For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇన్ఫోసిస్ బంపర్ బొనాంజా: సీఈవోకు రూ.10 కోట్లు, సీవోవోకు రూ.4 కోట్లు, ఉద్యోగులకు రూ.5 కోట్ల షేర్లు

|

గ్లోబల్ సాఫ్ట్‌వేర్ దిగ్గజం ఇన్ఫోసిస్ గురువారం తమ ఉద్యోగులకు బంపర్ బొనాంజా ఇచ్చింది. అలాగే, కంపెనీ సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ సీల్ల్ పరేఖ్‌కు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చింది. పనితీరు ఆధారంగా ఉద్యోగులకు అందించే ప్రోత్సాహకాల్లో రూ.10 కోట్ల మార్కెట్ విలువ కలిగి ఉన్న పరిమిత స్టాక్ యూనిట్లు (ఆర్ఎస్‌యూ)ను ఆయనకు కేటాయించింది. మరో కీలక ఎగ్జిక్యూటివ్ సీఓఓ యూబీ ప్రవీణ్ రావుకు రూ.4 కోట్ల విలువైన షేర్లను కేటాయించింది. రూ.5 కోట్ల విలువైన షేర్లను ఉద్యోగులకు కేటాయించాలని నిర్ణయించింది. ఈ మేరకు 'ఎక్స్‌పాండెడ్‌ స్టాక్ ఓనర్‌షిప్ ప్రోగ్రాం 2019' (ఎంప్లాయి స్టాక్ ఓనర్‌షిప్ ప్లాన్-ESOP) బోర్డు ప్రతిపాదనలు ఆమోదించింది. దీనికి వాటాదారుల ఆమోదం ఒక్కటే మిగిలి ఉంది.

బలపడిన రూపాయి, స్వల్పంగా పెరిగిన బంగారం ధరబలపడిన రూపాయి, స్వల్పంగా పెరిగిన బంగారం ధర

ఉద్యోగుల పనితీరు ఆధారంగా షేర్ల కేటాయింపు

ఉద్యోగుల పనితీరు ఆధారంగా షేర్ల కేటాయింపు

ఇన్ఫోసిస్ దేశంలో అతిపెద్ద రెండో ఐటీ దిగ్గజం. ఇది ఉద్యోగుల వలస రేటును తగ్గించుకునేందుకు షేర్ల రూపంలో ప్రోత్సాహకాలు కేటాయిస్తోంది. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు షేర్ల రూపంలో ప్రోత్సాహకాలు అందిస్తుంది. దీని కింద 2019 ఏడాదికి గాను 50 కోట్ల షేర్లను కేటాయించాలనే ప్రతిపాదనకు బోర్డు గురువారం అంగీకరించింది. వాటాదార్ల ఆమోదం లభించిన తేదీ నుంచి ఈ స్కీం అమల్లోకి వస్తుంది. ఈ షేర్లు కంపెనీ ఈక్విటీ మూలధన వాటాలో దాదాపు 1.15 శాతానికి సమానం. ఈ కేటాయింపు ఉద్యోగుల పనితీరు ప్రమాణాలపై ఆధారపడి ఉంటుంది.

ఇన్ఫోసిస్ మార్గదర్శి

ఇన్ఫోసిస్ మార్గదర్శి

భారత ఐటీ పరిశ్రమలో అనేక అంశాల్లో ఇన్ఫోసిస్ మార్గదర్శిగా ఉందని, ముఖ్యంగా ఆర్ఎస్‌యూ (పరిమిత స్టాక్ యూనిట్లు) కేటాయింపులు కీలకమైన మైలురాయి లాంటిదని కంపెనీ సీఈవో ఫరేక్ అన్నారు. ఉద్యోగులే తమకు పెద్ద అసెట్ అన్నారు. దీంతో నిరంతర, స్థిరమైన పనితీరుతో విలువైన సేవలు అందించిన తమ సీనియర్ ఉద్యోగులను గుర్తించి, గౌరవించడం తమ లక్ష్యమని చెప్పారు. కంపెనీ దీర్ఘకాల విజయానికి పాటుపడిన ఉద్యోగులను యజమానులను చేయడం ద్వారా వారి శ్రమకు, నిబద్దతకు ప్రతిఫలం లభిస్తుందన్నారు.

సీఈవో, సీవోవోలకు భారీ భారీ నజరానా

సీఈవో, సీవోవోలకు భారీ భారీ నజరానా

మార్చి 2019 త్రైమాసికం చివరకు ఇన్ఫోసిస్‌లో మొత్తం 2.28 లక్షల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో వలసల రేటు 19.5 శాతం కాగా, ఈసారి అది 20.4 శాతంగా ఉంది. కాగా, కంపెనీ సీఈవో, ఎండీ సలీల్ పరేఖ్‌కు రూ.10 కోట్ల విలువ షేర్లు, సీవోవో యూబీ ప్రవీణ్ రావుకు రూ.4 కోట్ల విలువైన షేర్లు అందజేయనున్నారు.

English summary

ఇన్ఫోసిస్ బంపర్ బొనాంజా: సీఈవోకు రూ.10 కోట్లు, సీవోవోకు రూ.4 కోట్లు, ఉద్యోగులకు రూ.5 కోట్ల షేర్లు | Infosys plans to give Salil Parekh Rs 10 crore in stock incentive

The Infosys board of directors has approved the the Infosys Expanded Stock Ownership Program 2019 that links long term employee incentives with shareholder value creation.
Story first published: Friday, May 17, 2019, 10:57 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X