For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

TV9 రవిప్రకాశ్‌కు అప్పుడు ఉన్నదేమిటి, ఇప్పుడు లేనిదేమిటి?

By Jai
|

TV9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌కు డైనమిక్ జర్నలిస్టుగా పేరుంది. ఆయన తెలుగులో వచ్చిన మొట్టమొదటి వార్తా చానల్‌కు సీఈవో అవడానికి అది కూడా ప్రధాన కారణమే. వార్తలను నిర్భయంగా జనాలకు అందించే సత్తా ఉందని పలు సందర్భాల్లో నిరూపించుకున్నాడు కూడా. ఎవరు ప్రసారం చేయలేమని చేతులు ఎత్తేసే వార్తలను సైతం ధైర్యంగా TV9లో క్యాస్ట్ చేయడం ద్వారా తెలుగు వార్తా ఛానళ్లలో TV9 ఒక సంచలనం అయింది.

డైనమిక్ రవిప్రకాశ్

డైనమిక్ రవిప్రకాశ్

కేవలం ఒక వ్యక్తి డైనమిక్ అయినంత మాత్రాన ఏ సంస్థా పూర్తి బాధ్యతలను అప్పగించే ప్రయత్నం చేయదు. అందునా, ఒక వార్తా ఛానల్ పూర్తిస్థాయి బాధ్యతలను ఒక జర్నలిస్టుకు కట్టబెట్టే సాహసం చేయదు. కానీ TV9 పాత యాజమాన్యం అయిన అసోసియేటెడ్ బ్రాడ్ కాస్టింగ్ కంపెనీ లిమిటెడ్ (ఏబీసీఎల్) మాత్రం రవిప్రకాశ్‌కు 100 శాతం బాధ్యతలను, అలాగే పూర్తి స్వేచ్ఛను ఇచ్చింది. ఎడిటోరియల్ వ్యవహారాల్లో జోక్యం చేసుకోలేదు. ఈ స్వేచ్ఛ కారణంగానే TV9 అంటే రవిప్రకాశ్.. రవిప్రకాశ్ అంటే TV9 అనేంత పాపులారిటీ వచ్చింది.

స్వేచ్ఛకు కత్తెర ప్రయత్నం

స్వేచ్ఛకు కత్తెర ప్రయత్నం

అయితే ఇటీవలే TV9 ఛానళ్లను కొనుగోలు చేసిన అలంద మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రయివేటు లిమిటెడ్ రవిప్రకాశ్ స్వేచ్ఛకు కత్తెర వేసే ప్రయత్నం చేసింది. అది కూడా అతనికి తెలియకుండా రంగప్రవేశం చేసిన మైహోమ్ ఇండస్ట్రీస్ అధినేత రామేశ్వర రావు ఆగమనంతో ఎక్కువైందని విశ్లేషకుల అభిప్రాయం.

సహాయ నిరాకరణ

సహాయ నిరాకరణ

ఒకవైపు అభద్రతాభావం, మరోవైపు స్వేచ్ఛను హరించే ప్రయత్నాలు మొదలయ్యేసరికి రవిప్రకాశ్‌కు ఏం చేయాలో తోచక కొత్త మేనేజ్‌మెంట్‌కు సహాయ నిరాకరణ చేస్తూ వచ్చారట. దాని ఫలితమే సీఈవో పదవి నుంచి ఆయనకు ఉద్వాసన పలకడం అని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

Read more about: ravi prakash
English summary

TV9 రవిప్రకాశ్‌కు అప్పుడు ఉన్నదేమిటి, ఇప్పుడు లేనిదేమిటి? | Why Ravi Prakash sacked from TV9?

Why TV9 former CEO Ravi Prakash sacked from TV9 news channel. Now, He is facing two cases against him.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X