గృహ కొనుగోలుదారులకు ఊరటనిచ్చే నిర్ణయాన్ని వెలువరించింది అపెక్స్ వినియోగదారుల కమిషన్. ఇంటిని కొనుగోలు చేసి ఆ ఫ్లాట్ లను స్వాధీనం చేసుకోవడం కోసం సంవత్సరాల తరబడి నిరీక్షిస్తున్న గృహ కొనుగోలుదారులకు లక్షలాది మందికి స్వాంతన కలిగించే నిర్ణయం తీసుకుంది. ఎవరైతే గృహ అమ్మకందారు కొనుగోలుదారులకు గృహం స్వాధీనం చేస్తామన్న సంవత్సరకాలం లోపు స్వాధీనం చేయనట్లయితే బిల్డర్ల నుండి డబ్బులు వాపసు తీసుకునే హక్కు వినియోగదారులకు ఉంటుందని సూచించింది.
సమయానికి మించి సంవత్సర కాలం అదనంగా గడిచిన నేపథ్యంలో బిల్డర్లు కొనుగోలుదారులు కోరిన పిమ్మట తిరిగి డబ్బు వాపస్ ఇవ్వాల్సిందేనని తేల్చి చెప్పింది.

సుప్రీంకోర్టు, మరియు వినియోగదారుల న్యాయస్థానాలు, న్యాయ సమీక్ష సంబంధిత ఫోరమ్లు గృహాన్ని కొనుగోలు చేసిన వినియోగదారుల విషయంలో బిల్డర్లు జాప్యానికి సంబంధించిన కేసులో పదే పదే గృహ కొనుగోలు దారులను వేచి ఉండడం సమంజసం కాదని సూచించింది. కానీ స్వాధీనం చేస్తామన్న సమయానికి స్వాధీనం చేయకుండా ఆలస్యం చేస్తే డబ్బు వాపసు చెల్లించవచ్చు అనేది ఎక్కడా వివరించలేదు.
ఇప్పుడు నేషనల్ కన్జ్యూమర్ డిస్ప్యూట్స్ రెడ్ రెస్సెల్ కమిషన్ బిల్డర్ అనుకున్న సమయానికి ఇంటిని స్వాధీనపరచకుండా ఇబ్బందికి గురి చేస్తుంటే, అది ఒక సంవత్సర కాల పరిమితి దాటితే తిరిగి బిల్డర్ నుండి డబ్బులు ఆశించవచ్చని కమీషన్ తేల్చి చెప్పింది. వినియోగదారుడికి ఆ హక్కు ఉందని రెడ్ రెస్సెల్ కమిషన్ ప్రేమ్ నారాయణ స్పష్టం చేశారు . 2012లో హర్యానాలోని లగ్జరీ హౌసింగ్ ప్రాజెక్టులో ప్లాట్లు కొన్న ఢిల్లీ నివాసి శలబ్ నిగమ్ కేసులో ఈ ఉత్తర్వులను జారీ చేసింది. గుర్గావ్ లో గ్రీన్ పోలీస్ లో ఆర్రిస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు త్రీ సీ కంపెనీ అభివృద్ధి చేసిన లగ్జరీ ఫ్లాట్లు నిర్మాణం విషయంలో వినియోగదారుడికి స్వాధీనం చేస్తామన్న సమయానికి ప్లాట్లు అందించని కారణంగా అతని డబ్బు తిరిగి వాపసు చేయాలంటూ కమీషన్ ఈ తీర్పునిచ్చింది.
More From GoodReturns

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

బంగారం, వెండి ధరలు ఈ రేటుకు దిగి వస్తేనే కొనండి.. కీలక సూచన చేస్తున్న బులియన్ నిపుణులు

TCS Q4 ఫలితాలు: ఇన్వెస్టర్ల అంచనాలను అందుకుంటుందా?



Click it and Unblock the Notifications