జూపల్లి రామేశ్వర రావు.. మైహైమ్ ఇండస్ట్రీస్ గ్రూప్ అధినేత. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పరిచయం అక్కరలేని పేరు. నిర్మాణ రంగం నుంచి రియల్ ఎస్టేట్, సిమెంట్ తదితర రంగాల్లో ఇప్పికే భారీగా విస్తరించిన గ్రూప్ ఇది. చినజీయర్ స్వామికి అత్యంత ప్రియభక్తుడు రామేశ్వరరావు. కొంతకాలంగా మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్ రంగాల్లోకి ప్రవేశించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా వార్తా ఛానల్ ప్రారంభించే యోచన చేసినట్లుగా వార్తలు కూడా వచ్చాయి.

అందుకే అలంద మీడియా
సుమారు పదివేల కోట్ల నికర ఆస్తులున్న ఆయన... రాజకీయంగాను పటిష్టంగా ఉండాలంటే వార్తా ఛానల్ దగ్గరిదారి అని భావించారట. ఆ ప్రయత్నంలో భాగంగానే 2015 అక్టోబర్‌లోనే ఆయన మైహోమ్ మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రయివేటు లిమిటెడ్ పేరుతో ఒక కంపెనీ కూడా ప్రారంభించారు. అయితే సరైన అవకాశం కోసం ఆయన వేచి చూశారని, TV9 ఛానళ్లు అమ్మకానికి ఉన్నాయని తెలిసి, వాటితో భాగస్వామి అవ్వాలని నిర్ణయించుకున్నారట. దీంతో కేవలం TV9 ఛానళ్ల కొనుగోలు కోసమే అలంద మీడియా పేరుతో ఒక కొత్త కంపెనీ ప్రారంభించారు.

MEIL డైరెక్టర్‌కు చోటు
అందులో వ్యాపార భాగస్వామి అయిన MEIL డైరెక్టర్‌కు చోటు ఇచ్చారు రామేశ్వర రావు. అలాగే స్వయంగా ఆయనే, అలంద మీడియా బోర్డులో చేరారు. రూ.500 కోట్లు వెచ్చించి TV9 ఛానళ్లను కొనుగోలు చేసినా TV9 బ్రాండ్ ఇమేజ్, సంస్థ లాభాల్లో ఉండటం బాగా కలిసొచ్చే అంశం.

భలే చౌక బేరం!
రెండు తెలుగు రాష్ట్రాల్లోను రామేశ్వర రావుకు చెందిన మైహోమ్ గ్రూప్ కార్యకలాపాలు ఉన్నాయి. ప్రస్తుత, భవిష్యత్తు, వ్యాపార, రాజకీయ అవసరాలకు బలమైన TV9 వంటి ఛానల్ తోడుంటే, సామాజికంగాను మరింత పలుకుబడి లభిస్తుందని భావించారట. పైగా, ఆయనకు ప్రస్తుత అధికార పార్టీలతోను సత్సంబంధాలు ఉండటం కూడా కలిసి వచ్చిందని అంటారు. దాదాపు అన్ని పెద్ద వ్యాపార సంస్థలు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో మీడియా రంగ ప్రవేశం చేస్తున్నాయి. కొందరు నష్టాలను సైతం లెక్క చేయకుండా కొనసాగుతుంటే, పట్టిందల్లా బంగారమే అనే చందంగా ఉన్న రామేశ్వర రావుకు లాభాల్లోనే ఉన్న నెంబర్ 1 TV9 ఛానల్ దొరకడం భలే మంచి చౌక బేరమే!
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications