బ్యాచ్‌లర్ గృహాలకు యమా డిమాండ్!

హైదరాబాద్: బ్యాచిలర్స్‌కు అద్దె ఇల్లు దొరకడం ఎంత కష్టమో దాదాపు అందరికీ తెలిసిందే. ఎవరైనా ఒక్కసారైనా ఈ ఇబ్బందిపడే ఉంటారు. అయితే దీనిని వ్యాపార అవకాశంగా మలుచుకొని కొన్ని స్టార్టప్ కంపెనీలు ప్రత్యేకంగా బ్యాచిలర్ హోమ్ లేదా స్టూడెంట్ హోమ్స్ బ్రాండ్‌తో ప్రత్యేక గృహాలను నిర్మిస్తున్నాయి.

హైదరాబాద్ సహా నగరాల్లో ప్రాజెక్టులు

హైదరాబాద్ సహా నగరాల్లో ప్రాజెక్టులు

ఈ ట్రెండ్ ఇప్పటికే ఢిల్లీ, ముంబై, పుణే, బెంగళూరు నగరాల్లో పుంజుకోగా, హైదరాబాదులోను పలు చిన్న, మధ్యతరహా ప్రాజెక్టులు ప్రారంభం కాబోతున్నాయి. హోటల్ గదులను ఆన్‌లైన్ బుక్ చేసుకునే అవకాశం కల్పించే 'ఓయో' రూమ్స్ సైతం ఈ ప్రత్యేక గృహాలను అందిస్తోంది. ఇప్పటికే ఈ సంస్థ 2,000 ఇలాంటి గృహాలను అందిస్తోంది. ఏడాదిలోగా ఈ సంఖ్యను 50,000కు పెంచాలని యోచిస్తోంది. హైదరాబాదులో సైతం ఇప్పటికే PG (పేయింగ్ గెస్ట్స్) అకామిడేషన్‌కు డిమాండ్ ఊపందుకుంది. హైటెక్ సిటీ, గచ్చిబౌలి, కొండాపూర్, మణికొండ జూబ్లిహిల్స్, బంజారాహిల్స్, అమిర్‌పేట, కూకట్‌పల్లి తదితర ప్రాంతాల్లో PGలకు యమ క్రేజ్ ఉంది.

ధరలు అందుబాటులో

ధరలు అందుబాటులో

బ్యాచిలర్ లేదా స్టూడెంట్ గృహాలు కదాఏదోలాఉంటాయ్ అనుకుంటే పొరపాటే. సకల సౌకర్యాలతో, వైఫై, లాండ్రీ, డెయిలీ మెయింటెనెన్స్‌తో ఇవి ఉండనున్నాయి. సిటీని బట్టి ధరలు కాస్త అటు ఇటుగా ఉన్నప్పటికీ, సగటున అద్దె రూ.7,000 వరకు ఉంటున్నాయి. బెంగళూరులో అధికంగా రూ.10,000తో ప్రారంభమై రూ.35,000 వరకు ధర ఉంటుంది. హైదరాబాదులో సగటున ధర రూ.5,000 ఉండే అవకాశముందని రియల్ ఎస్టేట్ రంగ విశ్లేషకులు పేర్కొంటున్నారు.

బ్యాచిలర్లకు ఊరట

బ్యాచిలర్లకు ఊరట

ఇరుకు రూములు, రూఫ్ టాప్ పైన సర్దుకుపోయే బ్యాచిలర్లు, విద్యార్థులకు... ఇలాంటి కొత్త తరహా గృహాలు ఊరటనిస్తాయనడంలో సందేహం లేదు. ఆన్‌లైన్ ప్రకటనల సంస్థ OLX ఇటీవల నిర్వహించిన సర్వేలోనూ ఇలాంటి గృహాలకు విపరీతమైన డిమాండ్ ఉంటుందని, దేశంలో దాదాపు 2 కోట్ల మంది విద్యార్థులు పై చదువులు, ఉద్యోగాల కోసం వివిధ నగరాల్లో ఉంటున్నారని, అందుకే వీరి అవసరాలను తీర్చే కొత్త తరహా ఆలోచనకు వ్యాపార సానుకూలతలు ఉన్నాయని పేర్కొంది. సో.. బ్యాచిలర్స్.. బీ హ్యాపీ...

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+