ఆaన్ లైన్ గ్రాసరీ స్టోర్ బిగ్‌బాస్కెట్ ఎవరూ ఊహించనంత రేంజ్‌లో దూసుకుపోతోంది. ఆఫ్ లైన్ స్టోర్స్ అయిన డిమార్ట్, రిలయన్స్ రిటైల్, విమార్ట్, వి2 రిటైల్.. వంటివన్నీ వేగంగా విస్తరిస్తున్నా బిగ్ బాస్కెట్ బలమైన పోటీనిస్తోంది. ఈ ఏడాది ఏకంగా రూ.6300 కోట్ల టర్నోవర్ సాధించాలని ఈ సంస్థ లక్ష్యంగా నిర్దేశించుకుంది.
ఇతర రాష్ట్రాల్లో కూడా..
బిగ్ బాస్కెట్‌కు బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ బ్రాండ్ ఎంబాసిడరింగ్ చేస్తున్నప్పటి నుంచి ఇది మరింతగా చొచ్చుకుపోతోంది. బ్రాండ్ రికగ్నిషన్ కూడా పెరిగింది. దీంతో బిగ్ బాస్కెట్ ఆపరేషన్స్‌ను కోచిలో కూడా ప్రారంభిస్తున్నారు. దీంతో ఇప్పుడు దేశంలోని 26 నగరాల్లో బిగ్ బాస్కెట్ సేవలు అందుబాటులోకి వచ్చాయి.
బిలియన్ డాలర్ టార్గెట్
బిగ్ బాస్కెట్ సీఈఓ హరి మెనన్ చెబ్తున్న లెక్కల ప్రకారం ఈ-కామర్స్ గ్రాసరీ బిజినెస్ విలువ సుమారు 1.2 బిలియన్ డాలర్లు. అంటే సుమారు రూ.8400 కోట్లు. ఇందులో బిగ్ బాస్కెట్ వాటా రూ.4 వేల కోట్లకుపైమాటే ఉంటుందని చెబ్తున్నారు. 2020 నాటికి ఆన్ లైన్ గ్రాసరీ బిజినెస్ మార్కెట్ 2.5 బిలియన్ డాలర్లు (అంటే రూ.17500కోట్లు)కు విస్తరిస్తుందని, అందులో కనీసం ఒక్క బిలియన్ డాలర్లు (అంటే రూ.7000) కోట్ల మార్కెట్‌ను బిగ్ బాస్కెట్ కైవసం చేసుకుంటుందని హరి మెనన్ ధీమాగా వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పుడు పాల వ్యాపారంలోకి..
ఇంతకాలం నుంచి కిరాణా సరుకుల వ్యాపారంలో మాత్రమే కొనసాగిన బిగ్ బాస్కెట్ ఇప్పుడు పాల సరఫరా, బ్యూటీ ప్రోడక్ట్స్ రంగంలోకి కూడా దిగింది. అంతే కాకుండా అపార్ట్‌మెంట్ కాంప్లెక్సుల్లో వెండింగ్ మెషీన్లను కూడా ఏర్పాటు చేస్తోంది. మనషులు ఎవ్వరూ అవసరం లేని ఈ వెండింగ్ మెషీన్లకు డబ్బులు చెల్లించి మనకు కావాల్సిన వస్తువులను తీసుకునే వెసులుబాటు ఉంటుంది. ఇప్పటికే 200 మెషీన్లను వివిధ అపార్ట్‌మెంట్లలో ఏర్పాటు చేశారు. వీటిని 6000కు పెంచబోతున్నట్టు బిగ్ బాస్కెట్ యాజమాన్యం చెబ్తోంది. ఈ మధ్యే ఆర్గానిక్ ఉత్పత్తుల కోసం కొన్ని సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది. కొంత మంది ఇన్వెస్టర్లు ఆర్గానిక్ వ్యాపారం కోసం అదనంగా పెట్టుబడులు కూడా పెట్టారు.
8000 మంది రైతులతో డీల్
ఇప్పటికే 3వేల బ్రాండ్లకు చెందిన 22 వేల ప్రోడక్టులను సరఫరా చేస్తోంది బిగ్ బాస్కెట్. అయితే ఆదాయాన్ని పెంచుకునేందుకు పెద్ద కంపెనీలు కాకుండా ప్రైవేట్ లేబుల్స్‌పై సంస్థ ఎక్కువగా దృష్టి పెట్టింది. ఇప్పుడున్న 34 శాతం ప్రైవేట్ లేబుల్స్ ఆదాయాన్ని 40 శాతానికి పెంచుకోవాలని చూస్తోంది. ఇప్పుడు 37 కలెక్షన్ సెంటర్ల ద్వారా 8000 మంది రైతుల నుంచి సరుకులు కొంటోంది బిగ్ బాస్కెట్.
రూ.1050 కోట్ల పెట్టుబడులు
ఏప్రిల్ 2019లో మిర్రే అసెట్‌కు చెందిన నేవర్ ఏషియా గ్రోత్ ఫండ్, సిడిసి గ్రూప్, అలీబాబా గ్రూప్ సంస్థలు 150 మిలియన్ డాలర్లు (సుమారు రూ.1050 కోట్లు) బిగ్ బాస్కెట్‌లో పెట్టుబడులు పెట్టాయి. తాజా ఫండింగ్ నేపధ్యంలో బిలియన్ డాలర్ల వేల్యుయేషన్ మార్కులోకి వెళ్లింది బిగ్ బాస్కెట్.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్‌లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!



Click it and Unblock the Notifications