దేశవ్యాప్తంగా ఎన్నికలు చివరి దశకు చేరుకుంటున్నాయి. మే 19న చివరిదైన ఏడో విడత పోలింగ్ జరగనుంది. ఆ వెంటనే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు రానున్నాయి. ఎగ్జిట్ పోలస్ రాజకీయవర్గాల్లో చాలా ఆసక్తిని రేపుతుంటే మరోవైపు స్టాక్‌మార్కెట్లు కూడా ఈ ఎగ్జిట్ పోల్స్ పైనే ఆధారపడి ఉన్నాయి. ఎగ్జిట్ పోల్స్ వెలువడేందుకు ఇంకాస్త సమయం ఉన్న నేపథ్యంలో స్టాక్ మార్కెట్లలో కాస్త పెరుగుదల కనిపించింది.మే 23న అసలైన ఫలితాలు రానుండగా... అంతకంటే ముందు ఎగ్జిట్ ఫలితాలతో దాదాపుగా ఏ ప్రభుత్వం కేంద్రంలో వస్తుందో ఒక అంచనాకు వచ్చేయొచ్చు.

ఎగ్జిట్ పోల్స్ వర్సెస్ స్టాక్ మార్కెట్లు
ఇక ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ ఆ ఫలితాల ప్రభావం మార్కెట్ పై ఎక్కువ కాలం ఉండదని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే మే 19న రానున్న ఎగ్జిట్ ఫలితాలపై ఇన్వెస్టర్లు ఎందుకు ఆసక్తిగా చూస్తున్నారు అని అంటే ఎగ్జిట్ పోల్స్ కొన్ని సార్లు నిజం అయ్యే అవకాశం ఉంది అదే సందర్భంలో తప్పయ్యే ప్రమాదం ఉంది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాల ఆధారంగా కేంద్రంలో ఏప్రభుత్వం వస్తుందో అనే అంచనాకు వచ్చేస్తారు. దానికి అనుగుణంగా రెండు నెలల తర్వాత మార్కెట్ల పరిస్థితి ఎలాగుంటుందో ఒక అంచనాకు వచ్చి ఆయా రంగాల్లో తమ డబ్బులను ఇన్వెస్టర్లు ఇన్వెస్ట్ చేస్తారు.

కాస్త పుంజుకున్న మార్కెట్లు
ఇక భారత మార్కెట్లో బీఎస్ఈ సెన్సెక్స్ ఎన్ఎస్ఈ నిఫ్టీలు రెండు బెంచ్‌మార్కులుగా ఉన్నాయి. 9 రోజుల వరుస నష్టాల తర్వాత బుధవారం రోజున మార్కెట్లు మళ్లీ కాస్త కోలుకున్నాయి. మార్కెట్లు కాస్త కోలుకున్నప్పటికీ... ఇన్వెస్టర్లలో మాత్రం ఆందోళన తగ్గలేదు. ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయన్నదానిపైనే వారు ఆధారపడి ఉన్నారు. ఇక గురువారం మార్కెట్లు స్వల్ప లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 278.60 పాయింట్ల లాభాలతో ముగియగా నిఫ్టీ 11,250 పాయింట్లతో ట్రేడ్ అయ్యింది. అది కూడా ఐటీ, మెటల్ స్టాక్స్ లాభాల బాటపట్టడంతో ఇది నమోదైంది. లేదంటే గురువారం కూడా నష్టాల్లోనే మార్కెట్లు ముగిసేవి.

మార్కెట్ల పై ఎగ్జిట్ పోల్స్ ప్రభావం ఎంత..?
మరికొద్దిరోజుల్లో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వస్తాయనగా.. బీఎస్ఈ సెన్సెక్స్ మొత్తం మీద 2వేల పాయింట్లు కోల్పోయింది. ఇంకాస్త క్లుప్తంగా చెప్పాలంటే ఏప్రిల్ 26వ తేదీ నుంచి రెండ్రోజుల క్రితం వరకు సెన్సెక్స్ 1977 పాయింట్లు నష్టపోయింది. మరోవైపు నిఫ్టీ 600 పాయింట్లు నష్టపోయింది. దీనికితోడు అమెరికా చైనా మధ్య నడుస్తున్న వాణిజ్య యుద్దం, లోక్‌సభ ఎన్నికల ఫలితాల ప్రభావం స్టాక్ మార్కెట్లపై తీవ్రంగా చూపుతోందని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈక్విటీ మార్కెట్లు ఎప్పటికీ స్థిరత్వాన్ని కోరుకుంటాయనేది బహిరంగ రహస్యమే. అయితే దేశీయంగా కానీ అంతర్జాతీయంగా కానీ ఏదైనా ఒడిదుడుకులు చోటుచేసుకుంటే ఆ ప్రభావం స్టాక్‌మార్కెట్లపై తప్పకుండా పడుతుంది. ఈ క్రమంలోనే రేపు 19వ తేదీన విడుదల కానున్న ఎగ్జిట్ ఫలితాల అంచనాలు తారుమారైనప్పటికీ స్టాక్ మార్కెట్లలో కాస్త ఒడిదుడుకులు ఉంటాయని అదికూడా స్వల్పకాలంలో మాత్రమే ఇది కనిపిస్తుందని ఆ తర్వాత పరిస్థితి సాధారణ స్థాయికి చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ట్రేడర్లు.

బాట నష్టాల్లో పయనించినప్పటికీ అది స్వల్పకాలం మాత్రమే
ఇక ఎగ్జిట్ పోల్ ఫలితాలపై మార్కెట్ ఫలితాలు ఎలా ఆధారపడి ఉంటాయో ఒకసారి చూస్తే.... గతేడాది ఐదురాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అందులో మూడు ప్రధాన రాష్ట్రాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. అంతకంటే ముందు విడుదలైన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలతో సెన్సెక్స్ 650 పాయింట్లు కోల్పోగా... నిఫ్టీ దాదాపు 1.5శాతం నష్టాల్లో ట్రేడ్ అయ్యింది. దీనికి తోడు చమురు ధరల పెంపు, ఇతరత్రా అంశాలు కూడా తోడవడంతో మార్కెట్లు నష్టాలు చవిచూశాయి. ఆ తర్వాత కొన్ని నెలల్లోనే మార్కెట్లు మళ్లీ పుంజుకున్నాయి. అయితే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో మార్కెట్లు పెద్దగా ప్రభావితం కావని కేంద్రంలో వచ్చే ప్రభుత్వం వ్యాపారాలకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోనంత వరకూ బాగానే ర్యాలీ అవుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక అప్పటి వరకు అంటే డిసెంబరు 11న ఫలితాలు వెలువడనంత వరకు నష్టాల్లో పయనించిన మార్కెట్లు... ఆ తర్వాత మూడు బీజేపీ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పాగా వేయగానే సెన్సెక్స్ 200 పాయింట్లు నిఫ్టీ 10,500 మార్కును తాకడం విశేషం.
మొత్తానికి ఎగ్జిట్ పోల్ ఫలితాలు కాస్త తారుమారైతే మార్కెట్లపై ఆ ప్రభావం కనిపిస్తుంది. కానీ అది స్వల్ప కాలం మాత్రమే ఉంటుందని ఆ తర్వాత తిరిగి సాధారణ స్థితికి చేరుకుని పుంజుకునే అవకాశాలు ఉంటాయని మార్కెట్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications