జెట్ ఎయిర్‌వేస్ విమాన రంగంలో ఒక వెలుగు వెలిగిన సంస్థ. ఇప్పుడు ఆ సంస్థ కార్యకలాపాలు నిలిచి నెల రోజులు పూర్తయింది. రెండో అతి పెద్ద విమానయాన సంస్థగా దాదాపు 25 సంవత్సరాలు సేవలు అందించిన ఈ సంస్థ తిరిగి తమ కార్యకలాపాలు ప్రారంభించేందుకు అనేక ప్రయత్నాలు సాగుతున్నాయి, ఆర్దికంగా అనేక సంక్షోభాలు ఎదుర్కొంఉన్న ఈ సంస్థ తమను ఆదుకొనే పెట్టబడిదారుల కోసం అన్వేషిస్తోంది. తిరిగి ఆకాశంలో తమ విమానాలు ఎలాగైనా ఎగరాలనే లక్ష్యంతో ఆలోచనలు చేస్తోంది.
జెట్ సంస్థ బ్యాంకర్ల బృందానికి చెల్లించాల్సిన బకాయిలు 8వేల కోట్ల పై మాటే. బకాయిలు వసూలు కాకపోవడంతో, సంస్థలో 51 శాతం వాటా తీసుకున్న బ్యాంకర్లు, పునరుద్ధరణకు అవసరమైన పెట్టుబడిదారు కోసం బిడ్డింగ్ ప్రక్రియ నిర్వహించారు. జెట్‌లో 75 శాతం వరకు వాటా విక్రయానికి ఉంచగా, ప్రాథమిక బిడ్లు 4 మాత్రమే దాఖలయ్యాయి. ఈనెల 10తో ముగిసిన గడువులోపు ఎతిహాద్ ఎయిర్‌వేస్‌తో పాటు మరో 2 కొత్త సంస్థలు ఫైనాన్షియల్ బిడ్లు దాఖలు చేశాయి.ఇవేమీ ఆశాజనకంగా లేకపోవడంతో మళ్లీ కొత్తగా బిడ్లు ఆహ్వానించాల్సి రావచ్చని భావిస్తున్నారు. అద్దె చెల్లించనందున విమానాలను లీజుదార్లు తీసుకెళ్లిపోతుండటం, జీతాలు అందక పైలట్లు, ఇతర సాంకేతిక సిబ్బంది ఇతర సంస్థల్లో చేరిపోతుండటం, జెట్‌కు విమానాశ్రయాల్లో ఉన్న సమయాలు కూడా పోటీ సంస్థలకు బదిలీ కావడం.. పరిశీలిస్తే జెట్ పునరుద్ధరణ కష్టమనే విషయం స్పష్టమవుతోంది. సంస్థ విలువ హరించుకుపోతుండటంతో పెట్టుబడి దారులు రారనే ఆందోళన రోజురోజుకీ పెరుగతోంది.

ఇస్తామన్న రుణం ఇవ్వకపోవటంతో..
కార్యకలాపాల కోసం రూ.1500 కోట్లు సత్వరం సమకూర్చాలని బ్యాంకులను అప్పట్లో జెట్ కోరింది. తొలుత ఇందుకు సుముఖత చూపినా, తరవాత ఇవ్వలేదు. దీనికి ముందూ వెనుకా అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. జెట్ ఎయిర్‌వేస్ డిసెంబర్ 31 నుంచి చెల్లింపులు జరపలేకపోయింది. సంస్థ పునరుద్ధరణ ప్రక్రియకు బ్యాంకులు శ్రీకారం చుట్టాయి. ఇందులో భాగంగానే సంస్థ ఛైర్మన్ పదవి నుంచి వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్ తప్పుకోవడంతో పాటు బ్యాంకులకు మెజారిటీ వాటా లభించింది. గతంలో విజయ్‌మాల్యా నేతృత్వంలోని కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ ఆర్థిక కష్టాల్లో చిక్కుకున్నపుడు, ఐడీబీఐ బ్యాంక్ మరిన్ని రుణాలు అందించింది. దీనిపై ఆ బ్యాంక్ ఉన్నతాధికారులు ఇప్పుడు కేసులు ఎదుర్కోవాల్సి వస్తోంది. ప్రమోటర్ నరేశ్ గోయల్ కొత్త పెట్టుబడి తీసుకురాలేకపోవడం, 24 శాతం వాటా కలిగిన ఎతిహాద్ ఎయిర్‌వేస్ కూడా నిధులు అందించేందుకు సుముఖత చూపక పోవటంతో బ్యాంకులు వెనుకడుగు వేసాయి. తాము రూ.1500 కోట్లు ఇచ్చినా, కొంతకాలం మాత్రమే సరిపోతాయని, సంస్థ మనుగడ సాధించలేదని భావించడం, కేసుల భయం వల్లే, బ్యాంకర్లు నిధులు విడుదల చేయలేదు.

తగ్గి పోతున్న ఆకర్షణ
సంస్థ విలువ హరించుకుపోతున్న కొద్దీ, సామర్థ్యం కలిగిన పెట్టుబడిదార్లకు ఆకర్షణ మరింత తగ్గిపోతుంది.
ప్రాథమిక బిడ్లు దాఖలు చేసిన 4 సంస్థల్లో జెట్‌లో 24 శాతం వాటా కలిగిన ఎతిహాద్ ఎయిర్‌వేస్ మాత్రమే షరతులతో ఆర్థిక బిడ్ దాఖలు చేసింది. మరికొంత అదనపు పెట్టుబడి పెడతామని, అయితే మెజారిటీ వాటాదారుగా మరొకరు రావాల్సిందేనన్నది ఆ సంస్థ షరతు. ఈ పరిస్థితుల్లో విలువ తగ్గిపోతుందనే ఆందోళన వ్యక్తం అవుతోంది.

స్లాట్ల అంశం కూడా వ్యతిరేకంగానే
రద్దీగా ఉండే ముంబయి, దిల్లీ మార్గాల్లో నడుపుతున్నామా, ఆయా విమానాశ్రయాల్లో కీలక సమయాలు (స్లాట్లు) లభిస్తాయా అనేదే దేశీయ విమానయాన సంస్థలకు ముఖ్యం. ఎందుకంటే అధికార్జనకు అవే వీలు కల్పిస్తాయి కాబట్టి. జెట్ విమానాలు నిలిచిపోయాక, ఆ సంస్థ స్లాట్లు 440 పోటీ సంస్థలకు కేటాయించేశారు. ఆయా సంస్థలు ముందస్తుగా టికెట్లు విక్రయించేస్తే, జెట్ పునఃప్రారంభమైనా, స్లాట్లు వాపసు తీసుకోవడం కష్టమే అవుతుంది. ఇప్పటికే ఇండిగో సెప్టెంబరు వరకు టికెట్లు ఆఫర్‌పై విక్రయించేసింది కూడా.

సొంతం 13..లీజు ఎక్కువ
జెట్ వద్ద సొంత విమానాలు 13 ఉన్నాయి. మిగిలినవనీ లీజువే. జెట్ విషయంలో దివాలా స్మృతిని ఆశ్రయిస్తే, కార్యకలాపాలు కొనసాగించేందుకు కొంత సమయం జెట్ నిర్వాహకులకు లభిస్తుంది. నిధులు సమకూర్చుకునేందు కు, విచారణ బెడద కూడా ఉండదు. అప్పుడు మళ్లీ కొత్త పెట్టుబడిదారు రావచ్చు. అయితే ప్రయాణానికి ముందస్తుగా టికెట్లు బుక్ చేసుకున్న వారికి నిధులు వాపసు ఇవ్వాల్సి ఉంది. దివాలా స్మృతికి చేరిన కొన్ని సంస్థల విషయంలోనూ 270 రోజులు గడిచినా, ఎటూ తేలడం లేదు.

సగానికి తగ్గుతున్న మార్కెట్
షేరు విలువకు అనుగుణంగా జెట్ మార్కెట్ విలువ గత నెల మధ్య నుంచే ఇప్పుడు సగానికి తగ్గింది. కార్యకలాపాలు నిలిచిపోక ముందు రోజు రూ.242 వద్ద ముగియగా, ఇప్పుడు 52 వారాల కనిష్ఠస్థాయి అయిన రూ.120 సమీపానికి చేరింది.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications