ముంబై: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) - శ్రీశ్రీతత్వ మధ్య గురువారం నాడు వ్యూహాత్మక ఒప్పందం కుదిరింది. శ్రీశ్రీ రవిశంకర్‌కు చెందిన ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఎఫ్ఎంసీజీ విభాగమే శ్రీశ్రీతత్వ. ఈ ఒప్పందంతో ఎస్బీఐకి చెందిన మొబైల్ యాప్ యోనో ప్లాట్‌ఫారం ద్వారా శ్రీశ్రీ తత్వ అన్ని విభాగాలకు చెందిన 350కి పైగా ఉత్పత్తులపై 15 శాతం డిస్కౌంట్ (ఫ్లాట్) ఉంటుంది. ఇందులో ఆహారం, వ్యక్తిగత, ఆరోగ్య, గృహ సంరక్షణ ఉత్పత్తులు, బ్యోగి దుస్తులు, శంకరచర్మ సంరక్షణ ఉత్పత్తులు తదితరాలు ఉన్నాయి. వీటిని డిస్కౌంట్‌తో పొందవచ్చు.

ఈ ఉత్పత్తులపై ప్రత్యేక రాయితీ
యోనో వినియోగదారులకు తమ ఉత్పత్తులు అన్నింటిపై ప్రత్యేక రాయితీ ఇస్తామని శ్రీశ్రీ తత్వ ప్రకటించింది. ప్రస్తుతం యోనో యాప్‌ను కోట్లాది మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఈ భాగస్వామ్యం వల్ల ఎస్బీఐ ఆన్‌లైన్ ఖాతాదారులకు తమ ఉత్పత్తులు రాయితీపై లభిస్తాయని పేర్కొంది. మరింతమందికి తాము చేరువ అవుతామని శ్రీశ్రీ తత్వ మేనేజింగ్ డైరెక్టర్ అర్వింద్ వర్చస్వి తెలిపారు. సేంద్రియ, పరిమళ, ఆరోగ్యకర, ఆయుర్వేద ఉత్పత్తులన్నీ ఎస్బీఐ యోనో ఖాతాదార్లకు రాయితీపై అందుబాటులోకి వస్తాయని ఎస్బీఐ తెలిపింది.

ఒప్పందం
యోనో ద్వారా శ్రీశ్రీ తత్వతో వ్యూహాత్మక ఒప్పందం సంతోషంగా ఉందని, ఈ ఉత్పత్తుల ద్వారా యోనో మరింత మెరుగుబడుతుందని ఎస్బీఐ చైర్మన్ రజనీష్ కుమార్ అన్నారు. ప్రస్తుతం యోనోను 8 మిలియన్ల మంది కస్టమర్లను కలిగి ఉందని, శ్రీశ్రీ తత్వ ద్వారా మరింత ఆదరణ పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. స్టేట్ బ్యాంక్ వరల్డ్ క్లాస్ డిజిటల్ బ్యాంకింగ్ సేవలు ఇలాగే కొనసాగిస్తుందని, లైఫ్ స్టయిల్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుందని చెప్పేందుకు ఈ ఒప్పందమే ఉదాహరణ అన్నారు.

2 కోట్ల మంది డౌన్‌లోడ్
ఎస్బీఐ యోనో యాప్‌ను 2 మిలియన్ల మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు. కస్టమైజ్డ్ ప్రాడక్ట్స్, 90 ఈ-కామర్స్ ప్లేయర్స్ నుంచి సేవలు అందిస్తున్న తొలి డిజిటల్ బ్యాంకింగ్, లైఫ్‌స్టైల్ ప్లాట్‌ఫారం యోనో. ఆండ్రాయిడ్, ఐవోఎస్ మొబైల్ యూజర్లు యోనో యాప్‌కు యాక్సెస్ కావొచ్చు. వెబ్ బ్రౌజర్, ఓమ్నీ ఛానల్ ఎక్స్‌పీరియన్స్ కూడా ఫీల్ కావొచ్చు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..



Click it and Unblock the Notifications