TV9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌పై సైబరాబాద్ పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఫోర్జరీ కేసులో రవిప్రకాశ్‌తో పాటు సినీ నటుడు శివాజీపై కేసులు నమోదైన విషయం తెలిసిందే. పోలీసులు విచారణకు హాజరు కావాలని పలుమార్లు చెప్పిన వారు రాలేదు. దీంతో ఇప్పుడు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. రవిప్రకాశ్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. తాము మూడు నోటీసులు జారీ చేసినా విచారణకు హాజరు కాకపోవడం, పైగా, విచారణను తప్పించుకునేందుకు కోర్టును ఆశ్రయించడంపై పోలీసులు సీరియస్‌గా ఉన్నారు.

రవిప్రకాశ్ ఎక్కడున్నాడు?
రవిప్రకాశ్‌కు రెండుసార్లు 160 సీఆర్పీసీ కింద, ఓసారి 41ఏ సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేశారు. తనకు పది రోజుల గడువు కావాలని రవిప్రకాశ్‌తో పాటు శివాజీ కోరాడు. దీంతో పోలీసులు ఈ చర్యలు తీసుకున్నారు. రవిప్రకాశ్‌ను అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. 41ఏ సీఆర్పీసీ నోటీసుకు స్పందించకుంటే ఏ క్షణమైనా అరెస్టు చేసే వీలు ఉంది. శుక్రవారం రాత్రే రవిప్రకాశ్‌తో పాటు శివాజీపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. రవిప్రకాశ్ ఏపీలో తలదాచుకున్నారా.. మరెక్కడైనా ఉన్నారా అనే చర్చ సాగుతోంది.

రవిప్రకాశ్‌పై మరో కేసు
ఫోర్జరీ కేసులో రవిప్రకాశ్‌పై ఇప్పటికే రెండు కేసులు నమోదయ్యాయి. తాజాగా, TV9 ట్రేడ్ మార్కును అమ్మినందుకు మరో కేసు నమోదయింది. ఎంకేవీఎన్ మూర్తి వాంగ్మూలంతో పలు ఆధారాలు సేకరించారు. అలాగే, ఈ-మెయిల్స్ సంభాషణలను పోలీసులు రాబట్టారు. కీలక ఆధారాలు లభించాయని, దీంతో అతని అరెస్టుకు రంగం సిద్ధమవుతోందనే ప్రచారం సాగుతోంది. అతని కోసం మూడు బృందాలు గాలిస్తున్నాయని తెలుస్తోంది. TV9 ట్రేడ్ మార్కును మీడియా నెక్స్ట్ సంస్థకు రూ.99వేలకు విక్రయించారని తెలుస్తోంది. ఇందులో హరికిరణ్ అనే వ్యక్తి కీలకంగా వ్యవహరించాడని అనుమానిస్తున్నారు. సీసీఎస్ పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నారని తెలుస్తోంది.

దేశం నుంచి జారుకున్నాడా?
రవిప్రకాశ్‌పై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేసినప్పటికీ, అతను ఇప్పటికే దేశం వదిలి పారిపోయారా అనే చర్చ సాగుతోంది. ఈ మేరకు మీడియాలో వార్తలు వచ్చాయి. రవిప్రకాశ్ ఆస్ట్రేలియాలో తలదాచుకున్నట్లుగా కనిపిస్తోందని ప్రచారం సాగుతోంది. ఇదిలా ఉండగా, పోలీసులు శనివారం రవిప్రకాశ్ పైన నమోదైన కేసులో ఆయన అడ్వోకేట్ కనకరాజ్ ఇంట్లో సైబరాబాద్ పోలీసులు సోదాలు చేసారు. రవిప్రకాశ్‌తో ఇతర భాగస్వాములకు ఏర్పడిన వివాదం నేపథ్యంలో ఈ తప్పుడు పత్రాలను ఎవరు సృష్టించారో తేల్చే పనిలో పోలీసులు ఉన్నారు.


Click it and Unblock the Notifications