For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రెండు నెలల్లో బెస్ట్ వారం.. సెన్సెక్స్ 500 పాయింట్ల జంప్

By Chanakya
|

ఎగ్జిట్ పోల్స్‌లో మోడీ ప్రభుత్వానికి పాజిటివ్‌గా రావొచ్చనే అంచనాలతోపాటు షార్ట్ కవరింగ్‌ నేపధ్యంలో సెన్సెక్స్, నిఫ్టీలు భారీగా లాభపడ్డాయి. రెండు నెలల్లో బెస్ట్ వీక్లీ గెయిన్స్‌ను నమోదు చేశాయి. వారాంతంలో రెట్టించిన ఉత్సాహంతో పెరిగిన నిఫ్టీ మళ్లీ 11వేల400 పాయింట్ల మార్కును దాటింది. సెన్సెక్స్ ఏకంగా 500 పాయింట్లు పెరిగింది. బ్యాంకింగ్, ఆటో, ఫైనాన్షియల్ సర్వీసెస్ సహా వివిధ రంగాలకు మంచి కొనుగోళ్ల మద్దతు లభించింది. చివరకు సెన్సెక్స్ 537 పాయింట్ల లాభంతో 37వేల 931 దగ్గర క్లోజైంది. నిఫ్టీ 150 పాయింట్లు పెరిగి 11,407 దగ్గర ముగిసింది. బ్యాంక్ నిఫ్టీ ఏకంగా 600 పాయింట్లు పెరిగి 29450 దగ్గర స్థిరపడింది.

జీ ఎంటర్‌టైన్మెంట్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, హీరో మోటోకార్ప్, మారుతి సుజుకి టాప్ ఫైవ్ గెయినర్స్‌గా నిలిచాయి. యెస్ బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, వేదాంతా, హిందాల్కో, ఇన్ఫోసిస్ షేర్లు లూజర్స్ జాబితాలో చేరాయి.

Bulls take charge ahead of exit polls: Sensex up 537 pts: Nifty over 11,400

బజాజ్ ఫిన్ సర్వ్ రికార్డ్ రన్
మెరుగైన త్రైమాసిక ఫలితాల నేపధ్యంలో బజాజ్ ఫిన్ సర్వ్ ఎగిరి గంతేసింది. ఆదాయంలో 41.6 శాతం, నికర లాభంలో 32 శాతం వృద్ధిని నమోదు చేసింది బజాజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్. ఒక్కో షేర్‌కు రూ.2.5 డివిడెండ్‌ను కూడూ ప్రకటించింది. చివరకు స్టాక్ 4.5 శాతం లాభంతో రూ.7993 మార్కు దగ్గర స్థిరపడింది. ఈ స్టాక్ 52 వారాల గరిష్ట స్థాయి (8029.75) ని తాకింది. ఇదే సంస్థకు చెందిన మరో స్టాక్ బజాజ్ ఫైనాన్స్ కూడా 52 వారాల గరిష్టాన్ని తాకింది (రూ.3316). చివరకు రూ.3295 దగ్గర క్లోజైంది.

అరబిందో ఫార్మాకు ఎఫ్.డి.ఏ షాక్
అరబిందో ఫార్మాకు చెందిన ఏపీఐ ప్లాంట్స్‌లో అఫిషియల్ యాక్షన్ ఇండికేటెడ్ (ఏఓఐ) లెటర్స్ వచ్చినట్టు వార్తలందాయి. అయితే దీనికి తాము సమాధానాలు ఇచ్చినట్టు యాజమాన్యం ప్రకటించినప్పటికీ స్టాక్ మాత్రం ఏకంగా 10 శాతం వరకూ కుప్పకూలింది. చివరకు 7.23 శాతం నష్టంతో రూ.670.25 దగ్గర స్టాక్ స్థిరపడింది.

