష్టం లేదన్నారు. ఇలాంటి పరిస్థితికి తాము ఇప్పటికే సిద్ధమయ్యామన్నారు. అక్కడే మ్యానుఫ్యాక్చర్ చేయాలని అమెరికా చెబితే తాము వెళ్లేది లేదని చెప్పింది.

కాగా, టెలికం దిగ్గజం జెడ్‌టీఈ కూడా ఇదే వైఖరిని అనుసరిస్తోంది. హువావే, జెడ్‌టీఈ కంపెనీలు అమెరికాలో టెలికామ్ పరికరాలు విక్రయించకుండా అమెరికా వాణిజ్య విభాగం ఆంక్షలు విధించింది. దీంతో అమెరికా కంపెనీలతో వ్యాపారం చేసే అవకాశాన్ని ఈ రెండు కంపెనీలు కోల్పోయాయి. హువావే, దాని అనుబంధ సంస్థలు తమ జాతీయ భద్రతకు ముప్పుగా పరిగణించాయని అమెరికా పేర్కొంది.
More From GoodReturns

Oil prices: జపాన్ రహస్య ఆయిల్ నిధి! ఆరు నెలలకు సరిపడా చమురుని జపాన్ ఎలా దాచిపెట్టింది?

యుద్దం ఆపడం మా చేతుల్లో ఉంది.. నీ చేతుల్లో కాదు.. ట్రంప్ వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ విసిరిన ఇరాన్..

ఇరాన్ యుద్దం ముగుస్తుందనే అంచనాలు.. తగ్గిన ముడి చమురు ధరలు.. ట్రంప్ ఏమన్నారంటే..

అమెరికాలో ఛాయ్ వాలాగా మారిన భారత ఐటీ ఉద్యోగి.. రోజూ వారి సంపాదన చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

ముంచుకొస్తున్న 1970 చమురు సంక్షోభం.. ధరల పెరుగుదలతో పలు దేశాలు విలవిల..

Russian oil: ట్రంప్ క్లెయిమ్ VS రియాలిటీ.. రష్యా ఆయిల్ కొనుగోలుపై క్లారిటీ ఇచ్చిన న్యూఢిల్లీ!

భారత్ టైర్ పరిశ్రమను కుదిసేస్తున్న ఇరాన్ యుధ్ద ప్రభావం.. కీలకమైన హెచ్చరిక చేసిన CLSA

Iran war: ఇరాన్లో హై అలర్ట్: ఖమేనీ అంత్యక్రియలు వాయిదా.. ఏం జరుగుతోంది?

Iran war: ఇరాన్ సంచలన నిర్ణయం.. అణు బాంబు తయారీ ఆపేస్తాం! కానీ ఆ ఒక్క కండిషన్!

ఇరాన్ మీద దాడులు.. బట్ట బయలైన అమెరికా కుట్రలు.. ప్రపంచానికి నిజాన్ని తెలిపిన స్పెయిన్..

ఇరాన్–అమెరికా యుద్ధంపై షాకింగ్ న్యూస్.. ఎవరి ఆయుధాలు ముందుగా అయిపోతాయో తెలుసా..



Click it and Unblock the Notifications