మళ్లీ క్యాంపా కోలా వస్తోందోచ్.. !

క్యాంపా కోలా.. ఒకప్పుడు సూపర్ ఫేవరెట్ డ్రింక్. 1970-90ల మధ్యకాలంలో సాఫ్ట్ డ్రింక్ మార్కెట్‌ను ఓ ఊపు ఊపేసిన ఈ డ్రింక్ ఎప్పుడో కనుమరుగైంది. చాలా దీని ఫ్యాన్స్ మాత్రం ఇప్పటికీ చాలా మందే ఉన్నారు. అలాంటి క్యాంపా మళ్లీ దేశవ్యాప్తంగా అందుబాటులోకి రాబోతోంది. కోలాకు, ెప్సీకు మళ్లీ పోటీ ఇవ్వబోతోందంటూ ఓ ప్రధాన దినప్రతిక చెబ్తోంది. ఇందుకోసం క్యాంపాను తయారు చేస్తున్న ప్యూర్ డ్రింక్స్ గ్రూప్ ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు వెల్లడించింది.

1949లో మొదలు

1949లో మొదలు

అప్పట్లో ప్యూర్ డ్రింక్స్ అనే సంస్థ దేశంలో మొదటిసారిగా సోడాతో కూడిన పానీయాల తయారీని మొదలుపెట్టింది. అదే సమయంలో కోకా కోలాకు మ్యానుఫ్యాక్చరింగ్, డిస్ట్రిబ్యూటర్‌కు ఉండేద��. అయితే ఫారిన్ ఎక్స్ఛేంజ్ రెగ్యులేషన్ యాక్ట్ (విదేశీ మారకద్రవ్య నియంత్రణ చట్టం1973)తో విబేధాల నేపధ్యంలో 1977లో కోకా కోలా దేశం నుంచి బయటకు వెళ్లిపోయింది. ఆ తర్వాత మళ్లీ ఇండియాలోకి అడుగు పెట్టింది.

ఇదే సమయంలో మార్కెట్లో ఉన్న కొరత తీర్చేందుకు క్యాంపా రంగంలోకి దిగింది. క్యాంపా.. ది గ్రేట్ ఇండియన్ టేస్ట్ పేరుతో లాంఛ్ చేసింది. ఎటువంటి పోటీదారు లేకపోవడంతో క్యాంప్ సూపర్ సక్సెస్ అయింది. అప్పట్లో ప్యూర్ డ్రింక్స్ గ్రూప్ సర్దార్ మోహన్ సింగ్.. నేతృత్వంలో క్యాంపా కోలా జనాలకు మరింత దగ్గర చేశారు. ఇప్పుడు మోహన్ సింగ్.. మునిమనుమడైన జయవంత్‌జిత్ సింగ్ క్యాంపాను మళ్లీ రివైవ్ చేసి దేశవ్యాప్తంగా విడుదల చేయాలని చూస్తున్నారు.

వివిధ రాష్ట్రాల్లో రెడీ

వివిధ రాష్ట్రాల్లో రెడీ

క్యాంపా కోలా ఇప్పుడు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో అందుబాటులోకి వస్తోంది. జమ్మూకా��్మీర్, హర్యానా, పంజాబ్, రాజస్తాన్, ఢిల్లీ, ఉత్తరాంచల్, హిమాచల్ ప్రదేశ్, బీహార్ ప్రాంతాల్లో 13 ఫ్రాంచైజీలు ఉన్నాయి. త్వరలో దక్షిణాది ప్రాంతాలతో పాటు దేశవ్యాప్తంగా కూడా విస్తరించాలని చూస్తున్నారు. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలకు కూడా క్యాంపాను మళ్లీ పరిచయం చేయాలని ప్యూర్ డ్రింక్స్ గ్రూప్ చూస్తోంది. దాద్రా, నగర్ హవేలీలోని సిల్వాస్సాలో బాట్లింగ్ ప్లాంట్‌ను సంస్థ ఏర్పాటు చేస్తోంది. నిమిషానికి 600 బాటిల్స్ తయారు చేసే సామర్ధ్యాన్ని ప్లాంట్ కలిగి ఉంది. ఇది పశ్చిమ రాష్ట్రాల్లోని మార్కెట్లకు పూర్తిస్థాయిలో ప్రోడక్టును సరఫరా చేస్తుంది. త్వరలో దక్షిణాదిలోని చెన్నైలో తమ పరిధిని విస్తరించాలని సంస్థ చూస్తోంది. ఇప్పుడు దేశవ్యాప్తంగా 40 లక్షల బాటిళ్లను సరఫరా చేస్తున్నట్టు జయవంత్‌జిత్ సింగ్ వెల్లడించారు.

ఇక పోటాపోటీ

ఇక పోటాపోటీ

గతంలో కోకాకోలా మార్కెట్‌ నుంచి బయటకు వెళ్లినప్పుడు పార్లే పుంజుకుంది. 1970-80 ప్రాంతాల్లో థంప్స్‌అప్, గోల్డ్ స్పాట్, లిమ్కా వంటి వాటితో మార్కెట్‌ను కుదిపేసింది. అయితే మళ్లీ 1990లో కోక్ ఇండియాలోకి తిరిగి ప్రవేశించిన తర్వాత పార్లేను కొనుగోలు చేసింది. ఆ తర్వాత కోలా పేరుతో వచ్చిన చాలా బ్రాండ్స్ కనుమరుగైపోయాయి. పీవీ నర్సింహారావు సంస్కరణల ఫలంగా ఫారిన్ బ్రాండ్స్ ఇండియాలోకి అడుగు పెట్టాయి. దీంతో ఆ పోటీని తట్టుకోలేక క్యాంపా కోలా దాదాపుగా కనుమరుగైంది. అక్కడక్కడా హర్యానా, గుజరాత్ ప్రాంతాల్లో కనిపించేది. కానీ ఈ మధ్య వేగం పెంచింది క్యాంపా.

ఇప్పుడు క్యాంపా కోలా.. దేశవ్యాప్తంగా విస్తరించాలని చూడడం, ప్రధానంగా దక్షిణాదిపై ఆసక్తిని చూపడంతో... పోటీమరింత పెరగబోతోందని నిపుణులు అంచనా వేస్తున్నారు. క్యాంపాకోలా 200 ఎంఎల్ బాటిల్ రూ.10కి దొరుకుతోంది. కోలా, ఆరెంజ్, లైమ్ టేస్టులను కంపెనీ ఆఫర్ చేస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+