2 నెలల కనిష్టానికి అర్వింద్ ఫ్యాషన్స్..
అర్వింద్ ఫ్యాషన్స్ స్టాక్ టార్గెట్ ప్రైస్‌ను సిఎల్ఎస్ఏ తగ్గించింది. రూ.1294 నుంచి రూ.1126కి టార్గెట్ కట్ చేసింది. అయితే బయ్ రేటింగ్‌ను కొనసాగించింది. అయినా స్టాక్ మాత్రం నీరసించింది. చివరకు 9 శాతం నష్టంతో రూ.769 దగ్గర క్లోజైంది.

డాక్టర్ రెడ్డీస్ లాభం పెరిగింది..స్టాక్ పడింది
ప్రముఖ ఫార్మా సంస్థ డాక్టర్ రెడ్డీస్ స్టాక్ నాలుగో త్రైమాసిక ఫలితాలను వెల్లడించింది. ఆదాయంలో 14 శాతం, నికర లాభంలో 44 శాతం వృద్ధి నమోదైంది. ఎబిటాలో 52 శాతం వృద్ధి సాధించింది డాక్టర్ రెడ్డీస్. మార్జిన్లు 16.3 నుంచి 21.9 శాతానికి పెరిగాయి. చివరకు స్టాక్ మాత్రం 2.2 శాతం నష్టపోయి రూ.2748 దగ్గర ముగిసింది.

డెల్టాకార్ప్ డౌన్డె
ల్టా కార్ప్ స్టాక్ మళ్లీ నీరసించింది. స్పష్టమైన కారణమేదీ తెలియకపోయినప్పటికీ స్టాక్ ఏకంగా 17 శాతం వరకూ పడింది. ఇంట్రాడేలో రూ.156 వరకూ దిగొచ్చింది. చివరకు రూ.165 దగ్గర స్టాక్ క్లోజైంది.

52 వారాల గరిష్టానికి..
మార్కెట్ ఒడిదుడుకులకు లోనవుతున్నా.. కొన్ని స్టాక్స్ మాత్రం పైపైకి దూకుతున్నాయి. ఇందులో అతుల్, ఆవాస్ ఫైనాన్షియర్స్, డిసిఎం శ్రీరాం, ఫెయిర్ కెమ్ స్పెషాలిటీ, ఐసిఐసిఐ లంబార్డ్, కొటక్ మహీంద్రా బ్యాంక్, మెర్క్, ఎస్ఆర్ఎఫ్, టైటన్, యూపిఎల్ స్టాక్స్ ఉన్నాయి.

ఇదే సమయంలో ఏకంగా 160కిపైగా స్టాక్స్ 52 వారాల కనిష్టానికి చేరాయి. అందులో అసీల్యా కాలే, అక్షర కెమ్, అపెక్స్ ఫ్రోజెన్, బయోకాన్, బాంబే బర్మా ట్రేడింగ్, ఎల్.టి. ఫుడ్స్, డాలర్ ఇండస్ట్రీస్, ఫియం ఇండస్ట్రీస్, హైటెక్ గేర్స్, ఇండియా టూరిజం డెవలప్మెంట్, లుమాక్స్, నీల్‌కమల్, ఎస్ చాంద్, టైడ్ వాటర్ ఆయిల్, టివిఎస్ శ్రీచక్ర వంటి స్టాక్స్ ఉన్నాయి.

English summary

రెండు నెలల్లో బెస్ట్ వారం.. సెన్సెక్స్ 500 పాయింట్ల జంప్ | Bulls take charge ahead of exit polls: Sensex up 537 pts: Nifty over 11,400

The benchmark Sensex zoomed almost 1.5 per cent, up 537 points, to close at 37,931, with Bajaj Finance, Hero MotoCorp, Maruti Suzuki India, Kotak Bank, and Bajaj Auto registering the biggest gains. Market breadth remained in favour of buyers with the advance decline ratio at 3:2.
Story first published: Friday, May 17, 2019, 17:30 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X