For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

3 సెకండ్లలో లోన్ తీసుకోవచ్చు, ఈ బ్యాంకులో 4 గంటల్లో మీ అకౌంట్లోకి డబ్బులు

|

చాలామందికి వివిధ సందర్భాల్లో లోన్ అవసరం ఏర్పడుతుంది. వెకేషన్ ఖర్చులు, హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం పేమెంట్స్, మెడికల్ బిల్స్ లేదా ఇతర అనుకోని ఖర్చులు ఉంటాయి. ఇతర సందర్భాల్లోను లోన్ అవసరం ఏర్పడుతుంది. వివిధ బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు వివిధ రకాల ప్రయోజనాలతో పర్సనల్ లోన్స్ ఇస్తాయి. వ్యక్తిగత రుణ ప్రక్రియ బ్యాంకును బట్టి మారుతుంది.

హెచ్‌డీఎఫ్‌సీ వంటి బ్యాంకులు త్వరితగతిన, క్లిష్టమైన ప్రక్రియలు లేకుండా పర్సనల్ లోన్ ఇస్తాయి. కనీస డాక్యుమెంట్స్ అవసరం. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు కేవలం 60 సెకండ్లలో రుణ అర్హతను తెలియజేస్తుంది. మీకు ఎలిజబులిటీ ఉంటే ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అప్రూవల్ ప్రక్రియ ముగిసిన తర్వాత లోన్ దరఖాస్తు దారు అకౌంట్‌లోకి డబ్బు ట్రాన్సుఫర్ అవుతుంది. ఇది నాలుగు గంటల్లోనే పూర్తవుతుంది. హెచ్‌డిఎఫ్‌సి కస్టమర్లు 10 సెకండ్లలోనే మరింత వేగంగా, ప్రత్యేక వడ్డీ రేట్లతో రుణాలు పొందవచ్చు.

Personal Loan: Approval in just 3 seconds? What borrowers should know

ఐసీఐసీఐ బ్యాంకు కస్టమర్లు తమ లోన్ ఎలిజిబులిటీ టెస్ట్‌ను నాలుగు స్టెప్స్‌లలో తెలుసుకోవచ్చు. ఆ తర్వాత వారు పర్సనల్ లోన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్‌కు అదనపు బెనిఫిట్స్ ఉన్నాయి. ప్రక్రియ కూడా వేగవంతమవుతుంది. ఐసీఐసీఐ కస్టమర్ ప్రీ అప్రూవ్డ్ లోన్‌కు ఎలిజబుల్ అయితే, ఆ దరఖాస్తు అకౌంట్‌లో 3 సెకండ్లలో ఫండ్ పడుతుంది.

ఎన్‌బీఎఫ్‌సీలు కూడా పర్సనల్ లోన్ ఇచ్చేందుకు బ్యాంకులతో పోటీ పడుతున్నాయి. బజాజ్ పిన్ సర్వ్ నాలుగు స్టెప్స్‌లలో లోన్ ఎలిజిబులిటీని తెలియజేస్తుంది. అప్రూవల్ అనంతరం డాక్యుమెంట్లు ఇస్తే 24 గంటల్లో అకౌంట్లోకి డబ్బులు వస్తాయి. ఆదిత్య బిర్లా ఫైనాన్స్ కూడా లోన్‌ను వేగంగానే అందిస్తోంది. ఇక్కడ అప్రూవల్‌కు అరగంట పడుతుంది. లోన్ మంజూరు ప్రక్రియ ఆన్‌లైన్ ద్వారా పూర్తవుతుంది.

English summary

3 సెకండ్లలో లోన్ తీసుకోవచ్చు, ఈ బ్యాంకులో 4 గంటల్లో మీ అకౌంట్లోకి డబ్బులు | Personal Loan: Approval in just 3 seconds? What borrowers should know

Several individuals opt for personal loans for various aspects wherein one needs to meet a variety of financial requirements.
Story first published: Friday, May 17, 2019, 17:59 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X